కంటెంట్‌కు వెళ్లు

దేవుని ప్రభుత్వం ఏమి చేస్తుంది?

దేవుని ప్రభుత్వం ఏమి చేస్తుంది?

బైబిలు ఇచ్చే జవాబు

 దేవుని ప్రభుత్వం, మానవ ప్రభుత్వాలన్నిటినీ తీసివేసి, భూమంతటిని పరిపాలించబోతుంది. (దానియేలు 2:44; ప్రకటన 16:14) అప్పుడు ఆ ప్రభుత్వం ...

  •   చెడ్డ ప్రజలందరినీ నాశనం చేస్తుంది. ఎందుకంటే, వాళ్ల స్వార్థం వల్ల మనకు హాని జరుగుతుంది. “భక్తిహీనులు దేశములో నుండకుండ ... పెరికివేయబడుదురు.”—సామెతలు 2:22.

  •   యుద్ధాల్ని తీసేస్తుంది. “ఆయనే [దేవుడే] భూదిగంతములవరకు యుద్ధములు మాన్పువాడు.”—కీర్తన 46:9.

  •   భూమ్మీద అందరూ శాంతి భద్రతలతో వర్ధిల్లేలా చేస్తుంది. “ఎవరి భయములేకుండ ప్రతివాడును తన ద్రాక్షచెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండును.”—మీకా 4:4.

  •   భూమిని అందమైన తోటలా చేస్తుంది. ‘ఎండిన భూమి సంతోషించును, పుష్పమువలె పూయును.’—యెషయా 35:1.

  •   అందరూ సంతోషంగా చేయడానికి చేతి నిండా పనిని కల్పిస్తుంది. దేవుడు ఎంపిక చేసుకున్న ప్రజలు తమ సొంత చేతులతో చేసిన పని వల్ల వచ్చే ప్రయోజనాలను పూర్తిగా అనుభవిస్తారు. వాళ్లు వృథాగా ప్రయాసపడరు.—యెషయా 65:21-23.

  •   రోగాలను తీసివేస్తుంది. “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు.”—యెషయా 33:24.

  •   మనం ముసలి వాళ్లం అవ్వకుండా చేస్తుంది. “అప్పుడు వాని మాంసము బాలురమాంసముకన్న ఆరోగ్యముగా నుండును. వానికి తన చిన్ననాటిస్థితి తిరిగి కలుగును.”—యోబు 33:25.

  •   చనిపోయినవాళ్లను మళ్లీ బ్రతికిస్తుంది. “సమాధులలో నున్నవారందరు ఆయన [యేసు] శబ్దము విని ... బయటికి వచ్చెదరు.”—యోహాను 5:28, 29.