కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

73వ పాట

మాకు ధైర్యాన్నివ్వు

మాకు ధైర్యాన్నివ్వు

(అపొస్తలుల కార్యాలు 4:29)

  1. 1. రాజ్య సందేశాన్ని మేము

    ప్రకటించినప్పుడు,

    వ్యతిరేకులు ఉంటారు

    ఎగతాళి చేస్తారు.

    అయినా ఓ యెహోవా,

    నీకే మేం భయపడేలా

    దయచేయి మాకు నీ శక్తి;

    ప్రకటించేలా మానక.

    (పల్లవి)

    నీవే మాకు ధైర్యాన్నివ్వు;

    తీసివేయి భయాలు.

    లేదు ఇంక సమయము;

    రానైవుంది అంతము.

    ఈలోగా మేమందరికీ

    చెప్పేలా మంచివార్తను,

    నీవే మాకు ధైర్యాన్నివ్వు;

    ఓ మా దేవా.

  2. 2. ఒకవేళ భయపడితే,

    అర్థంచేసుకుంటావు.

    ఉంది మాకు నమ్మకము,

    చేస్తావని సహాయం.

    వాళ్ల బెదిరింపుల్ని

    గమనించి ఓ యెహోవా,

    నింపు మాలో నీవే ధైర్యాన్ని

    చాటించేలా నీ పేరును.

    (పల్లవి)

    నీవే మాకు ధైర్యాన్నివ్వు;

    తీసివేయి భయాలు.

    లేదు ఇంక సమయము;

    రానైవుంది అంతము.

    ఈలోగా మేమందరికీ

    చెప్పేలా మంచివార్తను,

    నీవే మాకు ధైర్యాన్నివ్వు;

    ఓ మా దేవా.

(1 థెస్స. 2:2; హెబ్రీ. 10:35 కూడా చూడండి.)