కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భూమి

భూమి

భూమి

భూమిని దేవుడు ఎందుకు చేశాడు?

‘యెహోవా భూమిని కలుగజేసెను. నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింపలేదు నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను.’ యెషయా 45:18.

అందరూ ఏమంటున్నారు . . .

ఎవరూ తయారు చేయకుండానే భూమి దానంతటదే వచ్చిందని చాలామంది అనుకుంటారు. దేవుడు మనుషులను పరీక్షించడానికి మాత్రమే భూమి ఉందని కొన్ని మతాలు చెబుతున్నాయి. మనుషులు స్వర్గానికి వెళ్తారా? నరకానికి వెళ్తారా అని దేవుడు తేల్చేది భూమ్మీదేనని చెబుతారు.

దేవుడు ఏమంటున్నాడు . . .

“దేవుడు భూమ్యాకాశములను సృజించెను” అని బైబిలు అంటుంది. (ఆదికాండము 1:1) “మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి . . . భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని” దేవుడు మొదటి స్త్రీపురుషులకు చెప్పాడు. (ఆదికాండము 1:28) ఆయన మాట వినకపోతే మాత్రమే చనిపోతారు అని చెప్పాడు. (ఆదికాండము 2:17) అంటే భూమ్మీద మనుషులు ఎప్పుడూ ఉండాలని దేవుని ఉద్దేశం. ఆయన మాట వింటూ భూమిని చక్కగా చూసుకునే మనుషులు భూమ్మీద ఎప్పుడూ జీవిస్తూ ఉండాలి.

భూమి నాశనం అవుతుందా?

“భూమి యెన్నటికిని కదలకుండునట్లు ఆయన దానిని పునాదులమీద స్థిరపరచెను.” కీర్తన 104:5.

అందరూ ఏమంటున్నారు . . .

భూమి ఎలా నాశనం అవ్వచ్చో లేదా భూమ్మీద మనుషులు జీవించలేని పరిస్థితి ఎలా రావచ్చో శాస్త్రజ్ఞులు రకరకాలుగా చెబుతున్నారు. ప్రకృతి విపత్తుల వల్ల అంటే ఉల్కలు, తోకచుక్కలు, పెద్దపెద్ద అగ్ని పర్వతాలు, సూర్యుడు లేకుండా పోవడం, గ్లోబల్‌ వార్మింగ్‌ (భూమి వేడి ఎక్కడం), ఇంకా మనుషులు సృష్టించిన విపత్తులు అంటే అణు బాంబులు, బయోటెర్రరిజమ్‌ (చంపడానికి విషరోగాలను సృష్టించడం) వంటివాటి వల్ల కూడా మానవ జాతి లేకుండా పోయే అవకాశం ఉందని చెప్తారు.

దేవుడు ఏమంటున్నాడు . . .

భూమి గురించి దేవుని ఉద్దేశం మారలేదు. “భూమి యెల్లప్పుడును నిలుచునది” అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. (ప్రసంగి 1:4) దానిలో మనుషులు ఎప్పటికీ ఉంటారు: “నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు”—కీర్తన 37:29.

ఎందుకు తెలుసుకోవాలి?

భూమి నాశనం అయిపోతుంది కదా అని చాలామంది భూ వనరులను ఇష్టమొచ్చినట్టు వాడేస్తున్నారు. ఇంకొంతమంది భవిష్యత్తు మీద ఆశలు వదులుకొని ఈరోజు ఉంటే చాలు అన్నట్టు బ్రతుకుతున్నారు. దీనివల్ల వాళ్ల జీవితాలకు అర్థం లేకుండా పోయింది. కానీ మనం భూమ్మీద ఎప్పుడూ జీవించగలం అని నమ్మితే, మన కోసం మన కుటుంబాల కోసం ఇప్పుడూ భవిష్యత్తులో ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటాం.

మనుషులు చివరకు చేరేది స్వర్గానికా?

“ఆకాశములు యెహోవావశము భూమిని ఆయన నరుల కిచ్చియున్నాడు.” కీర్తనలు 115:16.

అందరూ ఏమంటున్నారు . . .

మంచివాళ్లంతా స్వర్గానికి వెళ్తారని చాలామంది నమ్ముతారు.

దేవుడు ఏమంటున్నాడు . . .

దేవుడు పైన ఉంటాడు, కింద భూమ్మీద మనుషులుంటారు. బైబిల్లో రాబోయే లోకం గురించి ఉంది. (హెబ్రీయులు 2:5) స్వర్గానికి లేదా పరలోకానికి వెళ్లిన మొదటి మనిషి యేసు. ఒక ప్రత్యేకమైన పని కోసం కొంతమంది పరలోకానికి వెళ్తారని బైబిల్లో ఉంది. వాళ్లు యేసుతో కలిసి ఈ భూమిని పరిపాలిస్తారు.—ప్రకటన 5:9, 10; లూకా 12:32; యోహాను 3:13.

ఎందుకు తెలుసుకోవాలి?

మంచివాళ్లు అందరూ పరలోకానికి వెళ్తారని బైబిల్లో లేదు. దేవుడు మంచివాళ్లందరినీ పరలోకానికి తీసుకెళ్తే, భూమి గురించి ఆయన చెప్పింది చేయలేకపోయినట్లే కదా. మనుషులు భూమ్మీద ఎప్పుడూ ఉంటారని ఆయన ఇచ్చిన మాట తప్పినట్టే కదా? కానీ “యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము ఆయన మార్గము ననుసరించుము భూమిని స్వతంత్రించుకొనునట్లు ఆయన నిన్ను హెచ్చించును” అని దేవుడు మాటిచ్చాడు.—కీర్తన 37:34. ◼ (g14-E 12)