సంఖ్యాకాండం 18:1-32

  • యాజకుల, లేవీయుల విధులు (1-7)

  • యాజకులకు ఇవ్వాల్సినవి (8-19)

    • ఉప్పు ఒప్పందం (19)

  • లేవీయులు పదోవంతు తీసుకుంటారు, పదోవంతు ఇస్తారు (20-32)

18  తర్వాత యెహోవా అహరోనుతో ఇలా అన్నాడు: “పవిత్రమైన స్థలానికి సంబంధించి ఏ తప్పు జరిగినా నువ్వు, నీ కుమారులు, నీ వంశస్థులు లెక్క అప్పజె​ప్పాల్సి ఉంటుంది;+ మీ యాజకత్వానికి సంబంధించి ఏ తప్పు జరిగినా నువ్వు, నీ కుమారులు లెక్క అప్పజెప్పాల్సి ఉంటుంది.+  లేవి గోత్రానికి, అంటే నీ పూర్వీకుల గోత్రానికి చెందిన నీ సహోదరుల్ని దగ్గరికి తీసుకురా; వాళ్లు నీతో చేరి సాక్ష్యపు గుడారం ముందు నీకు, నీ కుమారులకు పరిచారం చేస్తారు.+  వాళ్లు నీ విషయంలో, అలాగే గుడారమంతటి విషయంలో తమకున్న బాధ్యతల్ని నిర్వర్తించాలి.+ అయితే వాళ్లు గానీ మీరు గానీ చనిపోకుండా ఉండేలా, వాళ్లు పవిత్ర స్థలానికి చెందిన పాత్రల దగ్గరికి, బలిపీఠం దగ్గరికి అస్సలు రాకూడదు.+  వాళ్లు నీతో చేరి గుడార సేవంతటికీ సంబంధించి ప్రత్యక్ష గుడారం దగ్గర తమకున్న బాధ్యతలు నెరవేరుస్తారు; కానీ వేరేవాళ్లు* ఎవరూ మీ దగ్గరికి రాకూడదు.+  ఇశ్రాయేలు ప్రజల మీదికి ఇంకోసారి నా ఉగ్రత రాకుండా+ ఉండేలా మీరు పవిత్ర స్థలం ​విషయంలో, అలాగే బలిపీఠం విషయంలో మీకున్న బాధ్యతల్ని నెరవేర్చాలి.+  స్వయంగా నేనే ఇశ్రాయేలీయుల్లో నుండి మీ సహోదరులైన లేవీయుల్ని తీసుకొని మీకు ​బహుమతిగా ఇచ్చాను.+ ప్రత్యక్ష గుడార సేవను చూసుకోవడానికి వాళ్లు యెహోవాకు ఇవ్వబ​డ్డారు.  బలిపీఠానికి సంబం​ధించి, తెర లోపల ఉన్నవాటికి సంబంధించి మీకున్న యాజక విధుల్ని చూసుకోవాల్సిన బాధ్యత+ నీది, నీ కుమారులదే; ఈ సేవ మీరే చేయాలి.+ యాజక సేవను నేను మీకు ఒక బహుమతిగా ఇచ్చాను; వేరేవాళ్లు* ఎవరైనా దగ్గరికి వస్తే వాళ్లు చంప​బడాలి.”+  యెహోవా అహరోనుతో ఇంకా ఇలా అన్నాడు: “నాకు వచ్చే కానుకల మీద నేనే నిన్ను అధికారిగా నియమించాను.+ ఇశ్రాయేలీయులు కానుకగా తెచ్చే పవిత్రమైన వాటన్నిట్లో నుండి ఒక భాగాన్ని నేను నీకు, నీ కుమారులకు ఇస్తున్నాను; అది ఎప్పటికీ మీకే చెందుతుంది.+  అగ్నితో అర్పించే అతి పవిత్రమైన అర్పణల్లో నుండి, అంటే వాళ్లు నా దగ్గరికి తీసుకొచ్చే తమ ధాన్యార్పణల్లో నుండి, తమ పాపపరిహారార్థ బలుల్లో నుండి,+ తమ అపరాధ పరిహారార్థ బలుల్లో నుండి, అలా వాళ్లు అర్పించే ప్రతీ అర్పణ నుండి ఆ భాగం మీకు చెందుతుంది. అది నీకు, నీ కుమారులకు అతి పవిత్రమైనది. 10  మీరు దాన్ని ఒక అతి పవిత్రమైన చోట తినాలి.+ మగవాళ్లందరూ దాన్ని తినొచ్చు. అది నీకు పవిత్రమైనదిగా ఉంటుంది.