యెషయా 33:1-24

  • తీర్పు, నీతిమంతులకు నిరీక్షణ (1-24)

    • యెహోవాయే న్యాయమూర్తి, శాసనకర్త, రాజు (22)

    • ఎవ్వరూ “నాకు ఒంట్లో బాలేదు” అని అనరు (24)

33  నాశనం చేయబడని నాశకుడా,+మోసగించబడని మోసగాడా, నీకు శ్రమ! నువ్వు నాశనం చేయడం పూర్తికాగానే, నిన్ను నాశనం చేస్తారు.+ నువ్వు మోసం చేయడం పూర్తికాగానే, నిన్ను మోసం చేస్తారు.   యెహోవా, మా మీద అనుగ్రహం చూపించు.+ నీ మీదే మేము ఆశపెట్టుకున్నాం. ప్రతీ ఉదయం నువ్వు మా బలానివి* అవ్వు,+అవును, కష్టకాలంలో మా రక్షణవి అవ్వు.+   నీ గర్జన విని జనాలు పారిపోతాయి. నువ్వు లేచినప్పుడు దేశాలు చెల్లాచెదురైపోతాయి.+   తిండిబోతు మిడతలు పోగైనట్టుగా మీ దోపుడుసొమ్ము ​పోగుచేయ​బడుతుంది;మిడతల దండ్లు వచ్చినట్టు ప్రజలు వేగంగా దాని మీదికి వస్తారు.   యెహోవా హెచ్చించబడతాడు,ఎందుకంటే ఆయన అత్యున్నత స్థలాల్లో నివసిస్తాడు. ఆయన సీయోనును న్యాయంతో, నీతితో నింపుతాడు.   నీ కాలాలకు స్థిరత్వాన్ని ఇచ్చేది ఆయనే;రక్షణను,+ తెలివిని, జ్ఞానాన్ని, యెహోవా పట్ల భయభక్తుల్ని+ సమృద్ధిగా ఇచ్చేది ఆయనే;ఇదే అతని సంపద.*   ఇదిగో! వాళ్ల శూరులు వీధుల్లో కేకలు వేస్తున్నారు;శాంతి సందేశకులు బోరున ఏడుస్తున్నారు.   రహదారులు నిర్మానుష్యం అయ్యాయి;దారుల్లో ఎవరూ ప్రయాణించట్లేదు. అతను* ఒప్పందాన్ని మీరాడు;నగరాల్ని తృణీకరించాడు;మనుషులంటే అతనికి లెక్కే లేదు.+   దేశం దుఃఖిస్తూ* వాడిపోతోంది. లెబానోను అవమానాలపాలైంది;+ అది కుళ్లిపోయింది. షారోను ఎడారిలా మారింది,బాషాను, కర్మెలు ఊగుతూ ఆకులు రాలుస్తున్నాయి.+ 10  యెహోవా ఇలా అంటున్నాడు: “ఇప్పుడు నేను లేస్తాను,ఇప్పుడు నన్ను నేను హెచ్చించుకుంటాను;+ఇప్పుడు నన్ను నేను ఘనపర్చు​కుంటాను. 11  మీరు ఎండుగడ్డిని గర్భం దాల్చి ​కొయ్యకాలును* కంటారు. మీ మనోవైఖరే* అగ్నిలా మిమ్మల్ని దహించేస్తుంది.+ 12  జనాలు కాలుతున్న సున్నంలా తయా​రౌతారు. నరికేసిన ముళ్లలా వాళ్లు అగ్నితో ​కాల్చేయబడతారు.+ 13  దూరంగా ఉన్న ప్రజలారా, నేను ఏం చేయబోతున్నానో వినండి! దగ్గర్లో ఉన్న ప్రజలారా, నా బలాన్ని గుర్తించండి! 14  సీయోనులోని పాపులు భయపడుతున్నారు;+మతభ్రష్టులు భయంతో వణికిపోతున్నారు. ‘దహించే అగ్ని ఉన్న చోట మనలో ఎవరు నివసించగలరు?