కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కలవడం కష్టంగా ఉండేవారిని కలుసుకోవడం

కలవడం కష్టంగా ఉండేవారిని కలుసుకోవడం

రాజ్య ప్రచారకుల నివేదిక

కలవడం కష్టంగా ఉండేవారిని కలుసుకోవడం

యెహోవాసాక్షులు ప్రతి ఒక్కరికీ రాజ్య సందేశాన్ని చేరవేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తారు. ఇండ్లల్లో అరుదుగా కలిసేవారిని కలవడానికి కొన్నిసార్లు ప్రత్యేకమైన ప్రయత్నాలు చేయాల్సివస్తుంది. (మార్కు 13:​10) ఈవిషయమై, దక్షిణ అమెరికాలోని ఒక దేశంలో ఒక ప్రత్యేక పయినీరు ఈక్రింది అనుభవాన్ని తెలియజేస్తున్నాడు.

“నేను నా భార్య నియమించబడిన ప్రాంతానికి రాష్ట్ర గవర్నర్‌ వస్తున్నాడని ఒక రోజు నాకు తెలిసింది. ఇండ్లల్లో చాలా అరుదుగా కలిసేవారి కోవలోకే ఆయన వస్తాడు కాబట్టి, నేను ఆయనకు ఒక ఉత్తరం వ్రాసి, దాంతో దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? బ్రోషూరు, దేవుని కోసం మానవజాతి అన్వేషణ (ఆంగ్లం), నిత్యజీవానికి నడిపించే జ్ఞానము పుస్తకాలతోపాటు కొన్ని బైబిలు ప్రచురణలను జత చేశాను. నేను వ్రాసిన ఉత్తరంలో ఆప్రచురణల ఒక్కోదాని ఉద్దేశాన్ని వివరించాను.

“ప్రచురణలపట్ల ఆయన ప్రతిస్పందన ఏమిటో తెలుసుకోవాలని నాకు ఆసక్తిగా ఉండడంతో, ఆయనను కలవడానికి అనుమతి కోరాను. కొన్ని వారాల తర్వాత నాకు అనుమతి లభించింది. నాతోపాటు యెహోవాసాక్షులు​—⁠ఆ పేరు వెనుకనున్న సంస్థ (ఆంగ్లం) వీడియో కాసెట్టును తీసుకుని వెళ్ళాను. మాసమావేశం దాదాపు 2 గంటలపాటు జరిగింది. గవర్నరుతో ఆవీడియో చూసిన తర్వాత, దాని గురించి ఆయన అభిప్రాయమేమిటని అడిగాను. ‘మీ సంస్థలాంటిది ఈ భూమ్మీద వేరే ఏదీ లేదు. నా ప్రభుత్వ కార్యాలన్నింటిలో సహాయం చేయడానికి మీలాంటి ప్రజలు నా దగ్గరుంటే బాగుండేదని నేను ఆశిస్తున్నాను!’ అని ఆయన జవాబిచ్చారు. తర్వాత, మీరెప్పుడైనా మీ సంస్థ ప్రపంచ ప్రధాన కార్యాలయాన్ని చూశారా అని ఆయన నన్నడిగారు. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో ఉన్న మన ప్రపంచ ప్రధాన కార్యాలయాన్ని చూడాలన్నది నా 14వ యేటనుండి ఉన్న లక్ష్యం, అయినా అది చూసే అవకాశం కలుగలేదని నేను చెప్పాను. అది కష్టసాధ్యమైన లక్ష్యాల్లో ఒకటి. ఆయన నా వైపు ఒక క్షణం చూశారు. తర్వాత ఆయన నాకు ఆఅవకాశాన్ని కలిగిస్తానని చెప్పారు. అందుకు చట్టపరమైన అన్ని పనులు సవ్యంగా జరిగేలా చూసి ఆయన మాకు విమాన టికెట్టులను బహుమతిగా ఇచ్చారు!

“గవర్నరు ఇప్పుడు కావలికోట, తేజరిల్లు! పత్రికలను క్రమంగా తెప్పించుకుంటున్నారు. త్వరలోనే ఆయనతో బైబిలు అధ్యయనం ప్రారంభించగలమని ఆశిస్తున్నాము.”