పాట 116
దయకు ఉన్న శక్తి
-
1. దేవా, యెహోవా, నిన్నే స్తుతిస్తాం
నిండు మనస్సుతో.
ఉన్నా తెలివి, గొప్ప బలము
చూపిస్తావు ప్రేమ, దయ.
-
2. ఆహ్వానించాడు నీ కుమారుడు
కృంగినవాళ్లను.
తేలికయిన కాడి తనది;
ఇస్తుందెంతో సేదదీర్పు.
-
3. మన దేవుడు, మన ప్రభువు
ఆదర్శప్రాయులు.
మనం వాళ్లలా దయ చూపిస్తే,
ఉంటాం స్థిరంగా ఎప్పుడూ.
(మీకా 6:8; మత్త. 11:28-30; కొలొ. 3:12; 1 పేతు. 2:3 కూడా చూడండి.)