కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఒక ప్రత్యేక ప్రకటన

ఒక ప్రత్యేక ప్రకటన

ఒక ప్రత్యేక ప్రకటన

వాచ్‌ టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా యొక్క వార్షిక కూటమి 2000, అక్టోబరు 7న జరిగింది. కూటం చివరిలో పరిపాలక సభ సభ్యుడూ అక్కడ చైర్మన్‌గా కూడా ఉన్న జాన్‌ ఇ. బార్‌ ఒక ప్రత్యేక ప్రకటనను చేశారు. ఈ ప్రకటన అంతకు ముందు థియోడోర్‌ జారజ్‌, డేనియల్‌ సిడ్లిక్‌ ఇచ్చిన ప్రసంగాల పరంపరకు కొనసాగింపుగా ఉంది.​—⁠ఈ పత్రికలోని 12-16, అలాగే 28-31 పేజీలను చూడండి.

ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెబుతూ సహోదరుడు బార్‌ ఇలా అన్నారు: “‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునికీ’ దాని పరిపాలక సభకూ ఇవ్వబడిన రాజ్యాసక్తులు, ఏ చట్టబద్ధమైన కార్పొరేషన్‌లకు ఇవ్వబడిన వాటికన్నా ఎంతో ఉన్నతమైనవిగా, ఎంతో విస్తారమైనవిగా ఉన్నాయి. అలాంటి చట్టబద్ధమైన సొసైటీల నిబంధనావళిలోని సంకల్పాలకు చాలా పరిమితమైన పరిధులు ఉన్నాయి. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు తన ‘యావదాస్తిమీద’ అంటే భూమ్మీది రాజ్యాసక్తులన్నింటి మీద నమ్మకమైన దాసుణ్ణి నియమించాడు.”​—⁠మత్తయి 24:​45-47.

పెన్సిల్వేనియా కార్పొరేషన్‌ గురించి మాట్లాడుతూ సహోదరుడు బార్‌ ఇలా అన్నారు: “వాచ్‌ టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా 1884 లో నెలకొల్పబడినప్పటినుండి అది మన ఆధునికదిన చరిత్రలో ఎంతో ప్రముఖమైన పాత్రను పోషించింది. అయినా అది ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ అవసరమైనప్పుడు ఉపయోగించుకోవడం కోసం అందుబాటులో ఉన్న ఒక చట్టబద్ధమైన ఉపకరణం మాత్రమే.”

ప్రభువు యొక్క భూసంబంధ ఆస్తినంతటినీ ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునికి’ అప్పగించడం జరిగిందంటే దానర్థం, రొటీన్‌గా నిర్వర్తించాల్సిన కొన్ని కార్యనిర్వహణా బాధ్యతల్ని చేపట్టడానికి “వేరే గొఱ్ఱెల”లోని అర్హతగల పురుషులను అనుమతించకూడదని కాదు అని సహోదరులు సిడ్లిక్‌, జారజ్‌లు తమ ప్రసంగాల్లో వివరించారు. (యోహాను 10:​16) అంతేగాక, యెహోవాసాక్షులు ఉపయోగించే చట్టబద్ధమైన సొసైటీల డైరెక్టర్‌లలో కొందరు గానీ అందరూ గానీ అభిషిక్త క్రైస్తవులే అయ్యుండాలనడానికి ఏ లేఖనాధార కారణం కూడా లేదని వారు వివరించారు.

బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌గాను ఆఫీసర్లుగాను సేవ చేస్తున్న యెహోవాసాక్షుల పరిపాలక సభలోని కొందరు సభ్యులు ఇటీవల, అమెరికాలో ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ ఉపయోగించుకునే కార్పొరేషన్‌లన్నింటిలో నుండి స్వచ్ఛందంగా తప్పుకున్నారని సహోదరుడు బార్‌ ప్రేక్షకులకు చెప్పారు. వేరే గొఱ్ఱెలలోని బాధ్యతగల సహోదరులు వారి స్థానాల్లో ఎంపికచేయబడ్డారు.

ఈ నిర్ణయం తప్పకుండా ప్రయోజనకరమైనదే. ఇది, పరిపాలక సభ సభ్యులు ఆధ్యాత్మిక ఆహారాన్ని సిద్ధం చేయడంలోను, ప్రపంచవ్యాప్త సహోదరత్వానికి ఎదురయ్యే ఆధ్యాత్మిక అవసరాల్ని తీర్చడంలోను మరింత సమయం గడపడానికి అనుమతిస్తుంది.

ఆశ్చర్యానందాలకు లోనైన ప్రేక్షకులకు ముగింపులో ఛైర్మన్‌ ఇలా చెప్పారు: “వేర్వేరు చట్టబద్ధమైన కార్యనిర్వహణ సంబంధమైన విధులు అనుభవజ్ఞులైన పైవిచారణకర్తలకు అప్పగించబడినప్పటికీ, . . . వాళ్ళందరూ పరిపాలక సభ యొక్క ఆధ్యాత్మిక నిర్దేశం క్రింద పనిచేస్తారు. . . . యెహోవా గొప్ప నామానికి ఘనత, మహిమ లభించేటట్లుగా ఆయన చిత్తాన్ని చేయడానికి మనమందరం ఐక్యతతో చేసే ప్రయత్నాలపై ఆయన ఆశీస్సులుండాలని మనం ఆయనవైపు చూద్దాము.”