ప్రసంగి 1:1-18
1 యెరూషలేములో రాజుగా ఉన్న దావీదు కుమారుడైన ప్రసంగి*+ మాటలు.
2 “వ్యర్థం! వ్యర్థం!అంతా వ్యర్థం!”+ అని ప్రసంగి అంటున్నాడు.
3 సూర్యుని కింద మనిషి పడే ప్రయాస అంతటివల్లఅతనికి వచ్చే లాభం ఏంటి?+
4 ఒక తరం వెళ్లిపోతోంది, ఇంకో తరం వస్తోంది,కానీ భూమి ఎప్పటికీ నిలిచివుంటుంది.+
5 సూర్యుడు ఉదయిస్తాడు,* అస్తమిస్తాడు;తాను ఉదయించే చోటికే పరుగెత్తుకుంటూ* తిరిగెళ్తాడు.+
6 గాలి దక్షిణం వైపుకు వీచి, మళ్లీ ఉత్తరానికి తిరిగెళ్తుంది;అలా అది ఎప్పుడూ గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది.
7 నదులన్నీ* సముద్రంలోకి ప్రవహిస్తున్నాయి, కానీ సముద్రం నిండట్లేదు.+
అవి ఎక్కడ మొదలయ్యాయో అక్కడికే తిరిగెళ్లి, మళ్లీ ప్రవహించడం మొదలుపెడతాయి.+
8 అన్నీ అలసట పుట్టించేవే;వాటన్నిటినీ ఎవ్వరూ వివరించలేరు.
చూసేవాటితో కన్ను తృప్తిపడదు;వినేవాటితో చెవికి తృప్తి ఉండదు.
9 ఇప్పటివరకు ఉన్నదే ఇకముందు కూడా ఉంటుంది,ఇప్పటివరకు జరిగిందే ఇకముందు కూడా జరుగుతుంది;సూర్యుని కింద కొత్తదేదీ లేదు.+
10 “ఇదిగో, ఇది కొత్తది” అని చెప్పడానికి ఏదైనా ఉందా?
అది ఎప్పటినుండో ఉన్నదే;ముందు తరాల్లో ఉన్నదే.
11 ఒకప్పుడు ఉన్నవాళ్లను ఎవరూ గుర్తుచేసుకోరు;భవిష్యత్తులో వచ్చేవాళ్లను కూడా ఎవరూ గుర్తుచేసుకోరు;ఆ తర్వాత వచ్చేవాళ్లు వీళ్లను గుర్తుచేసుకోరు.+
12 ప్రసంగినైన నేను యెరూషలేములో ఇశ్రాయేలు మీద రాజుగా ఉన్నాను.+
13 ఆకాశం కింద జరిగిన ప్రతీదాన్ని అంటే మనుషులు కష్టపడి చేయడానికి దేవుడు వాళ్లకు ఇచ్చిన దుఃఖకరమైన పనిని పరిశీలించాలని, తెలివితో+ పరిశోధించాలని నేను దానిమీద మనసు నిలిపాను.+
14 సూర్యుని కింద జరిగే పనులన్నిటినీ నేను చూశాను,ఇదిగో! అంతా వ్యర్థం, అది గాలి కోసం ప్రయాసపడడం లాంటిదే.+
15 వంకరగా ఉన్నదాన్ని సరిచేయలేం,లేనిదాన్ని లెక్కపెట్టలేం.
16 “ఇదిగో! యెరూషలేములో నాకు ముందున్న వాళ్లందరికన్నా నేను గొప్ప తెలివిని సంపాదించాను,+ నా హృదయం ఎంతో తెలివిని, జ్ఞానాన్ని సంపాదించింది”+ అని నేను నా మనసులో అనుకున్నాను.
17 తెలివిని, వెర్రితనాన్ని,* తెలివితక్కువతనాన్ని అర్థం చేసుకోవడానికి నేను తీవ్రంగా కృషిచేశాను,+ అది కూడా గాలి కోసం ప్రయాసపడడం లాంటిదే.
18 ఎందుకంటే, తెలివి ఎక్కువయ్యే కొద్దీ చిరాకు ఎక్కువౌతుంది,ఎక్కువ జ్ఞానం సంపాదించేవాళ్లకు ఎక్కువ బాధ కలుగుతుంది.+
అధస్సూచీలు
^ లేదా “సమావేశపర్చేవాడి.”
^ లేదా “ప్రకాశిస్తాడు.”
^ లేదా “రొప్పుతూ.”
^ లేదా “చలికాలంలో లేదా వేరేకాలంలో ప్రవహించే నదులన్నీ.”
^ లేదా “విపరీతమైన మూర్ఖత్వాన్ని.”