యెషయా 45:1-25

  • బబులోనును జయించడానికి కోరెషును అభిషేకించడం (1-8)

  • బంకమట్టి కుమ్మరివాడితో వాదించకూడదు (9-13)

  • ఇతర జనాలు ఇశ్రాయేలును గుర్తిస్తాయి (14-17)

  • సృష్టి విషయంలో, సంగతుల్ని తెలియజేయడంలో దేవుడు నమ్మదగినవాడు (18-25)

    • భూమి నివాస స్థలంగా చేయబడింది (18)

45  కోరెషును అభిషేకించి,దేశాల్ని అతనికి అప్పగించడానికి,+రాజుల బలాన్ని తీసేయడానికి,*ద్వారాలు మూయబడకుండాఅతని ఎదుట తలుపులు తెరవడానికిఅతని కుడిచేతిని పట్టుకొనివున్న+ యెహోవా అతనితో ఇలా అంటున్నాడు:+   “నేను నీకు ముందుగా వెళ్తూ+కొండల్ని చదును చేస్తాను. రాగి తలుపుల్ని ముక్కలుముక్కలు చేస్తాను,ఇనుప అడ్డగడియల్ని విరగ్గొడతాను.+   నేను చీకట్లో ఉన్న సంపదల్ని,రహస్య స్థలాల్లో ఉన్న గుప్తనిధుల్ని నీకు ఇస్తాను;+అప్పుడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని,నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నది నేనే+ అని నువ్వు తెలుసుకుంటావు.   నా సేవకుడైన యాకోబు కోసం, నేను ఎంచుకున్న ఇశ్రాయేలు కోసంనేను నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాను. నేనెవరో నీకు తెలియకపోయినా నేను నీకు గొప్ప పేరును ఇస్తున్నాను.   నేను యెహోవాను, నేను కాకుండా ఇంకెవ్వరూ లేరు. నేను తప్ప వేరే ఏ దేవుడూ లేడు.+ నేనెవరో నీకు తెలియకపోయినా నేను నిన్ను బలపరుస్తాను,*   నేను కాకుండా మరెవ్వరూ లేరని,తూర్పు నుండి పడమర* వరకున్నప్రజలు తెలుసుకునేలా నేను నిన్ను బలపరుస్తాను.+ నేను యెహోవాను, నేను కాకుండా ఇంకెవ్వరూ లేరు.+   వెలుగును, చీకటిని సృష్టించేది నేనే.+శాంతిని, విపత్తును కలగజేసేది నేనే;+యెహోవానైన నేనే వీటన్నిటిని చేస్తున్నాను.   ఆకాశమా, పైనుండి వర్షాన్ని కురిపించు;+మేఘాలు నీతిని కుమ్మరించాలి. భూమి నోరు తెరిచి రక్షణను ఫలించాలి,అదే సమయంలో అది నీతిని మొలిపించాలి.+ యెహోవానైన నేనే దాన్ని సృష్టించాను.”   తనను సృష్టించిన* దేవునితో వాదించే* వాడికి శ్రమ!ఎందుకంటే, అతను నేలమీద పడివున్న కుండ పెంకుల్లోఒక పెంకు మాత్రమే! బంకమట్టి కుమ్మరివాడితో,* “నువ్వు ఏం తయారు చేస్తున్నావు?” అని అనొచ్చా?+ నువ్వు చేసిన వస్తువు, “ఇతనికి చేతులు లేవు” అని అనొచ్చా?* 10  ఒక తండ్రితో, “నువ్వు ఎవరికి తండ్రివయ్యావు?” అని, ఒక స్త్రీతో, “నువ్వు ఎవర్ని కన్నావు?”* అని అనేవాడికి శ్రమ! 11  ఇశ్రాయేలును రూపొందించిన అతని పవిత్ర దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు: “జరగబోయేవాటి గురించి నువ్వు నన్ను ప్రశ్నిస్తావా?నా కుమారుల+ గురించి, నా చేతి పనుల గురించి నాకు ఆజ్ఞాపిస్తావా? 12  నేనే భూమిని తయారుచేశాను,+ దానిమీద మనిషిని సృష్టించాను.+ నేనే స్వయంగా నా చేతులతో ఆకాశాన్ని విస్తరింపజేశాను,+వాటి సైన్యమంతటికీ+ నేనే ఆదేశాలిస్తాను.” 13  “నేను నీతితో ఒక మనిషిని బయల్దేరజేశాను,+నేను అతని దారులన్నిటినీ చదును చేస్తాను. అతనే నా నగరాన్ని కడతాడు,+మూల్యం గానీ లంచం గానీ తీసుకోకుండానే+ చెరలో ఉన్న నా వాళ్లను విడిపిస్తాడు”+ అని సైన్యాలకు అధిపతైన యెహోవా అంటున్నాడు. 