యెషయా 54:1-17
54 “గొడ్రాలా, పిల్లలు కననిదానా, సంతోషంతో కేకలు వేయి!
ఎన్నడూ పురిటినొప్పులు పడనిదానా,+ సంతోషించు, ఆనందంతో కేకలు వేయి;+ఎందుకంటే, భర్త* ఉన్న స్త్రీ పిల్లల* కన్నావదిలేయబడిన స్త్రీ పిల్లలే చాలా ఎక్కువమంది”+ అని యెహోవా అంటున్నాడు.
2 “నీ డేరా స్థలాన్ని విశాలపర్చు.
నీ గొప్ప డేరా తెరల్ని పెద్దవి చేయి.
హద్దులు పెట్టుకోకు;నీ డేరా తాళ్లను పొడుగ్గా, వాటి మేకుల్ని బలంగా చేయి.+
3 ఎందుకంటే నువ్వు కుడివైపుకు, ఎడమవైపుకు విస్తరిస్తావు.
నీ సంతానం దేశాల్ని స్వాధీనం చేసుకుంటుంది,వాళ్లు నిర్మానుష్యంగా ఉన్న నగరాల్లో నివసిస్తారు.+
4 భయపడకు,+ ఎందుకంటే నువ్వు సిగ్గుపర్చబడవు;+అవమానించబడినట్టు భావించకు, ఎందుకంటే నువ్వు నిరాశపర్చబడవు.
నీ యౌవనం నాటి అవమానాన్ని నువ్వు మర్చిపోతావు,నువ్వు విధవరాలిగా ఉన్నప్పటి తలవంపుల్ని నువ్విక గుర్తుచేసుకోవు.”
5 “ఎందుకంటే నీ మహాగొప్ప రూపకర్త+ నీకు భర్త* లాంటివాడు,+ఆయన పేరు సైన్యాలకు అధిపతైన యెహోవా,ఇశ్రాయేలు పవిత్ర దేవుడే నీ విమోచకుడు.+
ఆయన భూమంతటికీ దేవుడు అని పిలవబడతాడు.+
6 ఎందుకంటే వదిలేయబడి, పుట్టెడు దుఃఖంలో ఉన్న భార్యను పిలిచినట్టు,+యౌవనంలో పెళ్లయి, ఆ తర్వాత తిరస్కరించబడిన భార్యను పిలిచినట్టు యెహోవా నిన్ను పిలిచాడు” అని నీ దేవుడు అంటున్నాడు.
7 “ఒక్క క్షణంపాటు నేను నిన్ను వదిలేశాను,కానీ గొప్ప కరుణతో నిన్ను వెనక్కి తెచ్చుకుంటాను.+
8 విపరీతమైన కోపంలో క్షణకాలం నీ నుండి నా ముఖాన్ని దాచుకున్నాను,+కానీ శాశ్వతమైన విశ్వసనీయ ప్రేమతో నీ మీద కరుణ చూపిస్తాను”+ అని నీ విమోచకుడైన+ యెహోవా అంటున్నాడు.
9 “ఇది నాకు నోవహు రోజుల లాంటిదే.+
నోవహు కాలంలోని జలాలు ఇకమీదట భూమిని ముంచెత్తవని నేను ప్రమాణం చేసినట్టే,+ఇంకెప్పుడూ నీ మీద కోప్పడనని, నిన్ను గద్దించనని ప్రమాణం చేస్తున్నాను.+
10 పర్వతాలు తొలగిపోయినా,కొండలు కదిలినా,నీ మీద నాకున్న విశ్వసనీయ ప్రేమ తొలగిపోదు,+నా శాంతి ఒప్పందం చెక్కుచెదరదు”+ అని నీ మీద కరుణ ఉన్న యెహోవా+ అంటున్నాడు.
11 “కష్టాల్లో ఉన్నదానా,+ తుఫాను బారినపడినదానా, ఓదార్పు దొరకనిదానా,+నేను నీ రాళ్లను గట్టి సున్నంతో* కడతాను,నీలం రాళ్లతో నీ పునాదిని వేస్తాను.+
12 నేను నీ కోట బురుజుల్ని మాణిక్యాలతో,నీ ద్వారాల్ని మెరిసే రాళ్లతో,*నీ సరిహద్దులన్నిటినీ ప్రశస్తమైన రాళ్లతో కడతాను.
13 నీ పిల్లలందరూ* యెహోవా చేత బోధించబడతారు,+నీ పిల్లలకు* ఎంతో శాంతి ఉంటుంది.+
14 నీతి వల్ల నువ్వు దృఢంగా స్థాపించబడతావు.+
అణచివేత నీకు చాలా దూరంలో ఉంటుంది,+నువ్వు దేనికీ భయపడవు, ఏదీ నిన్ను భయపెట్టలేదు,ఎందుకంటే అది నీ దగ్గరికి కూడా రాదు.+
15 ఎవరైనా నీ మీద దాడిచేస్తే,అది నా ఆదేశం వల్ల కాదు.
నీ మీద ఎవ్వరు దాడిచేసినా వాళ్లు ఓడిపోతారు.”+
16 “ఇదిగో! నిప్పుల్ని ఊదుతూఆయుధం తయారుచేసేచేతిపనివాడిని నేనే సృష్టించాను.
నాశనం చేసే నాశకుణ్ణి కూడా నేనే సృష్టించాను.+
17 నీకు విరోధంగా రూపొందించబడిన ఏ ఆయుధమైనా అస్సలు వర్ధిల్లదు,+న్యాయం తీర్చే సమయంలో నీకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రతీ నాలుకను నువ్వు ఖండిస్తావు.
ఇది యెహోవా సేవకుల వారసత్వ సంపద,*నేను వాళ్లను నీతిమంతులుగా ఎంచుతున్నాను” అని యెహోవా అంటున్నాడు.+
అధస్సూచీలు
^ అక్ష., “కుమారుల.”
^ లేదా “యజమాని.”
^ లేదా “యజమాని.”
^ ఇది సున్నం, ఇసుక, నీళ్ల మిశ్రమం.
^ లేదా “అగ్ని రాళ్లతో.”
^ అక్ష., “కుమారులకు.”
^ అక్ష., “కుమారులందరూ.”
^ లేదా “స్వాస్థ్యం.”