కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన క్రైస్తవ జీవితం

పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం​—⁠చక్కగా ఉత్తరాలు రాయడం

పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం​—⁠చక్కగా ఉత్తరాలు రాయడం

ఎందుకు ప్రాముఖ్యం? అపొస్తలుడైన పౌలు తోటి క్రైస్తవుల్ని ప్రోత్సహిస్తూ రాసిన 14 ఉత్తరాల్లో కొరింథీయులకు రాసిన మొదటి ఉత్తరం ఒకటి. ఉత్తరం రాసేవాళ్లకు పదాల్ని జాగ్రత్తగా ఎంచుకునే అవకాశం, దాన్ని అందుకునే వాళ్లకు మళ్లీమళ్లీ చదువుకునే అవకాశం ఉంటుంది. బంధువులకు, తెలిసినవాళ్లకు సాక్ష్యమివ్వడానికి ఉత్తరాలు రాయడం ఒక మంచి మార్గం. మనం నేరుగా కలవలేకపోయిన వాళ్లకు సాక్ష్యమివ్వడానికి కూడా ఉత్తరాలు బాగా పనికొస్తాయి. ఉదాహరణకు కొంతమంది ఆసక్తి చూపించినా, వాళ్లు ఇంట్లో లేకపోవడంవల్ల వాళ్లను తిరిగి కలవడం కుదరకపోవచ్చు. మన టెరిటరీలోని కొంతమంది సెక్యూరిటీ ఎక్కువగా ఉన్న అపార్ట్‌మెంట్లలో, గేటెడ్‌ కమ్యూనిటీల్లో, లేదా చేరుకోవడం కష్టంగా ఉన్న ప్రాంతాల్లో నివసిస్తుండడం వల్ల వాళ్లను కలవడం కష్టంగా ఉండవచ్చు. ఉత్తరాలు రాసేటప్పుడు, ముఖ్యంగా తెలియనివాళ్లకు రాసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు ఏమిటి?

ఎలా చేయాలి?

  • మీరు నేరుగా కలిస్తే ఏం మాట్లాడేవాళ్లో అదే రాయండి. ఉత్తరం మొదట్లోనే మీ వివరాలు తెలియజేసి, ఉత్తరం ఎందుకు రాస్తున్నారో స్పష్టంగా చెప్పండి. వాళ్లను ఆలోచింపజేసేలా ఒక ప్రశ్న వేసి, మన వెబ్‌సైట్‌ చూడమని చెప్పండి. తర్వాత, ఆన్‌లైన్‌ బైబిల్‌ స్టడీ లెసన్స్‌ గురించి, బైబిలు స్టడీ ఏర్పాటు గురించి చెప్పండి, లేదా బైబిలు స్టడీ చేసే ఏదైనా పుస్తకంలో నుండి కొన్ని అధ్యాయాల పేర్లు ప్రస్తావించండి. కాంటాక్ట్‌ కార్డు, కూటాల ఆహ్వానపత్రం, కరపత్రం లాంటిది ఏదైనా జతచేయవచ్చు.

  • క్లుప్తంగా రాయండి. చదివే వ్యక్తికి విసుగొచ్చేలా పెద్ద ఉత్తరం రాయకండి.—8వ పేజీలో ఉన్న “ఉత్తరం ఇలా రాయవచ్చు” చూడండి

  • ఉత్తరం పూర్తయ్యాక, అందులో తప్పులు ఏమైనా ఉన్నాయా, చదవడానికి వీలుగా ఉందా అని తెలుసుకోవడానికి ఒకసారి దాన్ని చదవండి. అది స్నేహపూర్వకంగా, సానుకూలంగా, నొప్పించకుండా ఉండేలా చూసుకోండి. సరిపడా స్టాంపులు అంటించండి