+ 11  ఇశ్రాయేలీయులు తీసుకొచ్చే అల్లాడించే అర్పణలతో+ పాటు వాళ్లు ఇచ్చే కానుకలు+ కూడా మీకే చెందుతాయి. నేను వాటిని నీకు, నీ కుమారులకు, నీ కూతుళ్లకు ఇచ్చాను; అవి ఎప్పటికీ మీకే చెందుతాయి.+ నీ ఇంట్లోని వాళ్లలో పవిత్రంగా ఉన్న ప్రతీ ఒక్కరు దాన్ని తినొచ్చు.+ 12  “వాళ్లు యెహోవా దగ్గరికి తీసుకొచ్చే నూనెలో, కొత్త ద్రాక్షారసంలో, ధాన్యంలో శ్రేష్ఠమైనదంతా, వాళ్ల ప్రథమఫలాలన్నీ నేను నీకు ఇస్తున్నాను.+ 13  వాళ్లు తమ భూమిలో పండిన ప్రతీ పంటలో నుండి యెహోవా దగ్గరికి తీసుకొచ్చే ప్రథమఫలాలు నీకే చెందుతాయి. నీ ఇంట్లోని వాళ్లలో పవిత్రంగా ఉన్న ప్రతీ ఒక్కరు దాన్ని తినొచ్చు. 14  “ఇశ్రాయేలులో ప్రతిష్ఠించబడిన ప్రతీది* నీకే చెందాలి.+ 15  “మనిషే గానీ, జంతువే గానీ వాళ్లు యెహోవా దగ్గరికి తీసుకొచ్చే ప్రతీ మొదటి సంతానం+ నీకే చెందాలి. అయితే మనుషుల మొదటి సంతానాన్ని నువ్వు ​తప్పకుండా విడిపిం​చాలి;+ అలాగే అపవిత్ర జంతువుల మొదటి సంతానాన్ని నువ్వు విడిపించాలి.+ 16  నువ్వు ఆ మొదటి సంతానాన్ని ఒక నెల, అంత​కన్నా ఎక్కువ వయసున్నప్పుడు విమోచనా మూల్యంతో విడిపించాలి; నిర్ణయించబడిన విలువతో, అంటే పవిత్ర స్థల షెకెల్‌* కొలమానం ప్రకారం ఐదు షెకెల్‌ల* వెండితో+ దాన్ని విడిపించాలి. ఒక షెకెల్‌ 20 గీరాలతో* సమానం. 17  మొదట పుట్టిన ఎద్దును, మొదట పుట్టిన మగ గొర్రెపిల్లను, మొదట పుట్టిన మేకను మాత్రం నువ్వు విడిపించకూడదు.+ అవి పవిత్రమైనవి. వాటి రక్తాన్ని నువ్వు బలిపీఠం మీద చిల​కరించాలి,+ వాటి కొవ్వును అగ్నితో అర్పించే ​అర్పణగా పొగ పైకిలేచేలా కాల్చాలి, అది యెహోవాకు ఇంపైన* సువాసన. 18  వాటి మాంసం నీకు చెందాలి. అల్లాడించే ​అర్పణలోని ఛాతి భాగంలాగే, దాని కుడి కాలులాగే అది నీకు చెందాలి.+ 19  ఇశ్రాయేలీయులు యెహోవాకు ఇచ్చే పవిత్రమైన కాను​కలన్నిటినీ+ నేను నీకు, నీతోపాటు నీ కుమారులకు, నీ కూతుళ్లకు ఇచ్చాను; అవి ఎప్పటికీ మీకే చెందుతాయి.+ ఇది యెహోవా నీతో, నీ ​సంతానంతో చేసే శాశ్వతమైన ఉప్పు ఒప్పందం.”* 20  యెహోవా అహరోనుతో ఇంకా ఇలా అన్నాడు: “వాళ్ల దేశంలో మీకు స్వాస్థ్యం ఉండదు, వాళ్ల మధ్య ఏ భూభాగం మీది అవ్వదు.+ ఇశ్రా​యేలీయుల మధ్య నేనే మీ భాగం, నేనే మీ స్వాస్థ్యం.+ 21  “ఇదిగో, లేవీయులు చేస్తున్న సేవకు, అంటే ప్రత్యక్ష గుడారంలో వాళ్లు చేస్తున్న సేవకు ప్రతిఫలంగా నేను ఇశ్రాయేలులో ప్రతీ పదోవంతును+ వాళ్లకు స్వాస్థ్యంగా ఇచ్చాను. 22  ఇక నుండి ఇశ్రాయేలు ప్రజలు ప్రత్యక్ష గుడారం దగ్గరికి రాకూడదు; ఒకవేళ వస్తే, వాళ్లు పాపం చేసినవాళ్లు అవుతారు, చనిపోతారు. 