కంటెంట్‌కు వెళ్లు

యువత అడిగే ప్రశ్నలు

పోర్నోగ్రఫీని ఎందుకు చూడకూడదు?

పోర్నోగ్రఫీని ఎందుకు చూడకూడదు?

 చూడకుండా ఉండాలంటే ఏం అవసరం?

 ఒకవేళ మీరు ఇంటర్నెట్‌ చూస్తుంటే, ఏదోక సమయంలో పోర్నోగ్రఫీకి సంబంధించింది ఏదోకటి మీ కంటపడుతుంది. పోర్నోగ్రఫీ గురించి 17 ఏళ్ల హేలీ ఇలా అంటోంది, “మీరు దానికోసం వెతకాల్సిన అవసరం ఇక లేదు. అదే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది.”

 చెడు చిత్రాలకు ఎంత శక్తి ఉంటుందంటే, వాటిని చూడకూడదని గట్టిగా నిర్ణయించుకున్న వాళ్లలో కూడా, చూడాలనే కోరికను పుట్టిస్తాయి. 18 ఏళ్ల గ్రెగ్‌ ఇలా అంటున్నాడు, “నేను అశ్లీల చిత్రాలను అస్సలు చూడనని అనుకున్నాను, కానీ చూసేశాను. మీ విషయంలో కూడా అలా జరగదని ఎప్పటికీ అనుకోకండి.”

 అశ్లీల చిత్రాలను చూడడం ఇంతకుముందు కన్నా ఇప్పుడు చాలా తేలిక. వాటిని సెల్‌ఫోన్‌లో పంపించే వెసలుబాటు వచ్చిన దగ్గరనుండి చాలామంది టీనేజీ పిల్లలు తమ నగ్న చిత్రాలను తయారుచేసుకొని ఇతరులకు పంపిస్తున్నారు.

 ఒక్కమాటలో: మీ వయసులో ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులు లేదా అమ్మమ్మలు, తాతయ్యలు ఎదుర్కొన్న సవాళ్లకన్నా పెద్ద సవాలునే మీరు ఇప్పుడు ఎదుర్కొంటున్నారు. కానీ ప్రశ్న ఏమిటంటే, అశ్లీల చిత్రాలను చూడకుండా ఉండడానికి అవసరమైంది మీ దగ్గర ఉందా?—కీర్తన 97:10.

 మీరు కోరుకుంటే అది మీ దగ్గర ఉంటుంది. కానీ దానికన్నా ముందు అశ్లీల చిత్రాలు చూడడం తప్పని మీకు అనిపించాలి. పోర్నోగ్రఫీ గురించి చాలామంది ఏమనుకుంటారో, అయితే నిజాలేంటో మనం పరిశీలిద్దాం.

 అపోహలు, నిజాలు

 అపోహ: అశ్లీల చిత్రాలు చూస్తే నేను నష్టపోను.

 నిజం: సిగరెట్‌ మీ ఊపిరితిత్తులను ఎంత పాడుచేస్తుందో పోర్నోగ్రఫీ కూడా మీ మనసును అంత పాడుచేస్తుంది. అంతేకాదు పోర్నోగ్రఫీ వల్ల, ఇద్దరు వ్యక్తుల మధ్య శాశ్వతకాలం ఉండేలా దేవుడు పెట్టిన శక్తివంతమైన బంధం కూడా దెబ్బతింటుంది. (అదికాండము 2:24) కొంతకాలానికి, తప్పొప్పులను నిర్ణయించుకునే విషయంలో మీ హృదయం మొద్దుబారిపోతుంది. ఉదాహరణకు, కొంతమంది నిపుణులు ఏమంటున్నారంటే, అశ్లీల చిత్రాలను ఎక్కువగా చూసేవాళ్లు స్త్రీలపై దౌర్జన్యం చేయడం తప్పుకాదన్నట్టు భావిస్తారు.

  బైబిలు కొంతమందిని ‘సిగ్గులేనివాళ్లు’ అని పిలుస్తుంది. (ఎఫెసీయులు 4:19) వాళ్ల మనస్సాక్షి ఎంతగా పనిచేయకుండా పోతుందంటే చెడ్డపనులు చేస్తున్నామనే బాధ వాళ్లలో ఏమాత్రం ఉండదు.

 అపోహ: పోర్నోగ్రఫీ చూస్తే మీకు సెక్స్‌ గురించి తెలుస్తుంది.

 నిజం: పోర్నోగ్రఫీ చూస్తే మీలో అత్యాశ పెరుగుతుంది. ఆ అలవాటువల్ల మీకు మనుషులపై గౌరవం తగ్గుతుంది, వాళ్లను కేవలం మీ స్వార్థకోరికల్ని తీర్చే వస్తువుల్లా చూస్తారు. అలవాటుగా అశ్లీల చిత్రాలు చూసేవాళ్లు పెళ్లయ్యాక వాళ్ల జీవితంలో లైంగిక తృప్తిని ఎక్కువగా పొందలేరని ఓ అధ్యయనంలో తేలింది.

