సామెతలు 21:1-31

  • రాజు హృదయాన్ని యెహోవా తిప్పుతాడు (1)

  • బలుల కన్నా న్యాయం మేలు (3)

  • శ్రద్ధ వల్ల విజయం (5)

  • దీనుల మొర విననివాళ్ల ప్రార్థనకు జవాబు రాదు (13)

  • యెహోవాకు వ్యతిరేకంగా నిలిచే తెలివి ఏదీ లేదు (30)

21  రాజు హృదయం యెహోవా చేతిలో నీటి కాలువ లాంటిది.+ ఆయన తనకు నచ్చినవైపు దాన్ని తిప్పుతాడు.+   మనిషికి తన మార్గాలన్నీ సరైనవిగా కనిపిస్తాయి,+అయితే యెహోవా హృదయాల్ని* పరిశీలిస్తాడు.+   బలి అర్పించడం కన్నాసరైనది, న్యాయమైనది చేయడమే యెహోవాకు ఇష్టం.+   గర్వంతో నిండిన కళ్లు, అహంకార హృదయందుష్టులకు దారి చూపే దీపం లాంటివి; కానీ అవి పాపం.+   శ్రద్ధ గలవాళ్ల ప్రణాళికలు ఖచ్చితంగా విజయానికి నడిపిస్తాయి,*+తొందరపాటుగా పనిచేసే వాళ్లంతా ఖచ్చితంగా పేదవాళ్లౌతారు.   అబద్ధాలాడి సంపదలు కూడబెట్టుకోవడంప్రాణాంతకమైన ఉరి లాంటిది,* మాయమైపోయే మంచు లాంటిది.+   దుష్టుల దౌర్జన్యమే వాళ్లను నాశనం చేస్తుంది,+న్యాయంగా ప్రవర్తించడం వాళ్లకు ఇష్టముండదు.   అపరాధి దారి వంకరగా ఉంటుంది,నిర్దోషి పనులు నిజాయితీగా ఉంటాయి.+   గయ్యాళి* భార్యతో కలిసి ఒకే ఇంట్లో ఉండడం కన్నాఇంటి పైకప్పు మీద ఒక మూలన నివసించడం మంచిది.+ 10  దుష్టుడు చెడు చేయాలని తపిస్తాడు;+అతను తన పొరుగువాడి మీద ఏమాత్రం దయ చూపించడు.+ 11  ఎగతాళి చేసేవాణ్ణి శిక్షించినప్పుడు, అనుభవం లేనివాడు తెలివి సంపాదిస్తాడు,తెలివిగలవాడు లోతైన అవగాహనను పొందినప్పుడు, ఏంచేయాలో అతనికి తెలుస్తుంది.*+ 12  నీతిమంతుడైన దేవుడు దుష్టుడి ఇంటిని గమనిస్తాడు;ఆయన దుష్టుల్ని నాశనం చేస్తాడు.+ 13  ఎవరైనా దీనుల మొర వినకుండా చెవులు మూసుకుంటే,అతను మొరపెట్టినప్పుడు కూడా జవాబు రాదు.+ 14  రహస్యంగా ఇచ్చిన బహుమతి కోపాన్ని చల్లారుస్తుంది,చాటుగా ఇచ్చిన* లంచం తీవ్రమైన కోపాన్ని శాంతపరుస్తుంది. 15  నీతిమంతుడు న్యాయం చేయడంలో సంతోషిస్తాడు,+అయితే అలవాటుగా కీడు చేసేవాళ్లకు అది భయంకరమైన విషయం. 16  లోతైన అవగాహనా మార్గం నుండి పక్కకు తొలిగేవాడుచనిపోయినవాళ్ల గుంపుతో పాటు విశ్రమిస్తాడు.+ 17  సుఖాల్ని ప్రేమించేవాళ్లు పేదవాళ్లౌతారు;+ద్రాక్షారసాన్ని, నూనెను ప్రేమించేవాళ్లు ధనవంతులు అవ్వరు. 18  దుష్టుడు నీతిమంతుడికి విమోచన క్రయధనం* అవుతాడు,నిజాయితీపరుడికి బదులుగా మోసగాడు తీసుకోబడతాడు.+ 19  విసిగించే గయ్యాళి* భార్యతో కలిసి బ్రతకడం కన్నాఎడారిలో* నివసించడం మంచిది.+ 20  తెలివిగలవాళ్ల ఇంట్లో అమూల్యమైన సంపదలు, నూనె ఉంటాయి;అయితే మూర్ఖుడు తన దగ్గర ఉన్నదంతా దుబారా చేస్తాడు.*+ 21  నీతిని, విశ్వసనీయ ప్రేమను వెంబడించేవాళ్లుజీవాన్ని, నీతిని, ఘనతను పొందుతారు.+ 22  తెలివిగలవాడు బలవంతుల నగరాన్ని ఎక్కి*వాళ్లు నమ్ముకున్న బలమైన దుర్గాన్ని పడగొట్టగలడు.+ 23  తన నోటిని, నాలుకను అదుపులో పెట్టుకునేవాడుకష్టాల నుండి తనను తాను కాపాడుకుంటాడు.+ 24  కోపంతో అహంకారంగా ప్రవర్తించేవాడినిగర్విష్ఠి, అహంకారి, గొప్పలు చెప్పుకునేవాడు అంటారు.+ 25  సోమరి కోరిక అతన్ని చంపుతుంది,ఎందుకంటే అతని చేతులు పనిచేయడానికి ఇష్టపడవు.+ 26  అతను రోజంతా అత్యాశతో అవీఇవీ కోరుకుంటూ ఉంటాడు,అయితే నీతిమంతుడు ఏదీ దాచుకోకుండా అన్నీ ఇచ్చేస్తాడు.+ 27  దుష్టుడు అర్పించే బలి అసహ్యమైనది.+ ఇక అతను దుర్బుద్ధితో* అర్పిస్తే అది ఇంకెంత అసహ్యంగా ఉంటుందో కదా! 28  అబద్ధ సాక్షి నాశనమౌతాడు,+జాగ్రత్తగా వినే వ్యక్తి సాక్ష్యం నిలుస్తుంది.* 29  దుష్టుడు సిగ్గుమాలిన ముఖం పెట్టుకుంటాడు,+నిజాయితీపరుడు తన మార్గాన్ని సుస్థిరం చేసుకుంటాడు.+ 30  యెహోవాకు వ్యతిరేకంగా నిలిచే తెలివి గానీ, వివేచన గానీ, సలహా గానీ లేదు.+ 31  యుద్ధం జరిగే రోజు కోసం గుర్రాల్ని సిద్ధం చేస్తారు,+అయితే రక్షణ యెహోవా నుండే వస్తుంది.+

అధస్సూచీలు

లేదా “ఉద్దేశాల్ని.”
లేదా “ప్రయోజనకరం.”
లేదా “మరణాన్ని వెతికేవాళ్లకు” అయ్యుంటుంది.
లేదా “సతాయించే.”
లేదా “జ్ఞానం సంపాదిస్తాడు.”
అక్ష., “ఒడిలోని.”
పదకోశం చూడండి.
లేదా “సతాయించే.”
పదకోశం చూడండి.
అక్ష., “మింగేస్తాడు.”
లేదా “గెలిచి.”
లేదా “అవమానకరమైన ప్రవర్తనతో.”
లేదా “గెలుస్తుంది.”