కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

115వ కథ

భూమిపై ఒక కొత్త పరదైసు

భూమిపై ఒక కొత్త పరదైసు

ఆ పొడవైన చెట్లను, అందమైన పువ్వులను, ఎత్తయిన కొండలను చూడండి. ఇక్కడంతా ఎంతో అందంగా ఉంది కదా? ఆ జింక పిల్లవాని చేతిలో నుంచి ఆహారం ఎలా తింటుందో చూడండి. ఆ పచ్చిక మైదానంలో ఉన్న సింహాలను, గుర్రాలను చూడండి. ఇటువంటి ప్రాంతంలో ఉండే గృహంలో జీవించడానికి మీరు ఇష్టపడరా?

మీరు భూమిపై పరదైసులో నిత్యమూ జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేడు ప్రజలు అనుభవించే నొప్పులు, బాధలు మీకు ఉండకూడదని ఆయన ఉద్దేశం. క్రొత్త పరదైసులో జీవించే వాళ్ళ కోసం బైబిలు ఇలా వాగ్దానం చేస్తోంది: ‘దేవుడు వారితో ఉంటాడు. మరణం గాని, ఏడ్పు గాని, వేదన గాని ఇక ఉండదు. పాత సంగతులు గతించిపోయాయి.’

ఈ అద్భుతమైన మార్పు జరిగేలా యేసు చేస్తాడు. అదెప్పుడో మీకు తెలుసా? ఆయన భూమిపైనుండి చెడుతనాన్నంతటినీ, చెడ్డ ప్రజలందరినీ తీసివేసిన తర్వాత అలా చేస్తాడు. యేసు భూమ్మీద ఉన్నప్పుడు అన్ని రకాల వ్యాధులుగల ప్రజలను బాగుచేశాడని, చివరకు చనిపోయినవాళ్ళను కూడా లేపాడని గుర్తు తెచ్చుకోండి. దేవుని రాజ్యానికి రాజైనప్పుడు యేసు భూమంతటా ఏమి చేస్తాడో చూపించడానికే అలా చేశాడు.

భూమ్మీద క్రొత్త పరదైసు ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి! యేసు తాను ఎంపిక చేసికొన్న మరికొందరితోపాటు పరలోకంలో పరిపాలిస్తుంటాడు. ఆ పాలకులు భూమ్మీద ఉన్న ప్రతి ఒక్కరి గురించి శ్రద్ధ తీసుకొని వాళ్ళు సంతోషంగా ఉండేలా చేస్తారు. అయితే దేవుడు మనకు తన క్రొత్త పరదైసులో నిత్యజీవాన్ని ఇవ్వాలంటే మనమేమి చేయాలో చూద్దాం.