యిర్మీయా 10:1-25
10 ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, మీకు వ్యతిరేకంగా యెహోవా చెప్పిన మాట వినండి.
2 యెహోవా ఇలా అంటున్నాడు:
“దేశాల పద్ధతుల్ని నేర్చుకోకండి,+దేశాలు భయపడినట్టు ఆకాశ సూచనలకు భయపడకండి.+
3 ఎందుకంటే, దేశదేశాల ప్రజల ఆచారాలు వ్యర్థమైనవి.
అది కేవలం అడవిలో నరికిన ఒక చెట్టు,చేతిపనివాడు తన పనిముట్టుతో* దాన్ని చెక్కుతాడు.+
4 వెండిబంగారాలతో దాన్ని అలంకరిస్తారు,+కింద పడిపోకుండా సుత్తితో, మేకులతో దాన్ని దిగగొడతారు.+
5 అవి దోస చేనులో పక్షులు రాకుండా పెట్టిన బొమ్మలాంటివి, అవి మాట్లాడలేవు;+వాటిని ఎవరో ఒకరు మోసుకెళ్లాలి, ఎందుకంటే అవి నడవలేవు.+
వాటికి భయపడకండి, అవి ఏ హానీ చేయలేవు,మంచి కూడా చేయలేవు.”+
6 యెహోవా, నీలాంటివాళ్లు ఎవ్వరూ లేరు.+
నువ్వు గొప్పవాడివి, నీ పేరు గొప్పది, బలమైనది.
7 దేశాల ప్రభువా,+ నీకు భయపడనివాళ్లు ఎవరు? అందుకు నువ్వు అర్హుడివి;దేశాల్లోని తెలివిగల వాళ్లందరిలో, వాళ్ల రాజ్యాలన్నిట్లోనీలాంటివాళ్లు ఎవ్వరూ లేరు.+
8 వాళ్లంతా బుద్ధిలేనివాళ్లు, మూర్ఖులు.+
చెట్టు ఇచ్చే ఉపదేశం వ్యర్థమైనది.+
9 తర్షీషు నుండి వెండి రేకులు,+ ఉపాజు నుండి బంగారం తెస్తారు,అవి చేతిపనివాడు చేసినవి, కంసాలి మలిచినవి.
వాటి బట్టలు నీలంరంగు దారంతో, ఊదారంగు ఉన్నితో చేసినవి.
అవన్నీ నైపుణ్యంగల పనివాళ్లు చేసినవి.
10 కానీ యెహోవా నిజమైన దేవుడు.
ఆయన మాత్రమే జీవంగల దేవుడు,+ శాశ్వతకాల రాజు.+
ఆయన కోపానికి భూమి వణుకుతుంది,+ఆయన ఉగ్రతను దేశాలు తట్టుకోలేవు.
11 * నువ్వు వాళ్లతో ఇలా చెప్పాలి:
“ఆకాశాన్ని, భూమిని చేయని దేవుళ్లుభూమ్మీద, ఆకాశం కింద లేకుండాపోతారు.”+
12 ఆయన తన శక్తితో భూమిని చేశాడు,తన తెలివితో పంటభూమిని స్థిరపర్చాడు,+తన అవగాహనతో ఆకాశాన్ని పరిచాడు.+
13 ఆయన తన స్వరాన్ని వినిపించినప్పుడు,ఆకాశ జలాల్లో అలజడి రేగుతుంది,+ఆయన భూమి అంచుల నుండి మేఘాలు* పైకిలేచేలా చేస్తాడు.+
వర్షం కోసం మెరుపుల్ని* చేస్తాడు,తన గోదాముల్లో నుండి గాలిని రప్పిస్తాడు.+
14 ప్రతీ మనిషి బుద్ధి లేకుండా, జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నాడు.
