కావలికోట—అధ్యయన ప్రతి ఫిబ్రవరి 2020

ఏప్రిల్‌ 6–మే 3, 2020 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఇందులో ఉన్నాయి.

మన తండ్రైన యెహోవా మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు

మన పరలోక తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడని, మనపట్ల శ్రద్ధ తీసుకుంటాడని, మనల్ని ఎన్నడూ విడిచిపెట్టడని నమ్మకంతో ఉండవచ్చు.

మన తండ్రైన యెహోవాను మనం ఎంతో ప్రేమిస్తాం

శ్రద్ధగల మన తండ్రైన యెహోవా పట్ల మనకున్న ప్రేమను తెలియజేసే కొన్ని పనుల్ని పరిశీలించండి.

ఈర్ష్యతో పోరాడుతూ శాంతిని నెలకొల్పండి

కొన్నిసార్లు ఇతరుల మీద ఈర్ష్య పడే ప్రమాదముంది. ఈ హానికరమైన లక్షణంతో మనం ఏయే విధాలుగా పోరాడవచ్చు, శాంతిని ఎలా నెలకొల్పవచ్చు అనేవి పరిశీలించండి.

యెహోవా మీకు ఊరటను ఇవ్వనివ్వండి

హన్నా, అపొస్తలుడైన పౌలు, దావీదు రాజు ఆందోళనతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. యెహోవా వాళ్లను ఓదార్చి, ఊరడించిన విధానం నుండి మనమేం నేర్చుకోవచ్చు?

జీవిత కథ

మంచి ఆదర్శాల నుండి నేర్చుకోవడం ఎన్నో దీవెనల్ని తీసుకొచ్చింది

లేయాన్స్‌ క్రేపో తన భయాల్ని అధిగమించడానికి, తన 58 ఏళ్ల పూర్తికాల సేవలో ఎన్నో అద్భుతమైన దీవెనలు పొందడానికి నమ్మకమైన వ్యక్తులు ఎలా సహాయం చేశారో చెప్తున్నాడు.

మీకు తెలుసా?

బబులోనుకు చెందిన బెల్షస్సరు పాత్రను పురావస్తు శాస్త్రం ఎలా రూఢిపరుస్తుంది?