కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

మీరు ఎప్పుడైనా ఆలోచించారా?

జీవితం అంటే ఇంతేనా?

జీవితం చాలా చిన్నదని మీకెప్పుడైనా అనిపించిందా?

ఆడుకోవడం, కష్టపడి పనిచేయడం, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని పెంచడం, ముసలివాళ్లమవడం జీవితంలో ఇంతకన్నా చేయడానికి ఏమీ లేదా అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? (యోబు 14:1, 2) చాలా తెలివైన వాళ్లు కూడా దీని గురించి ఆలోచించారని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది.—ప్రసంగి 2:11 చదవండి.

జీవితానికి ఏదైనా అర్థం ఉందా? అసలు ఈ ప్రశ్న అడిగే ముందు జీవితం ఎలా మొదలైందో తెలుసుకోవాలి. మన మెదడు, శరీరం ఎంత అద్భుతంగా ఉన్నాయో చూశాక, చాలామంది సృష్టికర్త ఉన్నాడని, మనల్ని సృష్టించడంలో ఆయన ఎంతో జ్ఞానం ఉపయోగించాడనే నిర్ణయానికి వచ్చారు. (కీర్తన 139:14 చదవండి.) మనల్ని ఇంత చక్కగా చేశాడంటే ఒక కారణంతోనే చేసి ఉండాలి! ఆ కారణం తెలుసుకున్నప్పుడే మన జీవితానికి సరైన అర్థం ఉంటుంది.

దేవుడు మనుషుల్ని ఎందుకు చేశాడు?

మొదటి స్త్రీపురుషులను దేవుడు ఆశీర్వదిస్తూ ఒక ఆసక్తికరమైన పని ఇచ్చాడు. వాళ్లు పిల్లలతో భూమిని నింపుతూ, భూమంతటినీ అందంగా చేసి నిరంతరం జీవించాలన్నదే దేవుని ఉద్దేశం.—ఆదికాండము 1:28, 31 చదవండి.

మానవులు ఆయనకు ఎదురు తిరగడం వల్ల దేవుని ఉద్దేశం నెరవేరడానికి సమయం పట్టింది. కానీ ఆయన మనల్ని వదిలేయలేదు, ఆయన ఉద్దేశాన్ని మార్చుకోలేదు. నమ్మకంగా ఉన్నవాళ్లను కాపాడడానికి, భూమ్మీద ఆయన అనుకున్నది నెరవేర్చడానికి దేవుడు అప్పటినుండి పనిచేస్తూ ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది! సంతోషంగా ఉండడానికే దేవుడు మనల్ని సృష్టించాడు. మీరు ఆ జీవితాన్ని అనుభవించాలన్నది ఆయన ఉద్దేశం. (కీర్తన 37:29 చదవండి.) అలా జీవించడం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనాలుంటాయో ఆయన గ్రంథం నుండి తెలుసుకోండి. (w15-E 08/01)