కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బాధపడుతున్న యువతికి ఓదార్పు

బాధపడుతున్న యువతికి ఓదార్పు

బాధపడుతున్న యువతికి ఓదార్పు

మెక్సికోలో, పాఠశాల విద్యార్థినియైన 13 ఏళ్ల సిబియా, తన తోటి విద్యార్థిని తరచూ ఏడుస్తూ స్కూలుకు రావడం గమనించింది. ఆ అమ్మాయిని ఓదార్చడానికి ఆమె ప్రయత్నించింది. ఒకరోజు ఆ అమ్మాయి, సిబియాతో వాళ్ళ నాన్న త్రాగుబోతనీ రోజూ వాళ్ళ అమ్మను కొడతాడనీ మనసువిప్పి చెప్పింది.

సిబియా ఇలా వివరిస్తోంది: “తనకు బ్రతకాలని లేదని, ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నించాననీ ఆమె నాతో చెప్పింది. తనను ఎవరూ ప్రేమించడం లేదనీ, తనకెవరూ లేరన్నట్లు అనిపిస్తుందని చెప్పింది. అయితే ఆమెను అమితంగా ప్రేమించే వ్యక్తి ఉన్నాడనీ, ఆయన విశ్వంలోనే అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తి అని నేనామెతో చెప్పాను. ఆ తర్వాత నేను, మానవుల కోసం యెహోవా సంకల్పం గురించి వివరించాను.”

ఆ తర్వాత సిబియా తన తోటి విద్యార్థినికి యువత అడిగే ప్రశ్నలు​—⁠ఆచరణాత్మకమైన సమాధానాలు (ఆంగ్లం) పుస్తకాన్నిచ్చి, ప్రతీరోజు స్కూల్‌ విరామ సమయంలో ఆమెతో కలిసి ఆ పుస్తకాన్ని అధ్యయనం చేయడం ఆరంభించింది. క్రమంగా ఆ అమ్మాయిలో మార్పువచ్చి, ముభావంగా ఉండడం మానేసి, ఇతరులతో మాట్లాడడం, నవ్వడం మొదలుపెట్టింది. ఆ అమ్మాయి సిబియాకు పంపిన ఉత్తరంలో ఇలా వ్రాసింది: “నీ స్నేహానికి, నన్ను అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు. నేనెప్పుడు నీలాంటి అక్కే నాకుండాలని కోరుకున్నాను. నా పట్ల శ్రద్ధ తీసుకునే ఒక వ్యక్తి, అంటే యెహోవా ఉన్నాడని నాకిప్పుడు తెలుసు.”

యువత అడిగే ప్రశ్నలు అనే పుస్తకం నుండి ప్రయోజనం పొందగల యౌవనస్థులు మీకు తెలిసుండవచ్చు. దానిలోని 39 అధ్యాయాల్లో ఇవి ఉన్నాయి: “నేను నిజమైన స్నేహితులను ఎలా సంపాదించుకోగలను?” “వివాహానికి ముందు లైంగిక సంబంధాలు కలిగివుండడం సరైనదేనా?” “అది నిజమైన ప్రేమో కాదో నాకెలా తెలుస్తుంది?” ఈ క్రింద ఇవ్వబడిన కూపన్‌ను నింపి, ఈ పత్రికలోని 5వ పేజీలో ఇవ్వబడిన చిరునామాల్లో తగినదానికి పంపించడం ద్వారా మీరు మరింత సమాచారం కోరవచ్చు. (g 10/06)

□ ఎలాంటి షరతులు విధించకుండా ఇక్కడ చూపించిన పుస్తకం గురించి మరింత సమాచారాన్ని పంపించమని కోరుతున్నాను.

□ ఉచిత గృహ బైబిలు అధ్యయనం గురించి దయచేసి నన్ను సంప్రదించండి.