కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీరు ఇటీవలి కావలికోట సంచికలను జాగ్రత్తగా చదివారా? అయితే, ఈ కింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరేమో చూడండి:

ప్రతీ సంవత్సరం క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు మనమెలా సిద్ధపడవచ్చు?

జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో చదవాల్సిన లేఖనాలను చదవడం ద్వారా, పరిచర్యలో ఎక్కువ సమయం గడపడం ద్వారా, దేవుడు మనకు వాగ్దానం చేసిన భవిష్యత్తు గురించి ప్రార్థిస్తూ ఆలోచించడం ద్వారా మనం సిద్ధపడవచ్చు.—1/15, 14-16 పేజీలు.

జపాన్‌లోని సాక్షులు ఏ ఆశ్చర్యకరమైన బహుమతిని అందుకున్నారు?

నూతనలోక అనువాదంలోని మత్తయి సువార్తను, ఓ చిన్న పుస్తకంగా రూపొందించారు. ప్రచారకులు ఆ పుస్తకాన్ని పరిచర్యలో ఉత్సాహంగా అందిస్తున్నారు. బైబిలు గురించి అంతగా తెలియని చాలామంది జపాన్‌ ప్రజలు ఆ పుస్తకాన్ని చదవడానికి ఇష్టపడుతున్నారు.—2/15, 3వ పేజీ.

మొదటి శతాబ్దంలోని ఏ పరిస్థితులు క్రైస్తవుల ప్రకటనా పనికి అనుకూలించాయి?

పాక్స్‌ రోమనా అనే మాట రోమా సామ్రాజ్యమంతటా శాంతి వర్ధిల్లిందని తెలియజేస్తుంది. తొలి శిష్యులు సౌకర్యవంతమైన రోడ్లపై ప్రయాణించగలిగారు. చాలామంది ప్రజలు గ్రీకు భాషను మాట్లాడడంవల్ల, రోమా సామ్రాజ్యమంతటా విస్తరించివున్న యూదులతో సహా ఎక్కువమందికి సువార్త ప్రకటించడం వీలైంది. అంతేకాదు, సువార్త పనిని సమర్థించడానికి శిష్యులు రోమా చట్టాన్ని ఉపయోగించుకోగలిగారు.—2/15, 20-23 పేజీలు.

ఈ మధ్య కాలంలో మన ప్రచురణలు, పోలికలు లేదా సాదృశ్యాల గురించి ఎందుకు అంతగా ప్రస్తావించట్లేదు?

కొంతమంది వ్యక్తులు రాబోయే మరింత గొప్పవాళ్లను లేదా గొప్పవాటిని సూచించారని బైబిలు చెప్తుంది. అలాంటి ఓ ఉదాహరణను గలతీయులు 4:21-31 వచనాల్లో చూడవచ్చు. అయితే బైబిలు అలా చెప్పనప్పుడు, వాళ్లు వేరేవాళ్లకు లేదా వేరేవాటికి సాదృశ్యంగా ఉన్నారని మనం అనుకోకూడదు. బదులుగా బైబిల్లోని వ్యక్తుల నుండి, సంఘటనల నుండి మనం నేర్చుకోగల విలువైన పాఠాలకే ప్రాముఖ్యతనివ్వాలి. (రోమా. 15:4)—3/15, 17-18 పేజీలు.

క్రైస్తవులు యేసుకు ప్రార్థన చేయవచ్చా?

లేదు. మనం యెహోవాకు ప్రార్థించాలని యేసే స్వయంగా చెప్పాడు. అంతేకాదు, ఆయన కూడా తండ్రికి ప్రార్థించి మనకు ఆదర్శం ఉంచాడు. (మత్త. 6:6-10; యోహా. 11:41; 16:23) అందుకే, ఆయన తొలి శిష్యులు కూడా యెహోవాకే ప్రార్థించారుగానీ యేసుకు కాదు. (అపొ. 4:24, 30; కొలొ. 1:3, 4)—4/1, 14వ పేజీ.

సంఘపెద్దలు ఇతరులకు ఎలా శిక్షణ ఇవ్వవచ్చు?

పెద్దలు, తాము శిక్షణ ఇస్తున్న సహోదరుల్ని పోటీదారులుగా కాకుండా, సంఘ అవసరాల్ని తీర్చడంలో తమతోపాటు ‘కలిసి పనిచేసే వాళ్లుగా’ చూస్తూ అమూల్యంగా ఎంచుతారు. (2 కొరిం. 1:24, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) అంతేకాదు, మంచి ఫలితాలు సాధించాలంటే శిక్షణ ఇవ్వడాన్ని ప్రేమించడంతోపాటు, శిక్షణ పొందుతున్న వ్యక్తిని ప్రేమించాలని కూడా పెద్దలు అర్థంచేసుకుంటారు. (సామె. 17:17; యోహా. 15:15)—4/15, 6-7 పేజీలు.

యెహోవా మనతో ఎలా మాట్లాడతాడు?

మనం క్రమంగా బైబిలు చదువుతూ, అధ్యయనం చేస్తూ, చదువుతున్న వాటి గురించి ఎలా భావిస్తున్నామో పరిశీలించుకోవాలి. అంతేకాక, నేర్చుకున్నవాటిని ఎలా పాటించవచ్చో ఆలోచించాలి. అలాచేస్తే, తన వాక్యం ద్వారా యెహోవా చెప్పేది మనం వింటాం, ఆయనకు ఇంకా దగ్గరౌతాం. (హెబ్రీ. 4:12; యాకో. 1:23-25)—4/15, 20వ పేజీ.

తప్పులు చేస్తూ పశ్చాత్తాపపడని వ్యక్తిని బహిష్కరించడం ఎందుకు ప్రేమతో చేసిన ఏర్పాటు?

తప్పులు చేస్తున్న వ్యక్తిని బహిష్కరించాలని బైబిలు చెప్తుంది. నిజానికి ఆ ఏర్పాటువల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. (1 కొరిం. 5:11-13) అది యెహోవా నామానికి ఘనత తెస్తుంది, సంఘాన్ని పవిత్రంగా ఉంచుతుంది, బహిష్కరించబడిన వ్యక్తి తన తప్పు తెలుసుకునేలా చేస్తుంది.—4/15, 29-30 పేజీలు.