  ‘జారత్వమునకు, అపవిత్రతకు, కామాతురతకు, దురాశకు, విగ్రహారాధనయైన ధనాపేక్షకు’ అంటే పోర్నోగ్రఫీని ప్రోత్సహించే అన్నిటికీ దూరంగా ఉండమని బైబిలు క్రైస్తవులకు చెప్తుంది.—కొలొస్సయులు 3:5.

 అపోహ: పోర్నోగ్రఫీని తిరస్కరించేవాళ్లు సెక్స్‌ అంటే తప్పు అని అనుకుంటారు.

 నిజం: పోర్నోగ్రఫీని తిరస్కరించేవాళ్లకు సెక్స్‌ను గౌరవిస్తారు. పెళ్లయ్యి ఒకరికొకరు నమ్మకంగా ఉంటామని ఒప్పందం చేసుకునేవాళ్లు తమ బంధాన్ని బలపర్చుకోవడానికి సెక్స్‌ అనేది దేవుడు ఇచ్చిన బహుమానం. ఈ విధంగా ఆలోచించేవాళ్లు పెళ్లయ్యాక ఎక్కువ లైంగిక తృప్తిని పొందుతారు.

  సెక్స్‌ గురించి బైబిలు ఏమీ దాచట్లేదు. ఉదాహరణకు, బైబిలు భర్తకు ఇలా చెప్తుంది, “నీ యౌవనకాలపు భార్యయందు సంతోషింపుము . . . ఆమె ప్రేమచేత నిత్యము బద్ధుడవై యుండుము.”—సామెతలు 5:18, 19.

 పోర్నోగ్రఫీని చూడకుండా ఉండాలంటే ఏం చేయాలి?

 అశ్లీల చిత్రాలను చూడకుండా ఉండడం చాలా కష్టంగా ఉందని మీకనిపిస్తుంటే, అప్పుడేం చేయాలి? “పోర్నోగ్రఫీ చూడకుండా ఉండాలంటే ఏం చేయాలి?” అనే వర్కషీట్‌ మీకు ఉపయోగపడుతుంది.

 పోర్నోగ్రఫీని చూడాలనే కోరికను తిప్పికొట్టడం సాధ్యమేనన్న నమ్మకంతో ఉండండి. ఒకవేళ ఇప్పటికే మీకు ఆ అలవాటు ఉంటే దాన్ని కూడా మీరు మానేయగలుగుతారు. అలా చేయడం వల్ల మీరు చాలా ప్రయోజనం పొందుతారు.

 కాల్వన్‌ అనుభవాన్ని పరిశీలించండి. తనకు 13 ఏళ్ల వయసు ఉన్నప్పటినుండే అశ్లీల చిత్రాలు చూసే అలవాటు ఉందని అతను ఒప్పుకుంటున్నాడు. కాల్వన్‌ ఇలా చెప్పాడు, “వాటిని చూడడం తప్పని తెలిసినా చూడకుండా ఉండలేకపోయేవాణ్ణి. కానీ చూసిన తర్వాత నాకు చాలా బాధనిపించేది. చివరికి, నేను అశ్లీల చిత్రాలు చూస్తున్నానని మా నాన్నకు తెలిసిపోయింది. నిజం చెప్పాలంటే, అప్పుడే నాకు ప్రశాంతంగా అనిపించింది. ఎందుకంటే నాకు కావాల్సిన సహాయం దొరికింది.”

 కాల్వన్‌ ఇప్పుడు అశ్లీల చిత్రాలు చూడకుండా ఎలా ఉండాలో నేర్చుకున్నాడు. అతను ఇలా అంటున్నాడు, “పోర్నోగ్రఫీని చూడడం నేను చేసిన పెద్ద తప్పు, దానివల్ల ఇప్పటికీ బాధపడుతున్నాను. ఎందుకంటే ఆ చిత్రాలు నాకు గుర్తొస్తుంటాయి. కొన్నిసార్లు అయితే, చూడకూడనివి చూసే అవకాశం వచ్చినప్పుడు నేను వేటిని చూడాలి అనే ఆలోచన వస్తుంది. కానీ ఆ సమయంలో నేను యెహోవా కోరే పనులు చేస్తే ఎంత సంతోషంగా, ఎంత స్వచ్ఛంగా ఉంటానో, నా భవిష్యత్తు ఎంత బాగుంటుందో అనే దాని గురించి ఆలోచిస్తాను.”