కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వేరేవాళ్లతో పోల్చుకోకండి

వేరేవాళ్లతో పోల్చుకోకండి

రెండవది

వేరేవాళ్లతో పోల్చుకోకండి

దీని గురించి బైబిలు ఏమి చెబుతోంది? “మీ పనిని బాగా చేయండి, అప్పుడు మిమ్మల్ని చూసి మీరే గర్వపడతారు. అయితే మిమ్మల్ని వేరేవాళ్లతో పోల్చుకోకండి.”—గలతీయులు 6:4, కంటెంపరరీ ఇంగ్లీష్‌ వర్షన్‌.

దీన్ని పాటించడం ఎందుకు కష్టం? మనల్ని మనం ఇతరులతో పోల్చుకోవడానికి మొగ్గు చూపిస్తాం, కొన్నిసార్లు మనకున్న వాటికంటే తక్కువ ఉన్నవాళ్లతో, చాలాసార్లు మనకన్నా బలవంతులతో, సంపన్నులతో, లేదా ఎక్కువ నైపుణ్యాలు ఉన్నవాళ్లతో పోల్చుకుంటుంటాం. కారణమేదైనా, వేరేవాళ్లతో పోల్చుకోవడం మంచిది కాదు. ఒక వ్యక్తి దగ్గర ఉన్నవాటితో లేదా అతను చేయగలిగే వాటితో అతని విలువను అంచనా వేయవచ్చని పొరబడుతుంటాం. మనం అవతలి వాళ్లలో అసూయను, పోటీతత్వాన్ని కూడా కలిగించే అవకాశముంది.—ప్రసంగి 4:4.

మీరేమి చేయవచ్చు? దేవుడు మిమ్మల్ని ఎలా పరిగణిస్తాడో మిమ్మల్ని మీరు అలాగే పరిగణించుకోవడానికి ప్రయత్నించండి. ఆయనకు మీమీద ఎలాంటి అభిప్రాయం ఉందో మీ గురించి మీకు అదే అభిప్రాయం ఉండాలి. “ప్రజలు బాహ్య సౌందర్యం చూస్తారు కానీ యెహోవా a హృదయం చూస్తాడు.” (1 సమూయేలు 16:7, పరిశుద్ధ బైబల్‌: తెలుగు, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) యెహోవా మిమ్మల్ని ఇతరులతో పోలుస్తూ మీ విలువను అంచనా వేయడు గానీ, మీ హృదయంలో ఉన్నదాన్ని తెలుసుకుని అంటే మీ ఆలోచనలను, భావాలను, ఉద్దేశాలను పరిశీలించి మీ విలువను అంచనా వేస్తాడు. (హెబ్రీయులు 4:12, 13) యెహోవా మీ పరిమితులను అర్థం చేసుకుంటాడు, మీరు కూడా మీ పరిమితులను తెలుసుకుని వాటికి తగ్గట్టు ఉండాలని ఆయన కోరుతున్నాడు. వేరేవాళ్లతో పోల్చుకుని మీ విలువను అంచనా వేసుకుంటే, మీలో గర్వమన్నా పెరుగుతుంది లేదా మీకెంతో అసంతృప్తయినా కలుగుతుంది. కాబట్టి మీరు తలపెట్టే ప్రతీ ప్రయత్నంలోనూ విజయం సాధించలేరని వినయంగా ఒప్పుకోండి.—సామెతలు 11:2.

దేవుని దృష్టిలో మీకు విలువ ఉండాలంటే ముఖ్యంగా మీరేం చేయాలి? ఆయన మీకా ప్రవక్తతో ఇలా రాయించాడు, ‘మనిషీ! ఏది మంచిదో అది యెహోవా నీకు తెలియజేశాడు. న్యాయంగా ప్రవర్తించమని, కరుణను ప్రేమించమని, వినయం కలిగి నీ దేవునితో కలిసి నడవమని ఆయన నిన్ను కోరుతున్నాడు.’ (మీకా 6:8, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) మీరు ఆ సలహాను పాటిస్తే, ఆయన మీ గురించి శ్రద్ధ తీసుకుంటాడు. (1 పేతురు 5:6, 7) సంతృప్తి కలిగి ఉండడానికి ఆ ఒక్క కారణం చాలదా? (w10-E 11/01)

[అధస్సూచి]

a బైబిల్లో దేవుని పేరు అలా ఉంది.

[5వ పేజీలోని చిత్రం]

యెహోవా మన హృదయంలో ఉన్నదాన్ని బట్టి మన విలువను అంచనా వేస్తాడు