కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

రాబోయే రోజులకు సంబంధించిన సత్యం

రాబోయే రోజులకు సంబంధించిన సత్యం

రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో మీరెప్పుడైనా ఆలోచించారా? అతిత్వరలో జరగబోయే కొన్ని ముఖ్యమైన సంఘటనలు, భూమ్మీదున్న ప్రజలందరి మీద ప్రభావం చూపిస్తాయని బైబిలు చెప్తుంది.

“దేవుని రాజ్యం దగ్గరపడిందని” మనకెలా తెలుస్తుందో యేసు వివరించాడు. (లూకా 21:31) ఘోరమైన యుద్ధాలు జరుగుతాయని, పెద్దపెద్ద భూకంపాలు, కరువులు, భయంకరమైన వ్యాధులు వస్తాయని, వాటితోపాటు ఇంకొన్ని సంఘటనలు కూడా చోటుచేసుకుంటాయని యేసు ముందే చెప్పాడు. అవన్నీ మనమిప్పుడు కళ్లారా చూస్తున్నాం.—లూకా 21:10-17.

అంతేకాదు, మనుషుల పరిపాలనలోని “చివరి రోజుల్లో” ఉండే ఒక పరిస్థితి గురించి మాట్లాడుతూ, ప్రజలు చాలా చెడుగా ప్రవర్తిస్తారని బైబిలు చెప్పింది. దాని గురించి మీరు 2 తిమోతి 3:1-5లో చదవచ్చు. ఆ లేఖనంలో మీరు చదివిన చెడ్డ మనస్తత్వాలు, ప్రవర్తన మన చుట్టూ ఉన్న ప్రజల్లో చూసినప్పుడు, ప్రస్తుతం జరిగేవాటి గురించి బైబిలు ముందే చెప్పిందని మీరు ఖచ్చితంగా ఒప్పుకుంటారు.

దీనంతటినీ బట్టి మనకేం అర్థమౌతుంది? దేవుని రాజ్యం పెద్దపెద్ద మార్పులు చేసే సమయం దగ్గరపడిందని, ఆ మార్పుల వల్ల భూమ్మీది ప్రజల జీవితాలు చక్కగా మారతాయని తెలుస్తుంది. (లూకా 21:36) భూమికి, దానిమీద జీవించే ప్రజలకు మంచి జరుగుతుందని దేవుడు బైబిల్లో మాటిస్తున్నాడు. కొన్ని ఉదాహరణలు చూడండి.

మంచి పరిపాలన

‘వివిధ దేశాల, భాషల ప్రజలందరూ ఆయన్ని సేవించేలా పరిపాలన, ఘనత, ఒక రాజ్యం ఆయనకు ఇవ్వబడ్డాయి. ఆయన పరిపాలన శాశ్వతంగా ఉంటుంది, అది ఎప్పటికీ అంతం కాదు; ఆయన రాజ్యం ఎప్పటికీ నాశనం కాదు.’​దానియేలు 7:14, NW.

దానర్థం ఏంటి? దేవుడు తన కుమారుణ్ణి రాజుగా ఉంచి ఇప్పటి ప్రభుత్వాలకన్నా ఎంతో శ్రేష్టమైన ప్రపంచవ్యాప్త ప్రభుత్వాన్ని స్థాపిస్తాడు, ఆ ప్రభుత్వం కింద మీరు సంతోషంగా జీవించవచ్చు.

మంచి ఆరోగ్యం

‘అందులో నివసించే వాళ్లెవ్వరూ, “నాకు ఒంట్లో బాలేదు” అని అనరు.’​యెషయా 33:24, NW.

దానర్థం ఏంటి? మీకెప్పుడూ జబ్బులు రావు, ఎలాంటి వైకల్యం ఉండదు; అసలు చావే లేకుండా జీవిస్తారు.

శాంతి విలసిల్లుతుంది

‘ఆయన భూవ్యాప్తంగా యుద్ధాలు జరగకుండా చేస్తాడు.’​కీర్తన 46:9, NW.

దానర్థం ఏంటి? ఇక యుద్ధాల గురించిన భయంగానీ, వాటివల్ల వచ్చే బాధలు గానీ ఉండవు.

భూమ్మీద అందరూ మంచివాళ్లే ఉంటారు

‘కొంతకాలం తర్వాత దుష్టులు ఇక ఉండరు . . . సాత్వికులు భూమిని స్వాధీనం చేసుకుంటారు.’​కీర్తన 37:10, 11, NW.

దానర్థం ఏంటి? చెడ్డవాళ్లు ఎవ్వరూ ఉండరు, దేవునికి లోబడడానికి సిద్ధంగా ఉండే ప్రజలు మాత్రమే ఉంటారు.

భూమంతా ఒక అందమైన తోటలా మారుతుంది

‘వాళ్లు ఇళ్లు కట్టుకొని వాటిలో నివసిస్తారు, ద్రాక్షతోటలు నాటుకొని వాటి పండ్లు తింటారు.’​యెషయా 65:21, 22, NW.

దానర్థం ఏంటి? భూమంతా అందంగా తయారౌతుంది. “భూమ్మీద” తన ఇష్టమే నెరవేరాలన్న మన ప్రార్థన ఫలించేలా దేవుడు చేస్తాడు.​—మత్తయి 6:10.