కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీరు ఇటీవలి కావలికోట సంచికలను జాగ్రత్తగా చదివారా? అయితే, ఈ కింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరేమో చూడండి:

అంతం వచ్చినప్పుడు నాశనమయ్యే వాటిలో కొన్ని ఏమిటి?

ఏమీ చేయలేకపోతున్న మానవ ప్రభుత్వాలు, యుద్ధం, హింస, అన్యాయం, దేవున్నీ మనుషులనూ మోసం చేసిన మతాలతోపాటు భక్తిలేని ప్రజలు కూడా అంతమౌతారు.—7/1, 3-5 పేజీలు.

యెహెజ్కేలు పుస్తకంలోని మాగోగువాడగు గోగు ఎవరు?

మాగోగువాడగు గోగు అంటే సాతాను కాదుగానీ, మహాశ్రమలు ప్రారంభమైన తర్వాత దేవుని ప్రజల మీద దాడి చేసే దేశాల గుంపు.—5/15, 29-30 పేజీలు.

యేసు చేసిన అద్భుతాలు బట్టి ఆయనకు ఉదార స్వభావం ఉందని ఎలా చెప్పవచ్చు?

కానా అనే ఊరిలో జరిగిన పెళ్లిలో యేసు దాదాపు 380 లీటర్ల నీటిని అద్భుతరీతిలో ద్రాక్షారసంగా మార్చాడు. మరో సందర్భంలో ఆయన దాదాపు 5000 కన్నా ఎక్కువమందికి అద్భుతరీతిలో ఆహారాన్ని పంచిపెట్టాడు. (మత్త. 14:14-21; యోహా. 2:6-11) ఈ రెండు సందర్భాల్లో ఆయన తన తండ్రిలాగే ఉదార స్వభావాన్ని చూపించాడు.—6/15, 4-5 పేజీలు.

మనం అపరిపూర్ణులమైనా దేవున్ని సంతోషపెట్టవచ్చని ఎలా చెప్పవచ్చు?

యోబు, లోతు, దావీదు వంటివాళ్లు పొరపాట్లు చేశారు. కానీ వాళ్లు దేవుని మాట విని ఆయనను సేవించాలని హృదయపూర్వకంగా కోరుకున్నారు. చేసిన తప్పుల విషయంలో బాధపడి, వాళ్ల ప్రవర్తనను మార్చుకోవడానికి ఇష్టపడ్డారు. అందుకే దేవునికి వాళ్లంటే ఇష్టం. వాళ్లలాగే మనం కూడా దేవున్ని సంతోషపెట్టవచ్చు.—10/1, 11-12 పేజీలు.

మహాబబులోను నాశనమైనప్పుడు దానిలోని సభ్యులందరూ నాశనమౌతారా?

అవ్వకపోవచ్చు. జెకర్యా 13:4-6 వచనాలు చెప్తునట్లు, చివరికి కొంతమంది మతనాయకులు కూడా అబద్ధమతంతో తాము తెగతెంపులు చేసుకున్నామని, తమకు అసలు దానితో సంబంధమే లేదని చెప్పుకుంటారు.—7/15, 15-16 పేజీలు.

దేవుని ప్రజలు ఆలోచించాల్సిన కొన్ని విషయాలు ఏమిటి?

క్రైస్తవులు ఆలోచించాల్సిన విషయాల్లో కొన్ని ఏమిటంటే: యెహోవా సృష్టి, ఆయన వాక్యమైన బైబిలు, ప్రార్థన అనే వరం, ఆయన ప్రేమతో ఏర్పాటు చేసిన విమోచన క్రయధనం.—8/15, 10-13 పేజీలు.

పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్లు చెడు స్నేహాల విషయంలో ఏమి గుర్తుపెట్టుకోవాలి?

మనం అందరితో స్నేహంగా ఉండాలని కోరుకున్నా, యెహోవాను ఆరాధించని వ్యక్తిని, ఆయన ప్రమాణాల పట్ల గౌరవం లేని వ్యక్తిని ప్రేమించడం తప్పు. (1 కొరిం. 15:33)—8/15, 25వ పేజీ.

పేతురు విశ్వాసం ఎందుకు బలహీనపడింది? కానీ ఆయన దాన్ని మళ్లీ ఎలా బలపర్చుకున్నాడు?

అపొస్తలుడైన పేతురు విశ్వాసంతోనే, యేసు వైపు నీళ్ల మీద నడుచుకుంటూ వెళ్లాడు. (మత్త. 14:24-32) కానీ బలమైన గాలుల్ని, అలల్ని చూసి పేతురు భయపడ్డాడు. ఆ తర్వాత ఆయన మళ్లీ యేసు వైపు చూసి సహాయం తీసుకున్నాడు.—9/15, 16-17 పేజీలు.

మార్త ఎన్నో పనుల్లో మునిగిపోవడం నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు?

ఓ సందర్భంలో యేసు కోసం రకరకాల వంటకాలు చేయడంలో మార్త బిజీగా ఉంది. కానీ తన బోధలు వినడానికి కూర్చుని మరియ ఉత్తమమైనదాన్ని ఎంచుకుందని యేసు చెప్పాడు. మనం కూడా అనవసరమైన విషయాలు మన ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అడ్డు రాకుండా జాగ్రత్తపడాలి.—10/15, 18-20 పేజీలు.