న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ పట్ల ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కృతజ్ఞతాభావంతో ఉన్నారు

న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ పట్ల ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కృతజ్ఞతాభావంతో ఉన్నారు

సంపూర్ణాత్మ నిశ్చయతగలవారై నిలకడగా ఉండం డి

న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ పట్ల ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కృతజ్ఞతాభావంతో ఉన్నారు

దాన్ని పూర్తిచేయడానికి 12 సంవత్సరాల, 3 నెలల, 11 రోజుల తీవ్రమైన కృషి అవసరమైంది. చివరికి, 1960 మార్చి 13న ఈక్రొత్త బైబిలు అనువాదపు చివరి భాగం పూర్తయ్యింది. ఈఅనువాదాన్ని న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫ్‌ ద హోలీ స్క్రిప్చర్స్‌ (పరిశుద్ధ లేఖనముల నూతన లోక అనువాదము) అని పిలిచారు.

ఒక సంవత్సరం తర్వాత, యెహోవాసాక్షులు ఈఅనువాదాన్ని ఒకే సంపుటిలో ప్రచురించారు. 1961 లోని ముద్రణలో పది లక్షల కాపీలను ముద్రించారు. నేడు, ముద్రిత ప్రతుల సంఖ్య పది కోట్లను దాటి పోయింది. ఆవిధంగా, న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా పంపిణీ చేయబడుతున్న బైబిలు అనువాదాల్లో ఒకటయ్యింది. అయితే, ఈఅనువాదాన్ని తయారుచేయడానికి సాక్షులను ప్రేరేపించినది ఏమిటి?

మళ్ళీ ఒక క్రొత్త బైబిలు అనువాదమెందుకు?

పరిశుద్ధ లేఖనాల సందేశాన్ని అర్థం చేసుకుని, ప్రకటించడానికి, యెహోవాసాక్షులు అనేక సంవత్సరాలపాటుగా అనేక ఆంగ్ల బైబిలు అనువాదాలను ఉపయోగించారు. ఆయాఅనువాదాలకు వాటి విశిష్టత వాటికున్నప్పటికీ, తరచూ వాటిలో మతసంబంధ పారంపర్యాచారాల, క్రైస్తవమత సామ్రాజ్యపు నమ్మకాల ప్రభావం కనిపిస్తుంది. (మత్తయి 15:⁠6) అందుకే, ప్రేరేపిత మూల పాఠంలో ఉన్నవాటిని నమ్మకంగా యథాతథంగా తెలిపే బైబిలు అనువాదం అవసరమని యెహోవాసాక్షులు గ్రహించారు.

ఈ అవసరాన్ని తీర్చడానికి, 1946 అక్టోబరులో యెహోవాసాక్షుల పరిపాలక సభ సభ్యుడైన సహోదరుడు నేథన్‌ హెచ్‌. నార్‌ క్రొత్త బైబిలు అనువాదాన్ని తయారు చేయడం గురించి ప్రతిపాదించినప్పుడు కావలసిన చర్య తీసుకోబడింది. క్రొత్తగా లభ్యమైన బైబిలు వ్రాతప్రతుల నుండి ఆమధ్యే పండితులు కనుగొన్న విషయాలను చేర్చుతూ, ఆధునిక పాఠకులకు సులభంగా అర్థమయ్యే భాషను ఉపయోగిస్తూ మూలపాఠాన్ని నమ్మకంగా తెలిపే అనువాదాన్ని తయారు చేసే పనిని 1947 డిసెంబరు 2న, న్యూ వరల్డ్‌ బైబిల్‌ ట్రాన్స్‌లేషన్‌ కమిటీ మొదలుపెట్టింది.

