యెషయా 32:1-20

  • రాజు, అధిపతులు అసలైన న్యాయం కోసం పరిపాలన చేస్తారు (1-8)

  • చీకూచింతా లేని స్త్రీలకు హెచ్చరిక (9-14)

  • పవిత్రశక్తి కుమ్మరించినప్పుడు దీవెనలు (15-20)

32  ఇదిగో! రాజు+ నీతి కోసం* రాజ్య​పాలన చేస్తాడు,+అధిపతులు న్యాయం కోసం* పరిపాలన చేస్తారు.   ప్రతీ ఒక్కరు గాలికి చాటైన చోటులా,*తుఫాను నుండి దాక్కునే చోటులా,*నీళ్లులేని దేశంలో నీళ్ల కాలువలా,+ఎండిపోయిన దేశంలో పెద్ద బండ నీడలా ఉంటారు.   అప్పుడు, చూసేవాళ్ల కళ్లు మూయబడవు,వినేవాళ్ల చెవులు శ్రద్ధగా ఆలకిస్తాయి.   తొందరపాటు పనులు చేసేవాళ్ల హృదయం జ్ఞానయుక్తమైన విషయాల గురించి ఆలోచిస్తుంది,నత్తివాళ్ల నాలుక తడబడకుండా స్పష్టంగా మాట్లాడుతుంది.+   తెలివిలేని వాణ్ణి ఇక ఎంతమాత్రం ​ఉదారస్వభావి అని పిలవరు,నీతినియమాల్లేని వాణ్ణి గొప్పవాడని అనరు.   ఎందుకంటే తెలివిలేనివాడు అర్థంపర్థంలేని మాటలు మాట్లాడతాడు,అతని హృదయం హానిచేయాలని కుట్ర పన్నుతుంది;+భక్తిహీనంగా ప్రవర్తించడానికి,* యెహోవా గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడడానికి,ఆకలిగా ఉన్నవాళ్లకు ఆహారం దొరకకుండా చేయడానికి,దాహంగా ఉన్నవాళ్లకు నీళ్లు దొరకకుండా చేయడానికి అతను పథకాలు వేస్తాడు.   నీతినియమాలు లేనివాడి విధానాలు చెడ్డవి;+పేదవాళ్లు చెప్పేది సరిగ్గా ఉన్నాసరే,కష్టాల్లో ఉన్నవాళ్లను అబద్ధాలతో నాశనం చేయడానికి+అతను అవమానకరమైన ప్రవర్తనను ప్రోత్సహిస్తాడు.   అయితే ఉదారస్వభావి ఉద్దేశాలు ​ఉదారంగా ఉంటాయి,అతను పట్టుదలతో ఉదారమైన* పనులు చేస్తూ ఉంటాడు.   “చీకూచింతా లేని స్త్రీలారా, లేచి నా స్వరం వినండి! నిశ్చింతగా ఉన్న కూతుళ్లారా,+ నేను చెప్పేది శ్రద్ధగా ఆలకించండి! 10  నిశ్చింతగా ఉన్న మీరు ఒక్క సంవత్సరం గడవగానే వణికిపోతారు,ఎందుకంటే, ద్రాక్ష కోత ముగిసేసరికి ఒక్క ద్రాక్షపండు కూడా సమకూర్చ​బడదు.+ 11  చీకూచింతా లేని స్త్రీలారా, వణకండి! నిశ్చింతగా ఉన్నవాళ్లారా, ఊగిపోండి! మీ బట్టలు తీసేసి*నడుము చుట్టూ గోనెపట్ట కట్టుకోండి.+ 12  రమ్యమైన పొలాల్ని బట్టి, బాగా పండే ద్రాక్షతీగల్ని బట్టిదుఃఖంతో గుండెలు బాదుకోండి. 13  ఎందుకంటే నా ప్రజల నేల ముళ్లతో, ముళ్లపొదలతో కప్పబడుతుంది;ఉల్లసించే ఇళ్లన్నిటినీ,అవును, సంతోషంగా ఉండే నగరమంతటినీ+ అవి కప్పేస్తాయి. 14  ఎందుకంటే పటిష్ఠమైన బురుజు వదిలేయబడింది;సందడిగా ఉండే నగరం విడిచిపెట్ట​బడింది.+ ఓపెలు,+ కావలిబురుజు ఎప్పటికీ ​పనికిరాని స్థలంగా తయారయ్యాయి,అవి అడవి గాడిదలు సంతోషించే స్థలంగా,మందలు మేత మేసే స్థలంగా మారి​పోయాయి.+ 15  పైనుండి మన మీద పవిత్రశక్తి కుమ్మ​రించబడి+ఎడారి పండ్ల తోటలా మారేవరకు,పండ్ల తోట అడవిలా మారేవరకు+ పరిస్థితి అలాగే ఉంటుంది. 16  అప్పుడు ఎడారిలో న్యాయం నివసిస్తుంది,పండ్ల తోటలో నీతి నివసిస్తుంది.+ 17  నిజమైన నీతి వల్ల శాంతి కలుగుతుంది,+నిజమైన నీతికి ఫలం శాశ్వతమైన నెమ్మది, భద్రత.+ 18  నా ప్రజలు ప్రశాంతమైన నివాస స్థలంలో,సురక్షితమైన నివాసాల్లో, నెమ్మదిగల విశ్రాంతి స్థలాల్లో నివసిస్తారు.+ 19  అయితే వడగండ్లు అడవిని నేలమట్టం చేస్తాయి,నగరం పూర్తిగా చదును చేయబడుతుంది. 20  చాలా నీళ్లున్న చోట విత్తనాలు విత్తే మీరు,పొలంలో ఎద్దును, గాడిదను వదిలే+ మీరు సంతోషంగా ఉంటారు.”

అధస్సూచీలు

లేదా “నీతి ప్రకారం.”
లేదా “న్యాయం ప్రకారం.”
లేదా “ఆశ్రయంలా.”
లేదా “ఆశ్రయంలా.”
లేదా “మతభ్రష్టత్వాన్ని పెంపొందించడానికి.”
లేదా “గొప్ప.”
అక్ష., “దిగంబరులై.”