కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భాగం 8

యేసు చనిపోవడం వల్ల మనకెలా మేలు జరుగుతుంది?

యేసు చనిపోవడం వల్ల మనకెలా మేలు జరుగుతుంది?

మనం బ్రతికుండడం కోసం యేసు చనిపోయాడు. యోహాను 3:16

యేసు చనిపోయిన మూడు రోజులకు కొంతమంది స్త్రీలు ఆయన సమాధి దగ్గరికి వెళ్లి చూశారు, కానీ అది ఖాళీగా ఉంది. అప్పటికే యెహోవా యేసును తిరిగి బ్రతికించాడు.

తర్వాత యేసు తన అపొస్తలులకు కనిపించాడు.

యెహోవా యేసును ఒక బలమైన దేవదూతగా బ్రతికించాడు, ఆయన ఇక ఎప్పటికీ చనిపోడు. యేసు పరలోకానికి వెళ్లడం ఆయన శిష్యులు చూశారు.

దేవుడు యేసును తిరిగి బ్రతికించి, దేవుని రాజ్యానికి రాజుగా చేశాడు. దానియేలు 7:13, 14

మనుషుల్ని పాపం నుండి విడిపించడానికి యేసు తన ప్రాణాన్ని ఇచ్చాడు. (మత్తయి 20:28) అలా యేసు ద్వారా, దేవుడు మనకు నిరంతరం జీవించడానికి మార్గాన్ని తెరిచాడు.

యెహోవా యేసును భూమికి రాజుగా చేశాడు. భూమ్మీద నమ్మకంగా సేవచేసిన 1,44,000 మంది ఆయనతో పాటు పరిపాలిస్తారు. పరలోకంలో జీవించేలా దేవుడు వాళ్లను తిరిగి బ్రతికిస్తాడు. యేసు, ఆ 1,44,000 మంది ఉండే నీతిగల పరలోక ప్రభుత్వమే దేవుని రాజ్యం.—ప్రకటన 14:1-3.

దేవుని రాజ్యం భూమిని పరదైసుగా మారుస్తుంది. అప్పుడు యుద్ధం, నేరం, పేదరికం, కరువు ఉండవు. ప్రజలు చాలా ఆనందంగా ఉంటారు.—కీర్తన 145:16.