కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ముందు, తర్వాత ఈ వ్యక్తిని బైబిలు ఎలా మార్చింది

ముందు, తర్వాత ఈ వ్యక్తిని బైబిలు ఎలా మార్చింది

“దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును”

ముందు, తర్వాత ఈ వ్యక్తిని బైబిలు ఎలా మార్చింది

సంగీతమే రాల్ఫ్‌ మిఖాయేల్‌ జీవితం. మాదక ద్రవ్యాలే అతని పిపాస. జర్మనీలో నివసించే ఆ యువకుడు మితిమీరి మద్యపానంచేస్తూ, విపరీతంగా ఎల్‌ఎస్‌డి, కోకైన్‌, హాషీష్‌వంటి వాటితోపాటు మనస్సుపై ప్రభావంచూపే ఇతర మాదక ద్రవ్యాలు సేవించేవాడు.

ఆఫ్రికాలోని ఒక దేశానికి మాదక ద్రవ్యాలు దొంగరవాణా చేయడానికి ప్రయత్నిస్తుండగా, రాల్ఫ్‌ మిఖాయేల్‌ పట్టుబడి 13 నెలలు జైల్లో గడిపాడు. జైల్లో ఆ శిక్షాకాలం జీవిత నిజ సంకల్పం గురించి అతడు ఆలోచించేలా చేసింది.

రాల్ఫ్‌ మిఖాయేల్‌ అతని భార్య ఉర్సూలా జీవిత పరమార్థం గురించి, సత్యం గురించి అన్వేషించారు. నామకార్థ క్రైస్తవ చర్చీలవల్ల నిరాశకలిగినా, దేవుణ్ణి తెలుసుకోవాలనే కోరిక వారికి బలంగా ఉండేది. అయితే వారి ప్రశ్నలకు వివిధ మత గుంపులనుండి సంతృప్తికరమైన జవాబులు వారికి దొరకలేదు. అంతేకాకుండా, ఈ మతాలు వారు తమ జీవితాలను మార్చుకోవడానికి బలమైన పురికొల్పును ఇవ్వలేకపోయాయి.

రాల్ఫ్‌ మిఖాయేల్‌, ఉర్సూలా చివరకు యెహోవాసాక్షులను కలిశారు. బైబిలు అధ్యయనం ఆరంభించిన తర్వాత, “దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును” అనే మందలింపుకు రాల్ఫ్‌ మిఖాయేల్‌ బాగా కదిలింపబడ్డాడు. (యాకోబు 4:⁠8) ఆయన ‘తన మునుపటి ప్రవర్తనగల ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నీతి, యథార్థమైన భక్తి కలిగి, దేవుని చిత్త ప్రకారం సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవడానికి’ తీర్మానించుకున్నాడు.​—⁠ఎఫెసీయులు 4:22-24.

రాల్ఫ్‌ మిఖాయేల్‌ నవీన స్వభావాన్ని ఎలా ధరించుకోగలిగాడు? ఖచ్చితమైన ‘జ్ఞానముతో’ ఒక వ్యక్తియొక్క వ్యక్తిత్వం “సృష్టించినవాని” అంటే యెహోవా దేవుని ‘పోలిక చొప్పున నవీనస్వభావముగా’ చేయబడగలదని అతనికి బైబిలునుండి చూపబడింది.​—⁠కొలొస్సయులు 3:9-11.

ఖచ్చితమైన జ్ఞానాన్ని పొందుతూ రాల్ఫ్‌ మిఖాయేల్‌, దేవుని వాక్య సూత్రాలకు అనుగుణంగా తన జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించాడు. (యోహాను 17:⁠3) మాదక ద్రవ్యాలనుండి విముక్తి కావడం కష్టమైనా, రాల్ఫ్‌ మిఖాయేల్‌ ప్రార్థనలో యెహోవాను సమీపించి ఆయన సహాయం అందుకోవడంలోని విలువను గుర్తించాడు. (1 యోహాను 5:​14, 15) దేవుని చిత్తం చేయడానికి కృషి చేస్తూ అప్పటికే యెహోవాసాక్షులుగా ఉన్నవారి సన్నిహిత సహవాసంనుండి అదనపు సహాయం పొందాడు.

