కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్రీస్తు రాకడ మనం దానికి భయపడాలా?

క్రీస్తు రాకడ మనం దానికి భయపడాలా?

క్రీస్తు రాకడ మనం దానికి భయపడాలా?

యేసుక్రీస్తు రాకడ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అది మానవజాతిమీదకు తీర్పును, నాశనాన్ని, శిక్షను తీసుకువస్తుందని అనుకుంటున్నారా? లేక అది మన సమస్యలన్నిటినీ పరిష్కరిస్తుందని ఎదురుచూస్తున్నారా? మనం క్రీస్తు రాకడ గురించి భయపడాలా? లేక దానికోసం ఎదురుచూడాలా?

క్రీస్తు రాకడ గురించి బైబిలు ఇలా చెబుతోంది: “ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును . . . భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు.” (ప్రకటన 1:⁠7) నీతిమంతులను ఆశీర్వదించి, దుష్టులను శిక్షించేందుకు యేసు భవిష్యత్తులో రావడాన్ని ఆ రాకడ సూచిస్తోంది.

అపొస్తలుడైన యోహాను, క్రీస్తు రాకడ గురించి భయపడే బదులు దానికోసం ఎదురుచూశాడు. ఈ రాకడ గురించిన, భూమ్మీద దానివల్ల కలిగే ప్రయోజనం గురించిన సందేశాన్ని పొందిన తర్వాత, యోహాను హృదయపూర్వకంగా ఇలా ప్రార్థించాడు: “ప్రభువైన యేసూ, రమ్ము.” (ప్రకటన 22:​20) అయితే, ఎందుకు “భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు”? ఏ విధంగా “ప్రతి నేత్రము ఆయనను చూచును”? యేసు రాకడ ఏమి సాధిస్తుంది? దానిపట్ల విశ్వాసముంచడంవల్ల మనకిప్పుడు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది? ఈ ప్రశ్నలకు తర్వాతి ఆర్టికల్‌ జవాబిస్తుంది.