మొదటి సంపుటియైన న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫ్‌ ద క్రిస్టియన్‌ గ్రీక్‌ స్క్రిప్చర్స్‌ 1950 లో ప్రచురించబడినప్పుడు, అనువాదకులు తమ లక్ష్యాలను చేరుకున్నారని రుజువైంది. ఒకప్పుడు అర్థమయ్యీ అవ్వనట్లు అనిపించిన బైబిలు వచనాలు ఇప్పుడు స్పష్టంగా అర్థవంతంగా ఉన్నాయి. ఉదాహరణకు, “దైవభక్తిని గూర్చిన మర్మము” అనే తెలుగు అనువాదాన్ని పరిశీలించండి. అది న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌లో “దైవభక్తిని గురించిన పవిత్ర రహస్యం” అని అనువదించబడింది. (1 తిమోతి 3:​16) “దేన్ని గురించీ పట్టించుకోకండి” (కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌) అన్న అపొస్తలుడైన పౌలు ఉద్బోధ, “దేని గురించీ వ్యాకులపడకండి” అని అనువదించబడింది. (ఫిలిప్పీయులు 4:⁠6) “శరీర కామవికారము” (డూయే వర్షన్‌) అని అనువదించబడిన అపొస్తలుడైన యోహాను ప్రస్తావన “శరీరాశ”గా అనువదించబడింది. (1 యోహాను 2:​16) న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ క్రొత్త అవగాహనా లోకాన్ని చూపించిందని స్పష్టం.

చాలా మంది పండితులు ఈఅనువాదానికి ముగ్ధులయ్యారు. ఉదాహరణకు, గ్రీకు భాషలోని వర్తమాన కాలాన్ని ఖచ్చితంగా అనువదించడంలో న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌దే పైచేయి అని బ్రిటీష్‌ బైబిలు పండితుడైన అలెగ్జాండర్‌ థామ్సన్‌ అన్నాడు. ఉదాహరణకు, “పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి” అనే బదులు, “భర్తలారా మీభార్యలను ప్రేమిస్తూ ఉండండి” అని అనువదించబడింది. (ఎఫెసీయులు 5:⁠25) “వేరే ఏ అనువాదంలోనూ, గ్రీకు భాషలోని వర్తమాన కాలాన్ని ఇంత సంపూర్ణంగా, ఇంత తరచుగా, ఇంత విశిష్టంగా అనువదించలేదు” అని న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ గురించి థామ్సన్‌ అన్నాడు.

న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ యొక్క మరొక విశిష్టత ఏమిటంటే, అది దేవుని వ్యక్తిగత నామమైన యెహోవాను హీబ్రూ లేఖనాల్లోను, గ్రీకు లేఖనాల్లోను ఉపయోగించింది. దేవుని హీబ్రూ నామము, పాత నిబంధన అని పిలువబడుతున్న భాగంలో దాదాపు 7,000 సార్లు కనిపిస్తుంది కనుక, తన ఆరాధకులు తన నామాన్ని ఉపయోగించాలని, తనను ఒక వ్యక్తిగా తెలుసుకోవాలని మన సృష్టికర్త కోరుకుంటున్నాడని స్పష్టమవుతుంది. (నిర్గమకాండము 34:​6,7) కోట్ల మంది ప్రజలు అలా చేసేందుకు న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ సహాయపడింది.

న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ వివిధ భాషల్లోకి అనువదించబడుతోంది

న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆంగ్లంలో విడుదలైనప్పటి నుండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులు తమ మాతృ భాషలో దాన్ని పొందాలని ఎదురుచూశారు. దానికి మంచి కారణమే ఉంది. కొన్ని దేశాల్లో, స్థానిక భాషల్లోని బైబిళ్ళు దొరకడం చాలా కష్టంగా ఉండేది, ఎందుకంటే, వాటిని పంపిణీ చేసే బైబిలు సొసైటీల ప్రతినిధులకు తమ బైబిళ్ళు యెహోవాసాక్షుల చేతిలో కనిపించడం నచ్చలేదు. అంతేకాక, ఆప్రాంతీయ భాషలోని బైబిళ్ళు తరచూ ప్రాముఖ్యమైన బోధలను మరుగుపరచాయి. దానికి ఉదాహరణ, దక్షిణ యూరోపియన్‌ భాషలోని అనువాదము. “నీ నామము పరిశుద్ధపరచబడుగాక” అని అంటూ దేవుని నామాన్ని గురించి యేసు ప్రస్తావించిన ప్రాముఖ్యమైన మాటలను “నీవు ప్రజల చేత ఘనపరచబడుదువుగాక” అని అది అనువదించింది.​—⁠మత్తయి 6:⁠9.

