కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనుష్యుల ఆత్మగౌరవం తరచూ ఉల్లంఘించబడుతోంది

మనుష్యుల ఆత్మగౌరవం తరచూ ఉల్లంఘించబడుతోంది

మనుష్యుల ఆత్మగౌరవం తరచూ ఉల్లంఘించబడుతోంది

“శిబిరంలోని జీవితమంతా మరింత అవమానకరమైనదిగా, అమర్యాదకరమైనదిగా ఉండేది.” ​—⁠మాగ్దాలానా కుస్సరో రాయటర్‌, నాజీ సామూహిక శిబిరంలో బ్రతికి బయటపడ్డ మహిళ.

శిబిరంలోని జీవితం ఎంతో దారుణంగా ఉండేది, రెండవ ప్రపంచ యుద్ధకాలంలో నాజీ సామూహిక శిబిరాల్లో జరిగిన దారుణకృత్యాలు మనుష్యుల ఆత్మగౌరవం మీద జరిగిన మొదటి దాడికాదు, అలాగని అది చివరిదీకాదు. మనం గతాన్ని పరిశీలించినా లేక వర్తమానాన్ని పరిశీలించినా ఫలితం స్పష్టంగా ఉంది: ఎంతోకాలంగా అనేకమంది ‘అవమానాన్ని, అమర్యాదను’ ఎదుర్కొంటున్నారు.

అయితే, మనుష్యుల ఆత్మగౌరవాన్ని అవమానపరిచే అంశాలు, మానవ చరిత్రను మలినం చేసిన అనాగరిక క్రియలకే పరిమితం కాలేదు. కనబడని అనేక రీతుల్లో మనుష్యుల ఆత్మగౌరవం తరచూ ఉల్లంఘించబడుతోంది. ఏదో ఒక శారీరక లక్షణాన్నిబట్టి హేళనచేయబడే పిల్లవాడి గురించి లేదా కొన్ని “విదేశీ” ఆచారాలనుబట్టి హేళనచేయబడే ప్రవాసి గురించి లేదా తన శరీర ఛాయనుబట్టి లేక జాతీయతనుబట్టి వివక్షకు గురయ్యే ఒక వ్యక్తి గురించి ఆలోచించండి. ఇతరుల ఆత్మగౌరవాన్ని ఉల్లంఘించేవారు ఆ విషయాన్ని నవ్వులాటగా దృష్టించవచ్చు, అయితే అలా చులకన చేయబడుతున్నవారు అనుభవించే బాధ, అవమానం మాత్రం నవ్వులాటకాదు.​—⁠సామెతలు 26:​18, 19.

మనుష్యుల ఆత్మగౌరవం అంటే ఏమిటి?

గౌరవమనేది ‘అమూల్యంగా ఎంచబడడానికి, సన్మానించబడడానికి, అభిమానించబడడానికి’ సంబంధించిన ఒక ‘గుణం లేక స్థితి’ అని ఒక నిఘంటువు నిర్వచిస్తోంది. కాబట్టి, మనుష్యులను గౌరవించడంలో, మనల్ని మనం దృష్టించుకునే విధమే కాక, ఇతరులు మనతో వ్యవహరించే విధం కూడా ఇమిడివుంది. మనపట్ల మనకున్న అభిప్రాయాలను అనేక విషయాలు ప్రభావితం చేసినా, ఇతరులు మనల్ని దృష్టించే విధం లేక మనతో వ్యవహరించే విధం ప్రతిదిన జీవితంలోని మన వ్యక్తిగత విలువమీద అధిక ప్రభావం చూపిస్తాయి.

ప్రతీ సమాజంలో బీదవారు, నిస్సహాయులు, బలహీనులు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నంత మాత్రాన ఒక వ్యక్తి ఆత్మగౌరవం తగ్గిపోదు. ఇతరుల వైఖరి, ప్రతిస్పందన ఒక వ్యక్తి ఆత్మగౌరవాన్ని ప్రమాదంలో పడేయగలదు. విచారకరమైన వాస్తవమేమిటంటే, మనుష్యులుగా తమకు న్యాయంగా దక్కాల్సిన గౌరవం దక్కకుండా ఉపేక్షించబడినవారే లేక అణచివేయబడినవారే సాధారణంగా దుర్భర పరిస్థితులను అనుభవిస్తున్నారు. వయసు పైబడినవారితో, బీదవారితో, మానసిక లేక భౌతిక అంగవైకల్యాలు ఉన్నవారితో దురుసుగా ప్రవర్తిస్తున్నప్పుడు “పనికిరానివారు,” “నిష్ప్రయోజకులు,” “మూర్ఖులు” వంటి మాటలు కొందరు పలకడం మనం ఎంత ఎక్కువగా వింటుంటామో కదా!

ప్రజలు ఒకరినొకరు ఎందుకు అవమానపరచుకుంటారు? ప్రజలకు ఆత్మగౌరవం అనే ప్రాథమిక హక్కు ఎప్పటికైనా లభిస్తుందా? తర్వాతి ఆర్టికల్‌, ఆ ప్రశ్నలకు దేవుని వాక్యమైన బైబిలు నుండి సంతృప్తికరమైన జవాబులు ఇస్తుంది.