తాను చెక్కిన విగ్రహాన్ని బట్టి ప్రతీ కంసాలి అవమానాలపాలు అవుతాడు;+ఎందుకంటే, అతను పోతపోసిన విగ్రహం అబద్ధం,వాటిలో ఊపిరే* లేదు.+
15 అవి వ్యర్థమైనవి, ఎగతాళికి తగినవి.+
వాటిని లెక్క అడిగే రోజు వచ్చినప్పుడు అవి నశించిపోతాయి.
16 యాకోబు దేవుడు* వీటి లాంటివాడు కాదు,ఆయన సమస్తాన్ని చేసిన దేవుడు,ఇశ్రాయేలు ఆయన స్వాస్థ్యంలో అత్యంత విలువైన భాగం.+
ఆయన పేరు సైన్యాలకు అధిపతైన యెహోవా.+
17 ముట్టడి వేయబడిన స్థలంలో నివసిస్తున్న ఓ స్త్రీ,నేల మీద నుండి నీ మూట తీసుకో.
18 ఎందుకంటే యెహోవా ఇలా అంటున్నాడు:
“ఈ సమయంలో నేను దేశ నివాసుల్ని బయటికి విసిరేస్తున్నాను,+నేను వాళ్లను కష్టాలపాలు చేస్తాను.”
19 అయ్యో, నా పతనాన్ని బట్టి నాకు శ్రమ!+
నా గాయం నయం కానిది.
నేను ఇలా అన్నాను: “ఇది నా జబ్బు, నేను దీన్ని భరించక తప్పదు.
20 నా డేరా పాడైపోయింది, నా డేరా తాళ్లన్నీ తెగిపోయాయి.+
నా కుమారులు నన్ను విడిచి వెళ్లిపోయారు, వాళ్లు ఇక లేరు.+
నా డేరాను పరచడానికి గానీ, నా డేరా తెరల్ని లేపడానికి గానీ ఎవ్వరూ మిగల్లేదు.
21 ఎందుకంటే, కాపరులు అవివేకుల్లా ప్రవర్తించారు,+వాళ్లు యెహోవా దగ్గర విచారణ చేయలేదు.+
అందుకే వాళ్లు లోతైన అవగాహనతో ప్రవర్తించలేదు,వాళ్ల మందలన్నీ చెల్లాచెదురయ్యాయి.”+
22 ఇప్పుడే అందిన వార్త వినండి!
ఉత్తర దేశం నుండి గొప్ప అలజడి వినిపిస్తోంది,+వాళ్లు యూదా నగరాల్ని నిర్మానుష్యంగా, నక్కలకు నివాస స్థలంగా చేస్తారు.+
23 యెహోవా, తాను వెళ్లాల్సిన దారిని మనిషి సొంతగా కనుక్కోలేడని నాకు బాగా తెలుసు.
తన అడుగును నిర్దేశించుకునే అధికారం కూడా అతనికి లేదు.+
24 యెహోవా, నీ కోపంతో కాదు న్యాయంగా నన్ను సరిదిద్దు,+లేదంటే నేను పూర్తిగా నశించిపోతాను.+
25 నిన్ను నిర్లక్ష్యం చేసే దేశాల మీద,నీ పేరున ప్రార్థించని కుటుంబాల మీద నీ ఉగ్రతను కుమ్మరించు.+
ఎందుకంటే వాళ్లు యాకోబును మింగేశారు,+అవును, అతన్ని మింగేసి పూర్తిగా నాశనం చేశారు,+అతని స్వదేశాన్ని నిర్మానుష్యం చేశారు.+
అధస్సూచీలు
^ అంటే, పెద్దవంపు కత్తి.
^ 11వ వచనం మొదట్లో అరామిక్‌లో రాయబడింది.
^ లేదా “ప్రవాహ ద్వారాల్ని” అయ్యుంటుంది.
^ లేదా “ఆవిర్లు.”
^ పదకోశంలో “రూ-ఆహ్; న్యూమా” చూడండి.
^ అక్ష., “వంతు.”