రెండో తిమోతి 3:1-17

  • చివరి రోజుల్లో కష్టమైన కాలాలు (1-7)

  • పౌలు ఆదర్శాన్ని జాగ్రత్తగా అనుసరించడం (8-13)

  • ‘నువ్వు నేర్చుకున్నవాటిని పాటిస్తూ ఉండు’ (14-17)

    • లేఖనాలన్నిటినీ దేవుడు ప్రేరేపించాడు (16)

3  అయితే ఈ విషయం తెలుసుకో. చివరి రోజుల్లో+ ప్రమాదకరమైన, కష్టమైన కాలాలు వస్తాయి.  ఎందుకంటే ఇలాంటి మనుషులు ఉంటారు: తమను తాము ప్రేమించుకునేవాళ్లు,* డబ్బును ప్రేమించేవాళ్లు, గొప్పలు చెప్పుకునేవాళ్లు, గర్విష్ఠులు, దూషించేవాళ్లు, తల్లిదండ్రులకు లోబడనివాళ్లు, కృతజ్ఞత లేనివాళ్లు, విశ్వసనీయంగా ఉండనివాళ్లు,  మమ​కారం లేనివాళ్లు, మొండివాళ్లు,* లేనిపోనివి కల్పించి చెప్పేవాళ్లు, ఆత్మనిగ్రహం లేనివాళ్లు, క్రూరులు, మంచిని ప్రేమించనివాళ్లు,  నమ్మకద్రోహులు, మూర్ఖులు,* గర్వంతో ఉబ్బిపోయేవాళ్లు, దేవుణ్ణి కాకుండా సుఖాల్ని ప్రేమించేవాళ్లు,  పైకి దైవభక్తి ఉన్నట్టు కనిపించినా, దానికి తగ్గట్టు జీవించనివాళ్లు.+ అలాంటివాళ్లకు నువ్వు దూరంగా ఉండు.  వాళ్లలో కొందరు కుయుక్తిగా ఇళ్లలో చొరబడతారు; పాపాల అదుపులో ఉండి వివిధరకాల కోరికల వెంట పరుగులుతీసే బలహీనమైన స్త్రీలను చెరపట్టుకుపోతారు.  అలాంటి స్త్రీలు ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటారు, అయినా ఎప్పటికీ సత్యం గురించిన సరైన జ్ఞానం సంపాదించుకోలేరు.  యన్నే, యంబ్రే అనేవాళ్లు మోషేను వ్యతిరేకించినట్టే, ఈ మనుషులు కూడా సత్యాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. అలాంటివాళ్ల మనసు పూర్తిగా భ్రష్టుపట్టింది; వాళ్లు విశ్వాసానికి తగ్గట్టు నడుచుకోవట్లేదు కాబట్టి దేవుడు వాళ్లను ఆమోదించడు.  అయితే వాళ్లు అంతకుమించి ఏమీ చేయలేరు. ఎందుకంటే ఆ ఇద్దరు మనుషుల్లాగే వాళ్ల మూర్ఖత్వం కూడా అందరికీ స్పష్టంగా కనిపిస్తుంది.+ 10  నువ్వైతే నా బోధను, నా జీవన విధానాన్ని, నా లక్ష్యాన్ని, నా విశ్వాసాన్ని, నా ఓర్పును, నా ప్రేమను, నా సహనాన్ని జాగ్రత్తగా అనుసరించావు.+ 11  అంతేకాదు అంతియొకయలో,+ ఈకొనియలో,+ లుస్త్రలో+ నాకు ఎదురైన హింసలు, నేను పడిన బాధలు నీకు తెలుసు. వాటన్నిటి నుండి ప్రభువు నన్ను కాపాడాడు. 12  నిజానికి, క్రీస్తుయేసు శిష్యులుగా దైవభక్తితో జీవించాలని కోరుకునే వాళ్లందరికీ హింసలు వస్తాయి.+ 13  అయితే దుష్టులు, మోసగాళ్లు ఇతరుల్ని తప్పుదోవ పట్టిస్తూ, వాళ్లూ తప్పుదోవ పడుతూ అంతకంతకూ చెడిపోతారు.+ 14  నువ్వు మాత్రం, నువ్వు నేర్చుకున్నవాటిని, నీకు నమ్మకం కుదిరినవాటిని పాటిస్తూ ఉండు. ఎందుకంటే, నువ్వు ఎవరి నుండి ఆ విషయాలు నేర్చుకున్నావో నీకు తెలుసు; 15  అంతేకాదు పసితనం+ నుండే నీకు పవిత్ర లేఖనాలు తెలుసు.+ క్రీస్తుయేసు మీద విశ్వాసం ఉంచడం ద్వారా వచ్చే రక్షణను పొందడానికి కావాల్సిన తెలివిని అవి నీకు ఇవ్వగలవు.+ 16  లేఖనాలన్నిటినీ దేవుడు ప్రేరేపించాడు.+ అవి బోధించడానికి,+ గద్దించడానికి, సరిదిద్దడానికి, దేవుని నీతి ప్రమాణాల ప్రకారం క్రమశిక్షణ ఇవ్వడానికి ప్రయోజనకరంగా ఉంటాయి.+ 17  దానివల్ల దేవుని సేవకుడు ప్రతీ మంచిపని చేయడానికి పూర్తిగా సమర్థుడు అవ్వగలుగుతాడు, పూర్తిగా సిద్ధంగా ఉండగలుగుతాడు.

అధస్సూచీలు

లేదా “స్వార్థపరులు.”
లేదా “ఇతరులతో సమ్మతించడానికి ఇష్టపడనివాళ్లు.”
లేదా “తలబిరుసుగా ప్రవర్తించేవాళ్లు.”