యెషయా 9:1-21

  • గలిలయ ప్రాంతానికి గొప్ప వెలుగు (1-7)

    • “శాంతికి అధిపతి” అయిన వ్యక్తి పుట్టుక (6, 7)

  • ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా దేవుని చెయ్యి (8-21)

9  కానీ ఆ అంధకారం, దేశం మీదికి కష్టం వచ్చినప్పటి అంధకారంలా ఉండదు; అంటే జెబూలూను దేశం, నఫ్తాలి దేశం నీచంగా చూడబడినప్పటి+ అంధకారంలా ఉండదు. అయితే ఆ తర్వాతి కాలంలో ఆయన దానికి, అంటే సముద్రం వైపున్న మార్గాన యొర్దాను ప్రాంతంలో ఉన్న అన్యజనుల గలిలయకు ఘనతను కలగజేస్తాడు.  2  చీకట్లో నడుస్తున్న ప్రజలుగొప్ప వెలుగును చూశారు. గాఢాంధకారంలో నివసించే ప్రజల మీదవెలుగు ప్రకాశించింది.+  3  నువ్వు ఆ దేశ జనాభాను ఎక్కువ చేశావు,దాని సంతోషాన్ని అధికం చేశావు. ప్రజలు కోతకాలంలో సంతోషించినట్టు,దోపుడుసొమ్మును పంచుకునేవాళ్లు సంతోషించినట్టువాళ్లు నీ ముందు సంతోషిస్తారు.  4  మిద్యాను ఓడిపోయిన రోజున+ చేసినట్టే,వాళ్ల బరువైన కాడిని నువ్వు విరగ్గొట్టావు,అంటే వాళ్ల భుజాల మీదున్న కర్రను, వాళ్ల యజమాని* దండాన్ని విరగ్గొట్టావు.  5  కవాతు చేస్తూ భూమిని అదిరేలా చేసిన ప్రతీ కాలిజోడు,రక్తంలో నానిన ప్రతీ వస్త్రంఅగ్నిచేత దహించబడుతుంది.  6  ఎందుకంటే మనకు ఒక శిశువు పుట్టాడు,+మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడ్డాడు;ఆయన భుజం మీద రాజ్యాధికారం* ఉంటుంది.+ అద్భుతమైన సలహాదారుడు,+ బలవంతుడైన దేవుడు,+ నిత్యుడైన తండ్రి, శాంతికి అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడుతుంది.  7  ఆయన రాజ్యాధికారం* పెరుగుతూ పోతుంది,అంతులేని శాంతి ఉంటుంది.+ఇప్పటినుండి సదాకాలం వరకునీతిన్యాయాలతో+దాన్ని సుస్థిరం చేయడానికి,+ బలపర్చడానికిదావీదు సింహాసనం+ మీద, అతని రాజ్యం మీద ఆయన పరిపాలన చేస్తాడు. సైన్యాలకు అధిపతైన యెహోవా ఆసక్తితో దీన్ని జరిగిస్తాడు.  8  యెహోవా యాకోబుకు వ్యతిరేకంగా ఒక ప్రకటన చేశాడు,అది ఇశ్రాయేలు మీదికి వచ్చింది.+  9  దాని గురించి ప్రజలందరికీ,అంటే ఎఫ్రాయిముకు, సమరయ నివాసులకు తెలుస్తుంది.గర్వంతో, పొగరెక్కిన హృదయంతో వాళ్లు ఇలా అనుకుంటున్నారు: 10  “ఇటుకలు కూలిపోయాయి,అయితే ఏంటి? చెక్కిన రాళ్లతో కడదాం.+ అత్తి చెట్లు నరికేయబడ్డాయి,అయితే ఏంటి? వాటి స్థానంలో దేవదారు చెట్లు నాటుదాం.” 