కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నిజంగా ముగ్గురు జ్ఞానులు చంటి బిడ్డయిన యేసును చూడడానికి వచ్చారా?

నిజంగా ముగ్గురు జ్ఞానులు చంటి బిడ్డయిన యేసును చూడడానికి వచ్చారా?

మా పాఠకుల ప్రశ్న

నిజంగా ముగ్గురు జ్ఞానులు చంటి బిడ్డయిన యేసును చూడడానికి వచ్చారా?

ముగ్గురు రాజులు లేదా జ్ఞానులు అప్పుడే పుట్టిన యేసు దగ్గరకు బహుమానాలతో వచ్చారని ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్‌ గురించిన కథలో చెప్పుకుంటారు. నిజంగా అలా జరిగిందా? వాస్తవాలు ఏమిటి? చూద్దాం.

యేసు పుట్టినప్పుడు ఏమి జరిగిందో మత్తయి, లూకా సువార్తలు వివరిస్తున్నాయి. ఆ పుస్తకాలు చెబుతున్న దాని ప్రకారం, దగ్గర్లోని పొలాల్లోవున్న సామాన్యులైన గొఱ్ఱెల కాపరులు మాత్రమే పొత్తిళ్లలోవున్న యేసును చూశారు. కథల్లో రాజులు లేదా జ్ఞానులు అని ప్రజలు చెప్పేవారు నిజానికి రాజులు కాదు గానీ జ్యోతిష్కులు. అంతేకాకుండా వారు ఎంతమంది అనేది కూడా బైబిలు చెప్పడం లేదు. ఆ జ్యోతిష్కులు పశువుల తొట్టిలోవున్న శిశువును కాదుగానీ ఇంట్లోవున్న బాలుడైన యేసును చూశారు. అంతేకాదు, వాళ్లు రావడంవల్ల యేసు ప్రాణానికే ముప్పు ఏర్పడింది!

బైబిల్లో యేసు పుట్టుక గురించి రాస్తూ లూకా ఏమని వివరించాడో జాగ్రత్తగా పరిశీలించండి: ‘ఆ దేశములో కొందరు గొఱ్ఱెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకుంటూ ఉండగా, యెహోవా దూత వారి వద్దకు వచ్చి, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒకతొట్టిలో పండుకుని ఉండడం మీరు చూస్తారని వారితో చెప్పాడు. అప్పుడు వారు త్వరగా వెళ్లి, మరియను యోసేపును తొట్టిలో పండుకొనివున్న శిశువును చూశారు.’—లూకా 2:8-16.

పొత్తిళ్లలోవున్న యేసు దగ్గర యోసేపు, మరియలతోపాటు గొఱ్ఱెల కాపరులు మాత్రమే ఉన్నారు. లూకా ఇంకెవ్వరూ ఉన్నట్లు రాయలేదు.

ఇప్పుడు మత్తయి 2:1-11 వచనాలను ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌ అనువాదంలో పరిశీలించండి: “హేరోదు రాజ్య పాలన చేస్తున్న కాలంలో యూదయ దేశంలోని, బేత్లెహేములో యేసు జన్మించాడు. తూర్పు దిశనుండి జ్ఞానులు యెరూషలేముకు వచ్చి . . . ఇంట్లోకి వెళ్లి ఆ పసివాడు తన తల్లి మరియతో ఉండటం చూసారు.”

ఇక్కడ కేవలం “జ్ఞానులు” అని మాత్రమే ఉంది కానీ, “ముగ్గురు జ్ఞానులు” అని చెప్పడం లేదని గమనించండి. అంతేకాదు, వారు ముందుగా తూర్పు దిశ నుండి బయలుదేరి, యెరూషలేముకు చేరుకున్నారుగానీ యేసు పుట్టిన బేత్లెహేము పట్టణానికి కాదు. వారు బేత్లెహేముకు చేరుకునేసరికి యేసు పశువుల తొట్టిలో పడుకోబెట్టిన శిశువుగా లేడు గానీ “పసివాడు” అని పిలవగలిగేంత పెద్దవాడయ్యాడు.

ఆ వచ్చిన వారిని పరిశుద్ధ గ్రంథము “జ్ఞానులు” అని అంటున్నా, ఇతర అనువాదాలు వారిని “జ్యోతిష్కులు” అని అంటున్నాయి. “జ్ఞానులు” అని అనువదించబడిన ఆంగ్ల పదం, “జ్యోతిశ్శాస్త్రంలో ప్రవీణులైన పర్షియా పూజారుల గురించి చెప్పడానికి ఉపయోగించే గ్రీకు నామవాచకం” నుండి వచ్చిందని ఎ హ్యాండ్‌బుక్‌ ఆన్‌ ద గాస్పెల్‌ ఆఫ్‌ మాథ్యూ అనే పుస్తకం తెలియజేస్తుంది. ద ఎక్స్‌పాండెడ్‌ వైన్స్‌ ఎక్స్‌పోజిటరీ డిక్షనరీ ఆఫ్‌ న్యూ టెస్ట్‌మెంట్‌ వర్డ్‌స్‌ ఆ పదాన్ని “మాంత్రికుడు, ఇంద్రజాలికుడు, మంత్ర శక్తులున్నాయని చెప్పుకునేవాడు, తాంత్రిక విద్యలో ప్రవీణుడు” అని వర్ణిస్తుంది.

ఈ రోజుల్లో కూడా జ్యోతిశ్శాస్త్రం, తాంత్రిక విద్య ఎంతో ప్రజాదరణ పొందుతున్నా, వాటి జోలికి వెళ్లవద్దని బైబిలు హెచ్చరిస్తోంది. (యెషయా 47:13-15) అవి దయ్యాలకు సంబంధించిన విద్యలు, అలాంటి వాటిని యెహోవా దేవుడు అసహ్యించుకుంటాడు. (ద్వితీయోపదేశకాండము 18:10-12) అందువల్ల, దేవదూతలెవ్వరూ యేసు పుట్టుక గురించి జ్యోతిష్కులకు చెప్పలేదు. అయితే, చెడ్డ రాజైన హేరోదు యేసును చంపాలనుకున్నాడు కాబట్టి, ఆయన దగ్గరకు తిరిగి వెళ్లొద్దని దేవుడు కలలో వారిని హెచ్చరించాడు. కాబట్టి ‘వాళ్లు మరో మార్గాన తమ దేశానికి తిరిగి వెళ్లిపోయారు.’—మత్తయి 2:11-16.

నిజమైన క్రైస్తవులు యేసు పుట్టుక గురించిన వాస్తవాల్ని పక్కదారి పట్టించే ఇలాంటి కథలను వేరే వాళ్లకు చెప్పాలనుకుంటారా? ఎంతమాత్రం అనుకోరు. (w09-E 12/01)