కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“మీరు కూడా అలా చేస్తే చాలా బాగుంటుంది”

“మీరు కూడా అలా చేస్తే చాలా బాగుంటుంది”

“మీరు కూడా అలా చేస్తే చాలా బాగుంటుంది”

ఐదేళ్ల అలెక్సెస్‌ మెక్సికోలోని మొరాలియో నగరంలో నివసిస్తున్నాడు, ఆ పిల్లవాడి తల్లిదండ్రులు యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేస్తూ కూటాలకు హాజరవుతున్నారు. తన కుటుంబంతోపాటు ప్రాంతీయ సమావేశానికి హాజరైనప్పుడు, అక్కడ ఆ పిల్లవాడు ఇంటింటా ప్రకటించడానికి సంబంధించిన ప్రదర్శన ఒకటి చూశాడు. ఆ వెంటనే తన తండ్రివైపు తిరిగి “డాడీ, డాడీ మీరు కూడా అలా వెళ్ళి ప్రకటించవచ్చు కదా?” అని అడిగాడు. అందుకు వాళ్ల నాన్న “అలా ప్రకటించడానికే నేనింకా అధ్యయనం చేస్తున్నాను బాబు” అని జవాబిచ్చాడు. అప్పుడు అలెక్సెస్‌ ఉత్సాహంగా “డాడీ, మీరు కూడా అలా చేస్తే చాలా బాగుంటుంది” అన్నాడు.

ఈ పిల్లవాడు, యెహోవా గురించిన తన పరిజ్ఞానానికి అనుగుణంగా ప్రవర్తించవలసిన అవసరతను గుర్తించాడు. తనతోపాటు అదే ఇంట్లో ఉంటున్న తన చిన్నమ్మ పిల్లలకు, మొదట యెహోవాకు ప్రార్థించి ఆ తర్వాత వారికి తన తల్లిదండ్రుల సహాయంతో నా బైబిలు కథల పుస్తకము నుండి తాను నేర్చుకున్నవి చెప్పాడు. అలెక్సెస్‌కు చదవడం ఇంకా రాకపోయినా, ఆ పుస్తకంలో కథలను వివరించే చిత్రాలను బట్టి వాడికి అందులోని విషయాలు బాగా తెలుసు. దేవుని సంకల్పాలను గురించి తాను నేర్చుకున్నవి చెప్పడానికి ప్రజలను ఇళ్ల దగ్గర సందర్శించాలని తాను కోరుకుంటున్నట్లు కూడా చెప్పాడు.

అవును, పిల్లలు పెద్దలు కూడా ‘పరిశుద్ధుడైన’ యెహోవా వారినుండి అపేక్షించే దానికి అనుగుణంగా తమ జీవితాలను మలుచుకోవచ్చు. ఆ విధంగా వారాయనను గురించి సాక్ష్యమిచ్చే అత్యున్నత ఆధిక్యత కలిగివుండవచ్చు. (యెషయా 43:3; మత్తయి 21:​16) నిస్సందేహంగా, అది ఒక వ్యక్తి చేయగల అతి శ్రేష్ఠమైన పని.