కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సంతృప్తిగా ఉండడం సాధ్యమేనా?

సంతృప్తిగా ఉండడం సాధ్యమేనా?

సంతృప్తిగా ఉండడం సాధ్యమేనా?

“సంతృప్తి ఉంటే పేదవాళ్లు ధనవంతులవుతారు; అది లేకపోతే ధనవంతులు పేదవాళ్లవుతారు.” —బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌.

ఆయన అన్నట్టే, డబ్బుతో వస్తువులను కొన్నట్లు సంతృప్తిని కొనలేమని చాలామంది తెలుసుకున్నారు. ఈ లోకంలో సంతృప్తిని పొందడం నిజంగా కష్టమే! ఎందుకంటే, ఎక్కువ ఆస్తులను సంపాదించుకోవాలనే ఆశ, గొప్ప లక్ష్యాలను చేరుకోవాలనే తపన, వేరేవాళ్లను చూసి వాళ్లలా ఉండాలనే కోరిక ఈ లోకంలోని ప్రజల్లో ఎక్కువగా ఉంది. ఇలాంటివి ఏవైనా మీకు ఎదురయ్యాయా?

• మీ దగ్గర ఇప్పటికే ఎన్నో వస్తువులున్నా ఈ ఒక్కటి కొంటే చాలు సంతృప్తి మీ సొంతమవుతుందని చెవులు వాచిపోయేలా చెప్పే వాణిజ్య ప్రకటనలు.

• పని స్థలాల్లో లేదా పాఠశాలల్లో, వేరేవాళ్లతో సమానంగా మీరు చేయగలిగితేనే మీకంటూ ఒక విలువ ఉంటుందని అనిపించేలా చేసే పోటీ.

• చేసినదానికి కృతజ్ఞత చూపించని ప్రజలు.

• తమ దగ్గరున్న వాటితో ఈర్ష్య కలిగించే స్నేహితులు.

• జీవితంలో ఎదురయ్యే ముఖ్యమైన సందేహాలను ఎవ్వరూ తీర్చలేకపోవడం.

అలాంటి సవాళ్లు ఎదురవుతుంటే, సంతృప్తిగా ఉండడం నిజంగా సాధ్యమేనా? అపొస్తలుడైన పౌలు ‘సంతృప్తిగా ఉండడంలోని రహస్యం’ గురించి చెప్పాడు. కొన్నిసార్లు ఆయనకు అన్నీ ఉండేవి, ఇంకొన్నిసార్లు ఏమీ లేక చాలా కష్టాలుపడేవాడు. ఆయన స్నేహితులు ఆయనను గౌరవించారు, కానీ వేరేవాళ్లు ఆయనను ఎగతాళి చేశారు. అయినా సరే, ‘ఎలాంటి పరిస్థితుల్లోనైనా తృప్తిగా ఉండడం నేర్చుకున్నాను’ అని ఆయన చెప్పాడు.—ఏటవాలు ముద్దక్షరాలు మావి; ఫిలిప్పీయులు 4:11, 12, పరిశుద్ధ బైబల్‌: తెలుగు, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

సంతృప్తిగా ఉండడానికి ఎప్పుడూ ప్రయత్నించని వాళ్లకు సంతృప్తి అంటే ఏమిటో తెలియదు, అయితే పౌలు చెప్పినట్లు, సంతృప్తిగా ఉండడం నేర్చుకోవచ్చు. సంతృప్తి పొందడానికి తోడ్పడే ఐదు రహస్యాలు దేవుని వాక్యమైన బైబిల్లో ఉన్నాయి. అవేమిటో తెలుసుకోమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం. (w10-E 11/01)