1961కల్లా, అనువాదకులు న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆంగ్ల పాఠాంతరాన్ని ఇతర భాషల్లోకి అనువదించడం మొదలుపెట్టారు. ఆతర్వాత రెండు సంవత్సరాల్లో న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫ్‌ ద క్రిస్టియన్‌ గ్రీక్‌ స్క్రిప్చర్స్‌ మరో ఆరు భాషల్లోకి అనువదించబడింది. అప్పటికి, ప్రపంచవ్యాప్తంగావున్న సాక్షుల్లో ప్రతి నలుగురిలో ముగ్గురు ఈబైబిలును తమ సొంత భాషల్లో చదువుకోగలిగారు. అయితే, యెహోవాసాక్షులు ఇంకా కోట్లకొలది ప్రజల చేతుల్లోకి ఈబైబిలు ప్రతిని అందించాలంటే ఇంకా చాలా పని జరగాలి.

1989 లో యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయంలో, ట్రాన్స్‌లేషన్‌ సర్వీసెస్‌ అనే డిపార్ట్‌మెంట్‌ను స్థాపించడంతో ఆలక్ష్యసాధన మరింత సులభంగా సాధ్యమవుతోంది. ఆడిపార్ట్‌మెంట్‌, కంప్యూటర్‌ టెక్నాలజీ సహాయంతో బైబిలు మాటల అధ్యయనం చేసి అనువదించే పద్ధతిని రూపొందించింది. ఈపద్ధతి, క్రైస్తవ గ్రీకు లేఖనాలను ఇతర భాషల్లోకి ఒక సంవత్సరంలోను, హీబ్రూ లేఖనాలను రెండు సంవత్సరాల్లోను అనువదించగలిగేందుకు సహాయం చేసింది. మామూలుగా అయితే బైబిలు అనువాదానికి పట్టే సమయంతో పోల్చితే, ఇది చాలా తక్కువ సమయం. ఈపద్ధతిని ప్రారంభించింది మొదలుకొని, న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆంగ్లం నుండి 29 ఇతర భాషల్లోకి అనువదించబడింది, అలా అది 200 కోట్ల మంది మాట్లాడే భాషల్లోకి విడుదల చేయబడింది. మరో పన్నెండు భాషల్లోకి ఇప్పుడు అనువదించబడుతోంది. ఇప్పటికి, న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ మొత్తంగాగానీ, భాగికంగా గానీ 41 భాషల్లో అనువదించబడింది.

న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ యొక్క మొదటి భాగం, 1950, ఆగస్టు 3న, న్యూయార్క్‌ నగరంలో జరిగిన యెహోవాసాక్షుల దైవపరిపాలనా అభివృద్ధి సమావేశంలో విడుదల చేయబడింది. ఇప్పటికి 50 కన్నా ఎక్కువ సంవత్సరాలు గడిచాయి. నేథన్‌ హెచ్‌. నార్‌ సమావేశానికి హాజరైనవారితో, అది విడుదలైన సందర్భంలో, “ఈ అనువాదాన్ని తీసుకోండి. దాన్ని చదవండి, చాలా ఆనందంగా చదవవచ్చు. దాన్ని అధ్యయనం చేయండి, మీరు దేవుని వాక్యాన్ని ఇంకా మెరుగ్గా అర్థం చేసుకునేందుకు అది మీకు సహాయం చేస్తుంది. దాన్ని ఇతరులకు కూడా అందజేయండి” అని ఉద్బోధించారు. మీరు బైబిలును ప్రతిరోజు చదవాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. ఎందుకంటే, అందులో ఉన్న సందేశం, “దేవుని చిత్తమునుగూర్చి సంపూర్ణాత్మ నిశ్చయతగలవారునై నిలుకడగా ఉండ”డానికి మీకు సహాయపడుతుంది.​—⁠కొలొస్సయులు 4:⁠12.

[8, 9వ పేజీలోని గ్రాఫు/చిత్రాలు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

“న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ విడుదలలు”

న్యూ వరల్డ్‌ ట్రాన్స్‌లేషన్‌ మొదట ఆంగ్లంలో విడుదలైంది, ఇప్పుడు, మొత్తంగానే కానివ్వండి, భాగికంగానే కానివ్వండి 41 భాషల్లో లభ్యమవుతోంది

క్రైస్తవ గ్రీకు లేఖనాలు పూర్తి బైబిలు

1950 1

1960-​69 6 5

1970-​79 4 2

1980-​89 2 2

1990-నుండి ఇప్పటి వరకు 29 19