కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

panitan/stock.adobe.com

జ్ఞాపకార్థ ఆచరణ ప్రచార కార్యక్రమం

యేసు పేదరికానికి ముగింపు పలుకుతాడు

యేసు పేదరికానికి ముగింపు పలుకుతాడు

 యేసు భూమ్మీద ఉన్నప్పుడు, ప్రజల మీద ముఖ్యంగా పేదవాళ్ల మీద, అణచివేయబడినవాళ్ల మీద చాలా ప్రేమ చూపించాడు. (మత్తయి 9:36) అందరూ ప్రయోజనం పొందేలా తన ప్రాణాన్ని కూడా త్యాగం చేశాడు. (మత్తయి 20:28; యోహాను 15:13) త్వరలో, దేవుని రాజ్యానికి రాజుగా ఆయన తన అధికారాన్ని, శక్తిని ఉపయోగించి భూమ్మీద ఉన్న పేదరికాన్ని పూర్తిగా తీసేస్తాడు. అలా ప్రజల మీద తనకు ఎంత ప్రేమ ఉందో మళ్లీ చూపిస్తాడు.

 యేసు ఏం చేస్తాడో వివరిస్తూ బైబిలు ఈ చక్కని మాటల్ని చెప్తుంది:

  •   “ప్రజల్లో దీనులకు ఆయన న్యాయం చేయాలి, పేదవాళ్ల పిల్లల్ని కాపాడాలి.”—కీర్తన 72:4.

 యేసు ఇప్పటివరకు మన కోసం చేసినవాటికి, ఇకపై చేయబోయే వాటికి మనమెలా కృతజ్ఞత చూపించవచ్చు? లూకా 22:19 లో తన మరణాన్ని గుర్తుచేసుకోమని యేసు తన అనుచరులకు చెప్పాడు. అందుకే ప్రతీ సంవత్సరం ఆయన చనిపోయిన రోజున యెహోవాసాక్షులందరూ కలుసుకుంటారు. 2024, మార్చి 24, ఆదివారం రోజున మేము జరుపుకునే యేసు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.

మీకు దగ్గర్లో జ్ఞాపకార్థ ఆచరణ ఎక్కడ జరుగుతుందో తెలుసుకోండి