కంటెంట్‌కు వెళ్లు

మరణ భయం—మీరు ఎలా అధిగమించవచ్చు?

మరణ భయం—మీరు ఎలా అధిగమించవచ్చు?

బైబిలు ఇచ్చే జవాబు

 మనం మరణాన్ని ఓ శత్రువుగా చూస్తూ దానికి భయపడతాం. అందుకే మన జీవాన్ని కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం. (1 కొరింథీయులు 15:26) అయితే, అబద్ధ సిద్ధాంతాలు, మూఢ నమ్మకాల వల్ల ప్రజలు మరణం గురించి అనవసరంగా భయపడుతూ ‘జీవితకాలమంతా దాస్యమునకు లోబడతారు.’ (హెబ్రీయులు 2:14, 15) మరణం గురించి అతిగా భయపడితే మీరు మీ జీవితాన్ని ఆనందించలేరు. కానీ సత్యం తెలుసుకోవడం వల్ల మీరు ఆ భయాన్ని పోగొట్టుకుంటారు.—యోహాను 8:32.

మరణం గురించిన నిజాలు

  •   చనిపోయినవాళ్లకు ఏమీ తెలీదు. (కీర్తన 146:4) చనిపోయినవాళ్లు బాధించబడతారని లేదా హింసించబడతారని మీరు భయపడనవసరం లేదు. ఎందుకంటే బైబిలు, మరణాన్ని నిద్రతో పోలుస్తుంది.—కీర్తన 13:3; యోహాను 11:11-14.

  •   చనిపోయినవాళ్లు మనకు హాని చేయలేరు. చనిపోయిన భయంకరమైన శత్రువులు సైతం మనల్ని ఏమీ చేయలేరు. (సామెతలు 21:16) వాళ్లు “పగపెట్టుకొనరు, అసూయపడరు” అని బైబిలు చెప్తుంది.—ప్రసంగి 9:6.

  •   మన జీవితానికి మరణమే శాశ్వత ముగింపు కాదు. పునరుత్థానం ద్వారా దేవుడు చనిపోయినవాళ్లను మళ్లీ బ్రతికించబోతున్నాడు.—యోహాను 5:28,29; అపొస్తలుల కార్యములు 24:15.

  •   ‘మరణం ఇక ఉండని’ కాలం వస్తుందని దేవుడు వాగ్దానం చేశాడు. (ప్రకటన 21:4) ఆ కాలం గురించి బైబిలు ఇలా చెప్తుంది: “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.” వాళ్లు చనిపోతామనే భయమే లేకుండా నిరంతరం జీవిస్తారు.—కీర్తన 37:29.