కంటెంట్‌కు వెళ్లు

లైంగిక వేధింపుల నుండి నన్ను నేను ఎలా కాపాడుకోవచ్చు?

లైంగిక వేధింపుల నుండి నన్ను నేను ఎలా కాపాడుకోవచ్చు?

బైబిలు ఇచ్చే జవాబు

 బైబిలు ఆధారంగా ఉన్న ఈ చక్కని సలహాలు గమనించండి:

  1.   మర్యాదగా నడుచుకోండి. మీతో కలిసి పని చేస్తున్నవాళ్లతో స్నేహపూర్వకంగా, గౌరవపూర్వకంగా మెలగండి. కానీ వాళ్లు మీమీద లైంగిక కోరికల్ని పెంచుకునేంత చనువుగా మాత్రం ఉండకండి.—మత్తయి 10:16; కొలొస్సయులు 4:6.

  2.   మర్యాదగా ఉండే బట్టలు వేసుకోండి. ఇతరుల్ని రెచ్చగొట్టే బట్టలు వేసుకుంటే, అవి వాళ్లకు తప్పుడు సంకేతాన్ని ఇస్తాయి. అందుకే, “అణకువయు, స్వస్థబుద్ధియు గల” బట్టలు వేసుకోమని బైబిలు సలహా ఇస్తుంది.—1 తిమోతి 2.9.

  3.   చెడ్డవాళ్లతో స్నేహం చేయకండి. సరసాలాడడాన్ని, లైంగిక కోరికల్ని తీర్చుకోవడాన్ని అంగీకరించేవాళ్లతో లేదా వాటిని ఇష్టపడేవాళ్లతో స్నేహం చేయకండి. అలా చేస్తే, ఇతరులు మీతో కూడా సరసాలాడే అవకాశం ఉంది.—సామెతలు 13:20.

  4.   అసభ్యకరమైన సంబాషణలకు దూరంగా ఉండండి. మీ తోటి ఉద్యోగస్థులు ఎవరైనా ‘బూతులు, పోకిరిమాటలు, సరసోక్తులు’ మాట్లాడుతుంటే మీరు అక్కడనుండి వెళ్లిపోండి.—ఎఫెసీయులు 5.4.

  5.   లైంగిక వేధింపులకు గురయ్యే పరిస్థితులకు దూరంగా ఉండండి. ఉదాహరణకు సరైన కారణం లేకుండా, ఎవరైనా మిమ్మల్ని ఆఫీసు అయిపోయిన తర్వాత కూడా ఉండమని అడగితే, జాగ్త్రతగా ఉండండి.—సామెతలు 22:3.

  6.   దృఢంగా, సూటిగా చెప్పండి. ఎవరైనా మిమ్మల్ని లైంగికంగా వేధిస్తుంటే, వాళ్లు అలా ప్రవర్తించడం మీకు అస్సలు ఇష్టంలేదని స్పష్టంగా చెప్పేయండి. (1 కొరంథీయులు 14:9) ఉదాహరణకు, మీరు ఇలా అనవచ్చు: “మీరు అనవసరంగా నన్ను ముట్టుకుంటుంటే, నాకు చాలా చిరాగ్గా ఉంది. అలా చేయకండి.” అసలు ఏమి జరిగిందో, అప్పుడు మీకు ఎలా అనిపించిందో, ఆ విషయంలో మీరు ఏమి చేయబోతున్నారో ఓ ఉత్తరం ద్వారా వాళ్లకు చెప్పవచ్చు. మీకున్న నైతిక ప్రమాణాలు, మత నమ్మకాల కారణంగా మీరు అలాంటి వాటిని ఇష్టపడరని స్పష్టంగా వాళ్లకు చెప్పండి.—1 థెస్సలొనీకయులు 4:3-5.

  7. ఇతరుల సహాయం తీసుకోండి. ఆ వ్యక్తి మిమ్మల్ని ఇంకా వేధిస్తూనే ఉంటే, ఆ విషయాన్ని నమ్మకస్థుడైన ఓ స్నేహితునికో, కుటుంబ సభ్యునికో, తోటి ఉద్యోగికో, లేదా ఈ విషయంలో సహాయం చేసే అనుభవమున్న ఓ వ్యక్తికో మీరు చెప్పవచ్చు. (సామెతలు 27:9) అయితే లైంగిక వేధింపులకు గురైన చాలామంది, ప్రార్థన ద్వారా సహాయం పొందారు. మీరు ఇంతకుముందెప్పుడూ ప్రార్థన చేయకపోయినా, “సమస్తమైన ఆదరణను అనుగ్రహించు” దేవుడైన యెహోవా మీకు సహాయం చేయగలడని గుర్తుంచుకోండి.—2 కొరింథీయులు 1:3.

ఉద్యోగ స్థలంలో లైంగిక వేధింపుల వల్ల లక్షలాదిమంది ముళ్లమీద కూర్చున్నట్టుగా భావిస్తున్నారు. అయితే, బైబిలు వాళ్లకు సహాయం చేయగలదు.