కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది

మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది

మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది

“దేవుడు తన స్వంత రూపంలో మనుష్యుల్ని చేశాడు. తన ప్రతిరూపంలో దేవుడు మనుష్యుల్ని చేశాడు. దేవుడు వారిని మగ, ఆడ వారిగా చేశాడు.”—ఆదికాండము 1:27, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

చాలామందికి తెలిసిన ఈ మాటలు బైబిల్లోని మొదటి పేజీల్లో కనిపిస్తాయి. ఇవి, దేవుడు ‘దేని కాలంలో దాన్ని చక్కగా చేసిన’ అద్భుతమైన వాటిలో ఒకదాని గురించి అంటే పరిపూర్ణ దంపతులైన ఆదాము, హవ్వల సృష్టి గురించి తెలియజేస్తున్నాయి. (ప్రసంగి 3:11) వాళ్ళను సృష్టించిన యెహోవా దేవుడు వాళ్ళతో ఇలా చెప్పాడు: “ఇంకా అనేకమంది ప్రజలు ఉండునట్లు పిల్లలను కనండి. భూమిమీద నిండిపోయి, దానిని స్వాధీనం చేసుకోండి. సముద్రంలో చేపల మీద, గాలిలో పక్షులమీద ఏలుబడి చేయండి. భూమిమీద సంచరించే ప్రతి ప్రాణిమీద ఏలుబడి చేయండి.”—ఆదికాండము 1:28, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

దేవుడు మానవుల విషయంలో తనేమి ఉద్దేశించాడో మొదటి మానవ దంపతులకు ఆ మాటల్లో తెలియజేశాడు. వాళ్ళు పిల్లలను కనాలి. భూమిని చూసుకుంటూ వాళ్ళ కోసం, వాళ్ళ పిల్లల కోసం దాన్ని అందమైన తోటలా తయారు చేసుకోవాలి. వాళ్ళు ఇంతకాలం బ్రతికి ఆ తర్వాత చనిపోవాలని దేవుడు ముందే నిర్ణయించలేదుగానీ ఆయన ఎంతో అద్భుతమైన భవిష్యత్తును వాళ్ళ ముందుంచాడు. వాళ్ళు ఆయన చెప్పేది విని, దాని ప్రకారం నడుచుకుంటూ సరైనది చేస్తే సంపూర్ణ శాంతి సంతోషాలతో శాశ్వతంగా జీవిస్తూనే ఉంటారు.

అయితే వాళ్ళు తప్పుచేశారు, అందుకే మనుషులందరూ ముసలివాళ్ళై చనిపోతున్నారు. దీనిగురించే పూర్వీకుడైన యోబు ఇలా అన్నాడు: “స్త్రీ కనిన నరుడు కొద్ది దినములవాడై మిక్కిలి బాధనొందును.” (యోబు 14:1) ఇంతకీ వాళ్ళు చేసిన తప్పేంటి?

“పాపం ఈ ప్రపంచంలోకి ఆదాము ద్వారా ప్రవేశించింది. పాపం ద్వారా మరణం సంభవించింది. అంతేకాక అందరూ పాపంచేసారు కనుక అందరికీ మరణం ప్రాప్తించింది” అని బైబిలు చెప్తోంది. (రోమా 5:12, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) ఆదాము దేవుడిచ్చిన స్పష్టమైన చిన్న ఆజ్ఞను కావాలనే మీరాడు. (ఆదికాండము 2:17) అలా మీరడంవల్ల ఆయన అందమైన తోటలాంటి భూమ్మీద శాశ్వతంగా జీవించే గొప్ప అవకాశాన్ని చేజేతులా పోగొట్టుకున్నాడు, తన పిల్లలకూ దక్కకుండా చేశాడు. అంతేకాదు పాప మరణాల శాపం కూడా వాళ్ళమీదకి వచ్చేలా చేశాడు. పరిస్థితి ఇక శూన్యమే అన్నట్లు కనిపించింది. మరి దీనికి పరిష్కారమేమీ లేదా?

ప్రతీదాన్ని కొత్తదిగా చేసే సమయం

ఎన్నో శతాబ్దాల తర్వాత, దేవుడు ఒక కీర్తనకర్తను ఇలా రాసేందుకు ప్రేరేపించాడు: “మంచి మనుష్యులకు దేవుడు వాగ్దానం చేసిన భూమి దొరుకుతుంది. వారు దానిమీద శాశ్వతంగా నివసిస్తారు.” (కీర్తన 37:29, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) మనుషులను, భూమిని సృష్టించడంలో దేవుడు ఉద్దేశించినది కచ్చితంగా నెరవేరుతుందనడానికి హామీగా, ఆయన త్వరలో చేయబోయేదాని గురించి బైబిలు చక్కగా ఇలా వర్ణిస్తోంది: “[ఆయన] వాళ్ళ కళ్ళ నుండి కారిన ప్రతి కన్నీటి బొట్టును తుడిచివేస్తాడు. పాత సంగతులు గతించి పోయాయి. కనుక యిక మీదట చావుండదు. దుఃఖం ఉండదు. విలాపం ఉండదు, బాధ ఉండదు.” ఆ తర్వాత దేవుడే స్వయంగా ఇలా చెప్తున్నాడు: ‘నేను ప్రతీదాన్ని కొత్తదిగా చేస్తాను.’—ప్రకటన 21:4, 5, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

ప్రతీదానికి సమయం ఉంది కాబట్టి సహజంగానే మనకిలా అనిపించవచ్చు, దేవుడు చేసిన అద్భుతమైన వాగ్దానాలు నెరవేరేలా ప్రతీదాన్ని కొత్తదిగా చేసే ఆ సమయం ఎప్పుడొస్తుంది? ఈ పత్రికను ప్రచురించిన యెహోవాసాక్షులు, “అంత్యదినములు” అని బైబిలు చెప్తున్న కాలంలో మనం జీవిస్తున్నామనీ దేవుడు ‘ప్రతీదాన్ని క్రొత్తదిగా చేయడానికి’ చర్య తీసుకునే సమయం దగ్గరపడిందనీ ప్రజలకు తెలియజేయడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు. (2 తిమోతి 3:1) బైబిలును పరిశీలించి, దేవుడు వాగ్దానం చేస్తున్న ఉజ్వలమైన భవిష్యత్తు గురించి తెలుసుకోమనీ ‘సమయం మించిపోక ముందే యెహోవా కోసం వెదకమనీ ఆయన సమీపంగా ఉన్నప్పుడే ఆయనను వేడుకోమనీ’ మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం. (యెషయా 55:6, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) మీ జీవితం, మీ భవిష్యత్తు విధి చేతుల్లో కాదు మీ చేతుల్లోనే ఉన్నాయి! (w09 3/1)

[8వ పేజీలోని బ్లర్బ్‌]

‘నేను ప్రతీదాన్ని కొత్తదిగా చేస్తాను’