కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీరు ఇటీవలి కావలికోట సంచికలను జాగ్రత్తగా చదివారా? అయితే, ఈ కింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరేమో చూడండి:

• దేవుడు లేవీయులతో “నీ స్వాస్థ్యము నేనే” అని చెప్పినప్పుడు ఆయన ఉద్దేశం ఏమిటి?

ఇశ్రాయేలీయుల్లో లేవీయులు తప్ప మిగతా గోత్రాల వాళ్లందరూ భూమిని స్వాస్థ్యంగా పొందారు. అయితే లేవీయులకు మాత్రం యెహోవాయే ‘స్వాస్థ్యంగా’ ఉంటాడు. (సంఖ్యా. 18:20) వాళ్లు భూమికి బదులు ఒక ప్రత్యేకమైన సేవావకాశాన్ని స్వాస్థ్యంగా పొందారు. అయినా, యెహోవా వాళ్ల కనీస అవసరాలు తీర్చాడు. ఈ రోజుల్లో, రాజ్య సంబంధమైన విషయాలకు మొదటి స్థానమిస్తూ సువార్తను వ్యాప్తి చేసేవాళ్లు కూడా యెహోవా తమ అవసరాలు తీరుస్తాడనే నమ్మకాన్ని కలిగివుండవచ్చు.—9/15, 7-8, 13 పేజీలు.

• ఒక క్రైస్తవుడు తాను ఉల్లాసం కోసం ఎంచుకునేవి తనకు ప్రయోజనం చేకూరుస్తాయో లేదో ఎలా తెలుసుకోవచ్చు?

ఉల్లాసం కోసం మనం ఎంచుకునేవి మనకు ప్రయోజనం చేకూరుస్తాయో లేదో, అవి యెహోవా ఇష్టపడేవిధంగా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి మనం ఈ ప్రశ్నలు వేసుకుంటే మంచిది, ఎలాంటి వినోదాన్ని ఎంచుకుంటాం? ఎంత సమయం వెచ్చిస్తాం? ఎవరితో కలిసి పాల్గొంటాం?—10/15, 9-12 పేజీలు.

• అశ్లీల చిత్రాలను చూడకుండా ఉండడానికి సామెతలు 7:6-23 వచనాల్లో ఉన్న వృత్తాంతం ఎలా సహాయం చేస్తుంది?

ఆ వృత్తాంతం, జారస్త్రీ ఉండే సందు వైపుకు వెళ్లిన ఒక యౌవనస్థుని గురించి చెబుతోంది. ఆమె అతణ్ణి తప్పుదారి పట్టించింది. ఈ రోజుల్లో అశ్లీల చిత్రాలు, వీడియోలు ఉండే ఇంటర్నెట్‌ సైట్లకు వెళ్లకుండా మనం జాగ్రత్తపడాలి. అంతేకాక, ఇంటర్నెట్‌లో అలాంటి చిత్రాలు మనకు తారసపడక ముందే సహాయం కోసం యెహోవాకు ప్రార్థన చేయాలి.—11/15, 9-10 పేజీలు.