23  ప్రత్యక్ష గుడార సేవను లేవీయులే చేయాలి, పవిత్ర స్థలం విషయంలో ప్రజలు చేసే తప్పులకు లేవీయులే లెక్క అప్పజెప్పాలి.+ ఇశ్రాయేలీయుల మధ్య లేవీయులు ఎలాంటి స్వాస్థ్యాన్నీ సొంతం చేసుకో​కూడదనేది వాళ్లు తరతరాలు పాటించాల్సిన శాశ్వత శాసనం.+ 24  ఎందుకంటే, ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు కానుకగా తెచ్చే పదోవంతును నేను లేవీయులకు స్వాస్థ్యంగా ఇచ్చాను. అందుకే నేను వాళ్లతో, ‘ఇశ్రాయేలీయుల మధ్య వాళ్లు ఎలాంటి స్వాస్థ్యాన్నీ సొంతం చేసుకోకూడదు’+ అని చెప్పాను.” 25  తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: 26  “నువ్వు లేవీయులకు ఇలా చెప్పాలి: ‘నేను ఇశ్రాయేలీయుల నుండి స్వాస్థ్యంగా మీకిచ్చిన పదోవంతును మీరు వాళ్ల నుండి పొందుతారు,+ అయితే ఆ పదోవంతులో పదోవంతును మీరు యెహోవాకు కానుకగా ఇవ్వాలి.+ 27  మీరు కానుకగా ఇచ్చేది, మీ సొంత కళ్లం నుండి తెచ్చిన ధాన్యంలా,+ మీ సొంత ద్రాక్షతొట్టి నుండి తెచ్చిన విస్తారమైన ​ద్రాక్షారసంలా, మీ సొంత నూనె గానుగ నుండి తెచ్చిన విస్తారమైన నూనెలా ఎంచబడుతుంది. 28  ఈ విధంగా మీరు కూడా ఇశ్రాయేలీయుల నుండి పొందిన పదోవంతులన్నిటి నుండి యెహోవాకు కానుక ఇస్తారు; ఇశ్రాయేలీయులు ఇచ్చిన దానిలో నుండి యెహోవా కోసం కాను​కగా మీరు దాన్ని యాజకుడైన అహరోనుకు ఇవ్వాలి. 29  పవిత్రమైన కానుకలుగా మీకు ఇవ్వబడే వాటన్నిట్లో+ అత్యంత శ్రేష్ఠమైన వాటి నుండి మీరు యెహోవాకు ప్రతీ విధమైన కానుక ఇవ్వాలి.’ 30  “నువ్వు వాళ్లకు ఇలా చెప్పాలి: ‘మీరు వాటిలో శ్రేష్ఠమైన వాటిని కానుకగా ఇచ్చినప్పుడు, అవి లేవీయులు తమ సొంత కళ్లం నుండి తెచ్చిన ధాన్యంలా, తమ సొంత ద్రాక్ష​తొట్టి నుండి తెచ్చిన ద్రాక్షారసంలా, తమ సొంత నూనె గానుగ నుండి తెచ్చిన నూనెలా ఎంచ​బడతాయి. 31  మీరు, మీ ఇంటివాళ్లు వాటిని ఎక్కడైనా తినొచ్చు, ఎందుకంటే మీరు ప్రత్యక్ష గుడారం దగ్గర చేసే సేవకు అది మీ జీతం.+ 32  మీరు వాటిలో శ్రేష్ఠమైనవి ఇచ్చినంత కాలం ఈ ​విషయంలో మీరు పాపులవ్వరు; ఇశ్రాయేలీయుల పవిత్రమైన వాటిని మీరు అపవిత్రపర్చకూడదు, అలా అపవిత్రపరిస్తే మీరు చని​పోతారు.’ ”+

అధస్సూచీలు

లేదా “అపరిచితులు,” అంటే, అహరోను వంశస్థులు కానివాళ్లు.
లేదా “అపరిచితులు,” అంటే, అహరోను వంశస్థులు కానివాళ్లు.
అంటే, వెనక్కి తీసుకునే అవకాశం గానీ విడిపించే అవకాశం గానీ లేకుండా దేవునికి సమర్పించడం ద్వారా దేవునికి పవిత్రం చేయబడిన ప్రతీది.
లేదా “పవిత్ర షెకెల్‌.”
అప్పట్లో ఒక షెకెల్‌ 11.4 గ్రాములతో సమానం. అనుబంధం B14 చూడండి.
అప్పట్లో ఒక గీరా 0.57 గ్రాములతో సమానం. అనుబంధం B14 చూడండి.
లేదా “శాంతపర్చే.”
అంటే, శాశ్వతమైన, మార్పులేని ఒప్పందం.