కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

117వ పాట

మంచితనం అనే లక్షణం

మంచితనం అనే లక్షణం

(2 దినవృత్తాంతములు 6:41)

  1. 1. ఓ యెహోవా, పవిత్రుడా,

    నీ సొంతం మంచితనం.

    దీవించావు దానితోనే

    మమ్మల్ని, మా రోజుల్ని.

    సాటిలేని కరుణను

    చూపించావు మా మీద.

    సేవిస్తాము నిన్నే మేము

    సంతోషంగా ఎప్పుడూ.

  2. 2. మంచివార్త ప్రకటిస్తూ,

    మంచిగా ప్రవర్తించే

    నీ ప్రజల్లో కూడా నువ్వు

    నింపావు మంచితనం.

    మంచి బోధ, కాపరులు

    మాకు ఆశీర్వాదాలు.

    మంచితనం చూపించేలా

    పవిత్రశక్తినివ్వు.

  3. 3. సోదరుల పట్ల చూపే

    మంచితనం దీవించు.

    అందరికీ మంచి చేస్తాం,

    ప్రాముఖ్యంగా వాళ్లకు.

    నీ దీవెన, శక్తి ఉంటే

    కుటుంబంలో, సంఘంలో

    ఎక్కడున్నా మేమందరం

    చూపిస్తాం మంచితనం.