14  యెహోవా ఇలా చెప్తున్నాడు: “ఐగుప్తు లాభం,* ఇతియోపియా వర్తకం* నీవి అవుతాయి;ఎత్తుగా ఉండే సెబాయీయులు నీ దగ్గరికి వచ్చి నీవాళ్లు అవుతారు. వాళ్లు సంకెళ్లతో నీ వెనక నడుస్తారు. వాళ్లు వచ్చి, నీకు వంగి నమస్కారం చేస్తారు.+ వాళ్లు భక్తితో ఇలా అంటారు: ‘నిజంగా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు,+ఆయన కాకుండా ఇంకెవ్వరూ లేరు; ఆయన తప్ప వేరే ఏ దేవుడూ లేడు.’ ” 15  ఇశ్రాయేలు దేవా, రక్షకుడా,నిజంగా నువ్వు నీ మార్గాల్ని దాచివుంచే దేవుడివి.+ 16  వాళ్లంతా సిగ్గుపర్చబడతారు, అవమానాలపాలు అవుతారు;విగ్రహాల్ని చేసేవాళ్లంతా తలవంపుతో వెళ్లిపోతారు.+ 17  కానీ యెహోవా ఇశ్రాయేలును శాశ్వతంగా కాపాడతాడు.+ నువ్వు ఎప్పటికీ సిగ్గుపర్చబడవు, అవమానాలపాలు కావు.+ 18  యెహోవా ఆకాశాన్ని సృష్టించాడు,+ ఆయనే సత్యదేవుడు;ఆయన భూమిని నిర్మించి, దాన్ని రూపొందించి, బలంగా స్థిరపర్చాడు;+ఆయన భూమిని ఊరికే* చేయలేదు, అది నివాస స్థలంగా ఉండేలా చేశాడు;+ఆయన ఇలా అంటున్నాడు: “నేను యెహోవాను, నేను కాకుండా ఇంకెవ్వరూ లేరు. 19  నేను రహస్య స్థలంలో, చీకటిగల దేశంలో మాట్లాడలేదు;+‘ఊరికే* నన్ను వెదకండి’ అనినేను యాకోబు సంతానంతో* అనలేదు. నేను యెహోవాను, నేను నీతిగల మాటలు మాట్లాడతాను, నిజాయితీగల విషయాలు ప్రకటిస్తాను.+ 20  మీరంతా సమకూడి రండి. దేశాల నుండి తప్పించుకున్నవాళ్లారా,+ అందరూ కలిసి రండి. చెక్కిన విగ్రహాల్ని మోసుకెళ్తూ,తమను కాపాడలేని దేవునికి ప్రార్థించే వాళ్లకు+ ఏమీ తెలీదు. 21  మీ నివేదికను తయారు చేయండి, మీ వ్యాజ్యాన్ని వినిపించండి. వాళ్లందర్నీ కలిసి చర్చించుకోనివ్వండి. ఎవరు దీని గురించి పూర్వకాలంలోనే ప్రవచించారు?ఎవరు పురాతన కాలాల నుండే దీన్ని ప్రకటిస్తూ వచ్చారు? యెహోవానైన నేను కాదా? నేను తప్ప వేరే ఏ దేవుడూ లేడు;నేను నీతిగల దేవుణ్ణి, రక్షకుణ్ణి,+ నేను కాకుండా ఇంకెవ్వరూ లేరు.+ 22  భూమి అంచుల్లో నివసిస్తున్న ప్రజలారా, మీరంతా నా వైపు తిరిగి, రక్షణ పొందండి,+ఎందుకంటే నేనే దేవుణ్ణి, నేను కాకుండా ఇంకెవ్వరూ లేరు.+ 23  నా తోడు అని నేను ప్రమాణం చేశాను;నీతిగల మాట నా నోటి నుండి బయల్దేరింది,అది ఖచ్చితంగా నెరవేరుతుంది:+ ప్రతీ మోకాలు నా ముందు వంగుతుంది,ప్రతీ నాలుక విశ్వసనీయతను ప్రమాణం చేస్తూ+ 24  ఇలా అంటుంది, ‘అవును, నిజమైన నీతి, బలం యెహోవా సొంతం. ఆయన మీద కోపగించుకున్న వాళ్లందరూ అవమానంతో ఆయన ముందుకు వస్తారు. 25  యెహోవాను బట్టి, ఇశ్రాయేలు సంతానమంతా* చేసింది సరైనదని నిరూపించబడుతుంది,+ఆయన్ని బట్టే వాళ్లు గొప్పలు చెప్పుకుంటారు.’ ”

అధస్సూచీలు

అక్ష., “రాజుల నడికట్లను విప్పడానికి.”
అక్ష., “నీ నడుమును బలంగా బిగిస్తాను.”
లేదా “సూర్యోదయం నుండి సూర్యాస్తమయం.”
లేదా “రూపొందించిన.”
లేదా “పోరాడే.”
లేదా “తనను రూపొందించినవానితో.”
లేదా “బంకమట్టి, ‘నువ్వు చేసిన వస్తువుకు చేతులు లేవు’ అని అనొచ్చా?” అయ్యుంటుంది.
లేదా “నువ్వు ఎందుకోసం పురిటినొప్పులు పడ్డావు?”
లేదా “కూలీలు” అయ్యుంటుంది.
లేదా “వర్తకులు” అయ్యుంటుంది.
లేదా “ఖాళీగా ఉండాలని” అయ్యుంటుంది.
అక్ష., “విత్తనంతో.”
లేదా “వ్యర్థంగా.”
అక్ష., “విత్తనమంతా.”