11  యెహోవా రెజీను విరోధుల్ని అతనికి వ్యతిరేకంగా నిలబెడతాడు,అతని శత్రువుల్ని ఆయన రేపుతాడు. 12  తూర్పు నుండి సిరియా, పడమటి నుండి* ఫిలిష్తీయులు+నోరు తెరిచి ఇశ్రాయేలును మింగేస్తారు.+ ఇంత జరిగినా ఆయన కోపం చల్లారలేదు,వాళ్లను శిక్షించడానికి ఆయన చెయ్యి ఇంకా చాపబడే ఉంది.+ 13  ఎందుకంటే, ప్రజలు తమను శిక్షిస్తున్న దేవుని దగ్గరికి తిరిగిరాలేదు,వాళ్లు సైన్యాలకు అధిపతైన యెహోవాను వెదకలేదు.+ 14  యెహోవా ఇశ్రాయేలు నుండి ఒకేరోజునతలను, తోకను; రెమ్మను, రెల్లును* నరికేస్తాడు.+ 15  బాగా గౌరవించబడే పెద్ద, తల లాంటివాడు,తప్పుడు ఉపదేశమిచ్చే ప్రవక్త, తోక లాంటివాడు.+ 16  ఈ ప్రజల్ని నడిపించేవాళ్లే వాళ్లను దారితప్పి తిరిగేలా చేస్తున్నారు,అలా నడుస్తున్నవాళ్లు అయోమయంలో ఉన్నారు. 17  అందుకే వాళ్ల యువకుల్ని చూసి యెహోవా సంతోషించడు,వాళ్లలోని తండ్రిలేని పిల్లల* మీద, విధవరాళ్ల మీద ఆయన కరుణ చూపించడు,ఎందుకంటే వాళ్లంతా మతభ్రష్టులు, చెడు చేసే ప్రజలు;+ప్రతీ నోరు అర్థంపర్థంలేని మాటలు మాట్లాడుతోంది. ఇంత జరిగినా ఆయన కోపం చల్లారలేదు,వాళ్లను శిక్షించడానికి ఆయన చెయ్యి ఇంకా చాపబడే ఉంది.+ 18  ఎందుకంటే దుష్టత్వం అగ్నిలా మండుతుంది,అది ముళ్లపొదల్ని, పిచ్చి చెట్లను కాల్చేస్తుంది. అది అడవిలోని దట్టమైన పొదల్ని తగలబెడుతుంది,వాటి పొగ మేఘాల్లా పైకి లేస్తుంది. 19  సైన్యాలకు అధిపతైన యెహోవా కోపాగ్నితోదేశం మండిపోతూ ఉంది,ప్రజలు ఆ అగ్నిలో దహించుకుపోతారు. ఏ వ్యక్తీ కనీసం తన సహోదరుని మీద కూడా జాలి చూపించడు. 20  ఒక వ్యక్తి తన కుడిపక్కను నరికేసుకుంటాడుకానీ అతని ఆకలి తీరదు;అతను తన ఎడమపక్క మాంసాన్ని తింటాడు,అప్పటికీ అతని కడుపు నిండదు. ప్రతీ వ్యక్తి తన సొంత బాహువు మాంసాన్ని మింగుతాడు. 21  మనష్షే ఎఫ్రాయిమును మింగుతాడు,ఎఫ్రాయిము మనష్షేను మింగుతాడు. వాళ్లిద్దరూ కలిసి యూదాకు వ్యతిరేకంగా తిరుగుతారు.+ ఇంత జరిగినా ఆయన కోపం చల్లారలేదు,వాళ్లను శిక్షించడానికి ఆయన చెయ్యి ఇంకా చాపబడే ఉంది.+

అధస్సూచీలు

లేదా “పనులు చేయించే వ్యక్తి.”
లేదా “ప్రభుత్వం; రాచరికం.”
లేదా “ప్రభుత్వం; రాచరికం.”
అక్ష., “వెనుక నుండి.”
లేదా “తాటిమట్టను, జమ్మును” అయ్యుంటుంది.
లేదా “అనాథల.”