కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిలు ఏం చెప్తుంది?

బైబిలు ఏం చెప్తుంది?

హార్‌మెగిద్దోను అంటే ఏంటి?

కొందరి నమ్మకాలు:

అది న్యూక్లియర్‌ ఆయుధాల వల్ల లేదా పర్యావరణ నాశనం వల్ల ప్రపంచవ్యాప్తంగా జరిగే నాశనం. మీకేం అనిపిస్తుంది?

పరిశుద్ధ లేఖనాలు ఏమంటున్నాయి?

హార్‌మెగిద్దోను ఒక నిజమైన స్థలం కాదు. అది “దేవుని మహారోజున జరిగే యుద్ధం.” చెడ్డవాళ్ల మీద ఆయన చేసే యుద్ధం.—ప్రకటన 16:14, 16.

బైబిలు ఇంకా ఏమి చెప్తుంది?

  • దేవుడు హార్‌మెగిద్దోను యుద్ధం చేసేది భూమిని నాశనం చేయడానికి కాదు కానీ దానిని మనుషుల చేతిలో నుండి నాశనం అవకుండా కాపాడడానికి.—ప్రకటన 11:18.

  • హార్‌మెగిద్దోను యుద్ధం ద్వారా యుద్ధాలు అన్నీ ముగుస్తాయి.—కీర్తన 46:8, 9.

హార్‌మెగిద్దోను యుద్ధం నుండి తప్పించుకుని బ్రతకడం సాధ్యమేనా?

మీరేం నమ్ముతున్నారు?

  • అవును

  • కాదు

  • తెలీదు

పరిశుద్ధ లేఖనాలు ఏమంటున్నాయి?

అన్ని దేశాల నుండి వచ్చిన “గొప్పసమూహం” “మహాశ్రమను” దాటి వస్తారు, దాంతో హార్‌మెగిద్దోను యుద్ధం ముగుస్తుంది.—ప్రకటన 7:9, 14.

బైబిలు ఇంకా ఏమి చెప్తుంది?

  • వీలైనంత ఎక్కువమంది హార్‌మెగిద్దోనును తప్పించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. చెడ్డవాళ్లు మారనప్పుడు మాత్రమే చివరి చర్యగా ఆయన వాళ్లను నాశనం చేస్తాడు.—యెహెజ్కేలు 18:32.

  • హార్‌మెగిద్దోను నుండి తప్పించుకోవడం ఎలాగో బైబిలు వివరిస్తుంది.—జెఫన్యా 2:3.