కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రవచనం 2. కరువులు

ప్రవచనం 2. కరువులు

ప్రవచనం 2. కరువులు

‘ఆహారకొరతలు వస్తాయి.’—మార్కు 13:8.

● ఒకతను కరువు తప్పించుకోవడానికి నైజర్‌ రాజధాని దగ్గర్లో ఉన్న ఒక ఊరుకు వచ్చేశాడు. ఆ తర్వాత అతని అన్నదమ్ముళ్లు, బంధువులు కూడా తినడానికి తిండిలేక అదే ఊరుకు వచ్చేశారు. కానీ అతను తన కుటుంబంతో కలిసి ఉండకుండా, ఒంటరిగా జీవిస్తూ చాప మీద పడుకుంటున్నాడు. దానికి కారణం వివరిస్తూ వాళ్ల ఊరిపెద్ద అయిన సిడి ఇలా అంటున్నాడు, “వాళ్లు ఆకలితో అలమటించడం ఎక్కడ చూడాల్సి వస్తుందో అనే భయంతో అతను వాళ్లకు దూరంగా ఉంటున్నాడు.”

కొన్ని వాస్తవాలు: ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏడుగురిలో ఒకరికి, ఒక్కరోజు కూడా కడుపునిండా ఆహారం దొరకట్లేదు. సబ్‌-సహారన్‌ ఆఫ్రికా ప్రాంతంలోనైతే పరిస్థతి ఇంకా దారుణంగా ఉంది. అక్కడ ప్రతీ ముగ్గురిలో ఒకరికి అసలు ఆహారమే దొరకట్లేదు. దీన్ని అర్థం చేసుకోవడానికి, ఒక కుటుంబంలో తల్లి, తండ్రి, బిడ్డ ఉన్నారని ఊహించుకుందాం. వాళ్లలో ఎవరో ఇద్దరు తినడానికి మాత్రమే ఆహారం ఉంది. ఆ తల్లి, తండ్రి ముందు తమ బిడ్డ కడుపు నింపి, మిగిలిన ఆహారాన్ని ఎవరు తినాలో, ఎవరు ఆకలితో పడుకోవాలో నిర్ణయించుకోవాల్సి వస్తుంది. ఎన్నో కుటుంబాల్లో ప్రతీరోజు ఇదే పరిస్థితి కనిపిస్తుంది.

కొంతమంది ఏమంటారు? భూమ్మీద అందరికీ సరిపడేంత ఆహారం ఉంది. ఆ ఆహారం ప్రతీఒక్కరికి అందేలా చూస్తే సమస్య తీరిపోతుంది.

అది నిజమేనా? ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు రైతులు ఎక్కువ ఆహారం పండించి, ప్రజలకు అందుబాటులో ఉంచగలరు. ప్రభుత్వాలు ఆ ఆహారం ప్రతీఒక్కరికి చేరేలా చూస్తే, ఎవ్వరూ ఆకలితో పడుకోవాల్సిన పరిస్థితి ఉండదు. కానీ ఎన్ని దశాబ్దాలు గడిచినా, ప్రభుత్వాలు మాత్రం ప్రజల ఆకలిబాధను తీర్చలేకపోతున్నాయి.

మీరేమంటారు? మార్కు 13:8⁠లోని మాటలు నిజమౌతున్నాయా? ఒకవైపు టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నా, మరోవైపు తినడానికి తిండిలేక ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారా?

అయితే ఈ భూకంపాలు, ఆహారకొరతలు మరో సమస్యకి దారితీస్తున్నాయి. మనం చివరి రోజుల్లో జీవిస్తున్నాం అనడానికి ఆ సమస్య కూడా ఒక రుజువే. అదేంటో చూద్దాం.

[5వ పేజీలోని బ్లర్బ్‌]

“నిమోనియా, డయేరియా ఇంకా ఇతర జబ్బులతో చాలామంది పిల్లలు చనిపోతున్నారు. ఒకవేళ సరైన పోషకారం లభించివుంటే వాళ్లందరూ ప్రాణాలతో ఉండేవాళ్లు.”—యాన్‌ యమ్‌. వెనిమాన్‌, యూ. ఎన్‌. చిల్డ్రన్స్‌ ఫండ్‌ మాజీ ఎక్జిక్యూటివ్‌ డైరెక్టర్‌.

[5వ పేజీలోని క్రెడిట్‌ లైను]

© Paul Lowe/​Panos Pictures