కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అంగవైకల్యం ఉన్నా పని చేసేందుకు ఉత్సాహం చూపించడం

అంగవైకల్యం ఉన్నా పని చేసేందుకు ఉత్సాహం చూపించడం

అంగవైకల్యం ఉన్నా పని చేసేందుకు ఉత్సాహం చూపించడం

మీరు లియోనార్డోని మొదటిసారి చూస్తే, ఆయన నిర్మాణపనిలో భాగం వహించగలడని మీకు అనిపించదు. ఆయన, ఉద్యోగస్థలంలో జరిగిన ఒక ప్రమాదంలో రెండు చేతులూ కోల్పోయాడు. అలాంటి అంగవైకల్యం ఉన్నప్పటికీ, ఈ చిత్రంలో మీరు చూస్తున్నట్లుగా లియోనార్డో ఎల్‌ సాల్వెడార్‌లోని అకాహుట్లా అనే ప్రాంతంలో, నిర్మాణస్థలం వద్ద కష్టించి పనిచేస్తున్నాడు.

నిర్మాణపనిలో పాల్గొనడానికి ఆయన సొంతగా పనిముట్లను తయారుచేసుకున్నాడు. పారవంటి సాధనం (షవల్‌) పిడికి అమర్చిన రింగులోనికి తన ముంజేతిని చొప్పించి నేర్పుగా మట్టిని తోపుడు బండిలోకి ఎత్తుతాడు. ఆ బండిని తానే ముందుకు తోసుకెళ్లేందుకు ఆయన రెండు పిడుల (హ్యాండిల్స్‌)కు రింగులను అమర్చాడు. ఆ నిర్మాణపనుల్లో భాగం వహించడానికి ఆయనను పురికొల్పిందేమిటి?

లియోనార్డో ఒక రాజ్యమందిరాన్ని లేదా యెహోవాసాక్షుల స్థానిక సంఘం కోసం ఆరాధనా మందిరాన్ని నిర్మించడంలో భాగం వహించాలని కోరుకున్నాడు. ఆ నిర్మాణపనిలో భాగం వహించకుండా ఉండడానికి ఎన్నో సాకులు చెప్పవచ్చు. ఆయనకు పూర్తికాల ఉద్యోగం ఉంది, అంగవైకల్యం ఉంది, ఆయన సంఘంలో పరిచర్య సేవకుడు. అయినప్పటికీ తనకు సాధ్యమైనంతమేరకు నిర్మాణపనిలో భాగం వహించడం ద్వారా దేవుని సేవచేయాలని ఆయన కోరుకున్నాడు.

దేవుని సేవచేసే విషయంలో మీకు కూడా అలాంటి స్ఫూర్తే ఉందా? లియోనార్డో తన వైకల్యాన్ని సాకుగా ఉపయోగించే బదులు, తనకు అసాధ్యమయ్యే పనులు చేయడానికి తన ఆలోచనా సామర్థ్యాన్ని ఉపయోగించి తనకు అనువైన ఉపకరణాలను తయారుచేసుకున్నాడు. ‘తన పూర్ణమనసుతో’ ఆయన దేవుణ్ణి సేవిస్తున్నాడు. (మత్తయి 22:37) అంగవైకల్యం ఉన్నా లేకపోయినా, ప్రపంచవ్యాప్తంగా నిర్మాణపనిలో భాగం వహించే యెహోవాసాక్షులు స్వచ్ఛంద స్ఫూర్తిని కనబరుస్తారు. వారి కూటాలకు ప్రజలందరూ రావచ్చు, మీరు కూడా ఆహ్వానితులే.