లోకం గతించిపోవుచున్నది గాని దేవుని చిత్తం చేసేవారు నిరంతరం నిలుస్తారని గ్రహించడం కూడా రాల్ఫ్‌ మిఖాయేల్‌కు సహాయం చేసింది. అశాశ్వత లోక ప్రేమకు బదులు, ప్రేమగల యెహోవా దేవునితో సన్నిహిత సంబంధమనే శాశ్వత ఆశీర్వాదం ఎంచుకోవడానికి అది అతన్ని బలపరచింది. (1 యోహాను 2:​15-17) “నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము అప్పుడు నన్ను నిందించువారితో నేను ధైర్యముగా మాటలాడుదును” అనే సామెతలు 27:11లోని మాటలు రాల్ఫ్‌ మిఖాయేల్‌ను బలంగా స్పర్శించాయి. కృతజ్ఞతాపూర్వకంగా ఆయనిలా అంటున్నాడు: “ఈ వచనం యెహోవా ప్రేమ ప్రగాఢతను తెలియజేస్తోంది, ఎందుకంటే ఆయన తన హృదయాన్ని సంతోషపరచే అవకాశాన్ని మానవులకు ఇస్తున్నాడు.”

రాల్ఫ్‌ మిఖాయేల్‌, అతని భార్య, వారి ముగ్గురు పిల్లల వలెనే, లక్షలాదిమంది బైబిలు సూత్రాలు అనుసరించడం ద్వారా ప్రయోజనం పొందారు. అలాంటి వారిని ప్రపంచవ్యాప్తంగా యెహోవాసాక్షుల సంఘాల్లో మీరు చూడవచ్చు. విషాదకరంగా, కొన్ని దేశాల్లో యెహోవాసాక్షులను కుటుంబాలు విచ్ఛిన్నం చేసే ప్రమాదకర మతశాఖని అబద్ధంగా ఆరోపిస్తున్నారు. అయితే రాల్ఫ్‌ మిఖాయేల్‌ అనుభవం అది తప్పని నిరూపిస్తోంది.​—⁠హెబ్రీయులు 4:12.

ఆధ్యాత్మిక సంగతులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఉద్బోధించే మత్తయి 6:⁠33 తన కుటుంబానికి సరైన దారి చూపే “దిక్సూచి” అని రాల్ఫ్‌ మిఖాయేల్‌ చెబుతున్నాడు. క్రైస్తవులుగా సంతోషభరితమైన కుటుంబ జీవితం అనుభవిస్తున్నందుకు ఆయనా, ఆయన కుటుంబం యెహోవాకు ఎంతగానో కృతజ్ఞత కలిగివున్నారు. “యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయనకేమి చెల్లించుదును?” అని ఆలపించిన కీర్తనకర్త మనోభావాలను వారూ పంచుకొంటున్నారు.​—⁠కీర్తన 116:​12.

[9వ పేజీలోని బ్లర్బ్‌]

దేవుడు తన హృదయాన్ని సంతోషపరిచే అవకాశాన్ని మానవులకు ఇస్తున్నాడు

[9వ పేజీలోని బాక్సు]

హాయపడే బైబిలు సూత్రాలు

మరణకర వ్యసనాలకు బానిసలైన అనేకులు వాటిని విడిచిపెట్టేందుకు పురికొల్పిన బైబిలు సూత్రాల్లో కొన్ని ఈ క్రింద ఇవ్వబడ్డాయి:

“యెహోవాను ప్రేమించువారలారా, చెడుతనమును అసహ్యించుకొనుడి.” (కీర్తన 97:​10) మరణకర అలవాట్లలోని చెడును గురించి ఒప్పించబడి, వాటిని నిజంగా ద్వేషించే కోరికను వృద్ధిపరచుకున్న తర్వాత, ఒక వ్యక్తి దేవునికి ప్రీతికరమైనది చేయడం సులభమని తెలుసుకుంటాడు.

“జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.” (సామెతలు 13:​20) మాదక ద్రవ్యాలను, ఇతర వ్యసనకర ద్రవ్యాలను విసర్జించడానికి, ఒక వ్యక్తి తన సహవాసులను జాగ్రత్తగా ఎంచుకోవాలి. తన తీర్మానాన్ని బలపరిచే క్రైస్తవుల స్నేహాన్ని పెంపొందించుకోవడం నిజంగా ప్రయోజనకరం.

“దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.” (ఫిలిప్పీయులు 4:​6, 7) మరిదేనికంటెనూ ఇలాంటి మానసిక ప్రశాంతత తిరుగులేనిది. అలాగే దేవునిపై ప్రార్థనాపూర్వకంగా ఆధారపడడం వ్యసనకర మాదక ద్రవ్యాల జోలికిపోకుండా జీవిత సమస్యలతో వ్యవహరించేలా ఒక వ్యక్తికి సహాయం చేస్తుంది.