కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

hadynyah/E+ via Getty Images

అప్రమత్తంగా ఉండండి!

యుద్ధాలు, వాతావరణ మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న ఆహార కొరతలు—బైబిలు ఏం చెప్తుంది?

యుద్ధాలు, వాతావరణ మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న ఆహార కొరతలు—బైబిలు ఏం చెప్తుంది?

 యుక్రెయిన్‌లో జరిగిన యుద్ధం అలాగే వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల, ప్రపంచవ్యాప్తంగా ఆహార నిల్వలకు తీవ్రమైన నష్టం కలిగింది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ చాలామంది తమ కడుపు నింపుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు.

  •   “యుద్ధాలు, వాతావరణంలో మార్పులు, పెరిగిన కరెంట్‌ ధరలు అలాగే ఇతర కారణాల వల్ల ఆహారాన్ని ఉత్పత్తి చేసి, దాన్ని అందుబాటులోకి తీసుకురావడం కష్టమైపోతుంది.”—ఆంటన్యూ గూటెరస్‌, యూ. ఎన్‌ (UN) సెక్రెటరీ-జనరల్‌, 2023 జూలై, 17.

  •   “యుక్రెయిన్‌ నుంచి ధాన్యాన్ని వేరే దేశాలకు ఎగుమతి చేసే విషయంలో రష్యా తన వైఖరిని మార్చుకుంది. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరతలు ఇంకా ఎక్కువౌతాయని, ముఖ్యంగా ఉత్తర ఆఫ్రికా, మిడిల్‌ ఈస్ట్‌ లాంటి తక్కువ సంపాదన ఉండే దేశాల్లో ఆహార ధరలు ఆకాశాన్ని అంటుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.”—ఎటలాయార్‌.కామ్‌, 2023 జూలై, 23.

 ఆహార కొరతల గురించి అలాగే భవిష్యత్తు గురించి బైబిలు ఏం చెప్తుందో తెలుసుకోండి.

ఆహార కొరతలు ఉంటాయని బైబిలు ముందే చెప్పింది

  •   యేసు ఇలా చెప్పాడు: “ఒక దేశం మీద మరో దేశం, ఒక రాజ్యం మీద మరో రాజ్యం దాడిచేస్తాయి. ఒక ప్రాంతం తర్వాత ఇంకో ప్రాంతంలో ఆహారకొరతలు వస్తాయి.”—మత్తయి 24:7.

  •   బైబిల్లో ఉన్న ప్రకటన పుస్తకం, నాలుగు గుర్రాల మీద కూర్చున్న నలుగురు వ్యక్తుల గురించి సూచనార్థకంగా చెప్పింది. వాళ్లలో ఒక గుర్రం మీద కూర్చున్న వ్యక్తి యుద్ధాలకు గుర్తుగా ఉన్నాడు. అతని వెనుక మరో గుర్రం మీద కూర్చున్న వ్యక్తి ఆహారకొరతకు గుర్తుగా ఉన్నాడు. అలా జరిగినప్పుడు ఆహారం దొరకడమే కష్టమవుతుంది, దానికితోడు ధరలు ఇంకా మండిపోతాయి. “నేను చూసినప్పుడు ఇదిగో, ఒక నల్లని గుర్రం కనిపించింది. దానిమీద కూర్చున్న వ్యక్తి చేతిలో ఒక త్రాసు ఉంది . . . ఒక స్వరం ఇలా అనడం విన్నాను: ‘దేనారానికి ఒక కిలో గోధుమలు, దేనారానికి మూడు కిలోల బార్లీ.’”—ప్రకటన 6:5, 6.

 ఆహార కొరతల గురించి బైబిలు చెప్పిన మాటలు మనకాలంలో నిజం అవుతున్నాయి. అందుకే మనం జీవిస్తున్న కాలాన్ని ‘చివరి రోజులు’ అని బైబిలు పిలుస్తుంది. (2 తిమోతి 3:1) ‘చివరి రోజుల’ గురించి, నాలుగు గుర్రాల మీద కూర్చున్న నలుగురు వ్యక్తుల గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి 1914 నుండి లోకం మారిపోయింది వీడియోను చూడండి అలాగే ఇంగ్లీష్‌లో ఉన్న “గుర్రాల మీద స్వారీ చేస్తున్న నలుగురు వ్యక్తులు—వాళ్లు ఎవరు?” అనే ఆర్టికల్‌ని చదవండి.

బైబిలు మనకు ఎలా సహాయం చేస్తుంది?

  •   ఆహార ధరలు పెరిగిపోవడం, ఆహార కొరతలు ఏర్పడడంతో సహా ఇతర కష్టాలు ఎదురౌతున్నప్పుడు, వాటిని తట్టుకోవడానికి బైబిలు మనకు పాటించగలిగే సలహాల్ని ఇస్తుంది. అలాంటి కొన్ని సలహాల్ని “ఉన్నంతలో ఎలా జీవించవచ్చు?”అనే ఆర్టికల్‌లో చూడండి.

  •   దేవుని వాక్యం పరిస్థితులు మంచిగా మారతాయనే ఆశను మనకిస్తుంది. ‘భూమ్మీద సస్యసమృద్ధి ఉండే’ సమయం వస్తుందని, అందరికీ సరిపోయేంత ఆహారం దొరుకుతుందని బైబిలు మాటిస్తోంది. (కీర్తన 72:16) ఆ మంచి భవిష్యత్తు ఎలా ఉంటుందో, దాన్ని మీరెందుకు నమ్మవచ్చో ఎక్కువ తెలుసుకోవడానికి ఇంగ్లీష్‌లో ఉన్న “మంచి భవిష్యత్తు కోసం నిజమైన నిరీక్షణ” అనే ఆర్టికల్‌ చదవండి.