కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

2 | “లేఖనాలు ఇచ్చే ఊరట”

2 | “లేఖనాలు ఇచ్చే ఊరట”

బైబిల్లో ఇలా ఉంది: “మన సహనం వల్ల, లేఖనాలు ఇచ్చే ఊరట వల్ల మనం నిరీక్షణ కలిగివుండాలని పూర్వం రాయబడినవన్నీ మనకు బోధించడానికే రాయబడ్డాయి.”​—రోమీయులు 15:4.

అంటే . . .

నెగిటివ్‌ ఆలోచనల్ని తట్టుకోవాలంటే చాలా శక్తి కావాలి. బైబిల్లో ఉన్న ఊరటనిచ్చే మాటలు మనకు ఆ శక్తినిస్తాయి. భవిష్యత్తులో ఒక కాలం వస్తుందని, అప్పుడు మానసిక వేదన పడాల్సిన పరిస్థితే ఉండదని కూడా బైబిలు చెప్తుంది.

దానివల్ల ఉపయోగం

అప్పుడప్పుడు అందరికీ బాధగా అనిపిస్తుంది; కానీ డిప్రెషన్‌, ఆందోళన ఉన్నవాళ్ల పరిస్థితి వేరు. బాధ, వేదన, ఒంటరితనం, వెలితి లాంటివి వాళ్లను ప్రతీ నిమిషం వెంటాడుతూ ఉంటాయి. అలాంటి వాళ్లకు బైబిలు ఎలా సహాయం చేస్తుంది?

  • నెగెటివ్‌ ఆలోచనల్ని దూరం చేసే ఎన్నో పాజిటివ్‌ విషయాలు బైబిల్లో ఉన్నాయి. (ఫిలిప్పీయులు 4:8) అవి మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. ఎమోషన్స్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవడానికి సహాయం చేస్తాయి.​—కీర్తన 94:18, 19.

  • మనం ఎందుకూ పనికిరామనే ఆలోచనను తీసేసుకోవడానికి బైబిలు సహాయం చేస్తుంది.​—లూకా 12:6, 7.

  • మనం ఒంటరి వాళ్లం కాదని, మనల్ని పుట్టించిన దేవుడు మన ఫీలింగ్స్‌ని పూర్తిగా అర్థం చేసుకుంటాడని బైబిలు చెప్తుంది. ఇలా మనలో ధైర్యాన్ని నింపే విషయాలు బైబిల్లో ఇంకా చాలా ఉన్నాయి.​—కీర్తన 34:18; 1 యోహాను 3:19, 20.

  • మన మనసుకు తగిలిన గాయాలు ఎప్పటికీ గుర్తుకు రాకుండా చేస్తానని దేవుడు బైబిల్లో మాటిస్తున్నాడు. (యెషయా 65:17; ప్రకటన 21:4) గతం తాలూకా చేదు జ్ఞాపకాలు తేనెటీగల్లా మనమీద దాడి చేసినప్పుడు, ధైర్యం తెచ్చుకుని జీవితంలో ముందుకెళ్లడానికి ఈ మాట సహాయం చేస్తుంది.