కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భాగం 10

దేవుడు చెప్పేది వినేవాళ్లకు ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయి?

దేవుడు చెప్పేది వినేవాళ్లకు ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయి?

చనిపోయిన చాలామందిని దేవుడు బ్రతికిస్తాడు, వాళ్లు భూమ్మీద జీవిస్తారు. అపొస్తలుల కార్యాలు 24:15

యెహోవా చెప్పేది వింటే భవిష్యత్తులో మీకు ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయో ఊహించండి! మీరు పూర్తి ఆరోగ్యంతో ఉంటారు. రోగాలు, అంగవైకల్యాలు ఉండవు. చెడ్డవాళ్లు ఉండరు కాబట్టి అందర్నీ నమ్మవచ్చు.

బాధ, దుఃఖం, కన్నీళ్లు ఉండవు. ఎవరూ ముసలివాళ్లు అవ్వరు, చనిపోరు.

మీరు కుటుంబంతో, స్నేహితులతో కలిసి ఉంటారు. పరదైసులో జీవితం చాలా బాగుంటుంది.

ఎలాంటి భయం ఉండదు. ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు.

దేవుని రాజ్యం బాధలన్నీ తీసేస్తుంది. ప్రకటన 21:3, 4