కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ద్వేషానికి బలైనవాళ్లు ప్రతీచోట ఉన్నారు

ద్వేషానికి బలైనవాళ్లు ప్రతీచోట ఉన్నారు

ద్వేషం గాలిలా ప్రపంచమంతా వ్యాపించివుంది కాబట్టి, దీనివల్ల ప్రతీ మనిషి ఇబ్బందిపడుతున్నాడు.

మాటల రూపంలో, రాతల రూపంలో, దాడుల రూపంలో ప్రజలు చూపిస్తున్న ద్వేషం గురించి న్యూస్‌ ఛానళ్లు, సోషల్‌ మీడియా కోడై కూస్తున్నాయి. దేశం, జాతి, రంగు బట్టి వివక్షకు, ఎగతాళికి గురవ్వడం, అవమానాల పాలవ్వడం, బెదిరింపులు రావడం, దాడులు జరగడం లాంటి సంఘటనలకైతే కొదువే లేదు. సాటిమనిషే మనల్ని మనిషిగా చూడనప్పుడు, ద్వేషించినప్పుడు కలిగే బాధ అంతాఇంతా కాదు. అలాంటి గుండెకోత అనుభవిస్తున్న వాళ్లు ప్రపంచంలో ప్రతీచోట ఉన్నారు.

అయితే, ద్వేషమనే విషచక్రం నుండి ఎలా బయటపడాలో ఈ పత్రిక వివరిస్తుంది. మనసులోని ద్వేషాన్ని పూర్తిగా తీసేసుకోవడం అసాధ్యం అనుకుంటున్నారా? అది సాధ్యమేనని ఇప్పటికే చాలామంది నిరూపించారు. వాళ్లు ఎన్నో మార్పులు చేసుకుని, పాత జీవితాన్ని పూర్తిగా విడిచిపెట్టి ఇప్పుడు సంతోషంగా ఉంటున్నారు!