+ ఆర్పలేని మంటలున్న చోట మనలో ఎవరు నివసించగలరు?’ అని వాళ్లు అనుకుంటున్నారు. 15  ఎప్పుడూ నీతిగా నడుచుకుంటూ,+నిజాయితీగా మాట్లాడుతూ,+అన్యాయం వల్ల, మోసం వల్ల వచ్చే లాభాన్ని తిరస్కరిస్తూ,లంచం తీసుకోవడానికి చేతులు ​చాపకుండా ఉండే వ్యక్తి,+రక్తపాతం గురించిన మాటలు వినకుండా తన చెవిని,చెడును చూడకుండా తన కళ్లను మూసుకునే వ్యక్తి 16  ఎత్తైన స్థలాల్లో నివసిస్తాడు;అతని సురక్షితమైన ఆశ్రయం* బలమైన రాతి కోటల్లో ఉంటుంది;అతనికి ఆహారం దొరుకుతుంది,అతని నీటి సరఫరా ఎప్పటికీ ఆగదు.”+ 17  నీ కళ్లు మహిమాన్విత రాజును చూస్తాయి;అవి సుదూరాన ఉన్న దేశాన్ని చూస్తాయి. 18  నీ హృదయం భయంకరమైన సంగతిని గుర్తుచేసుకుంటుంది:* “కార్యదర్శి ఎక్కడ? కప్పం కట్టేవాడు ఎక్కడ?+ బురుజుల్ని లెక్కపెట్టేవాడు ఎక్కడ?” 19  అహంకారులైన* ప్రజల్ని నువ్విక చూడవు,వాళ్ల భాష గ్రహించలేనంత కష్టంగా* ఉంటుంది,వాళ్ల నత్తి మాటలు నీకు అర్థంకావు.+ 20  సీయోనును చూడండి, మన పండుగలకు నెలవైన నగరాన్ని+ చూడండి! యెరూషలేము ప్రశాంతమైన నివాస స్థలంగా,ఎప్పటికీ కదిలించబడని గుడారంలా+ ఉండడం నీ కళ్లు చూస్తాయి. ఆ గుడారం మేకులు ఎప్పటికీ ఊడదీయబడవు,దాని తాళ్లలో ఒక్కటి కూడా ఎప్పటికీ తెంచేయబడదు. 21  మహిమాన్వితుడైన యెహోవాఅక్కడ మనకు నదులు, విశాలమైన కాలువలు పారే ప్రాంతంగా ఉంటాడు;తెడ్ల ఓడల సమూహమేదీ అక్కడికి వెళ్లదు,వైభవోపేతమైన ఓడలేవీ అటుగా వెళ్లవు. 22  ఎందుకంటే యెహోవా మన ​న్యాయమూర్తి,+యెహోవా మన శాసనకర్త,+యెహోవా మన రాజు;+మనల్ని రక్షించేది ఆయనే.+ 23  నీ శత్రువుల ఓడల తాళ్లు వదులుగా వేలాడతాయి;అవి ఓడ కొయ్యను పట్టివుంచలేవు, దాని తెరచాపను విప్పలేవు. ఆ సమయంలో విస్తారమైన దోపుడుసొమ్మును పంచుకుంటారు;కుంటివాడు కూడా చాలా దోపుడుసొమ్ము తీసుకుంటాడు.+ 24  అందులో నివసించే వాళ్లెవ్వరూ, “నాకు ఒంట్లో బాలేదు” అని అనరు.+ అందులో నివసించే ప్రజల దోషం క్షమించ​బడుతుంది.+

అధస్సూచీలు

అక్ష., “బాహువువి.”
లేదా “దేవుడిచ్చే సంపద” అయ్యుంటుంది.
ఇది శత్రువును సూచిస్తోంది.
లేదా “ఎండిపోయి” అయ్యుంటుంది.
పంట కోసిన తర్వాత నేలమీద మిగిలే కాడల దుబ్బు.
పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.
లేదా “ఎత్తైన స్థలం.”
లేదా “ధ్యానిస్తుంది.”
లేదా “అనాగరికులైన.”
అక్ష., “లోతుగా.”