పాట 121
మనకు ఆత్మనిగ్రహం అవసరం
-
1. పుట్టాం అందరం పాపం నీడలో
వద్దన్నా చేస్తుంటాం పొరపాట్లెన్నో
వినదుగా, ఏం మనస్సిది?
కళ్లెం వేయాలి, తప్పదుగా…
-
2. మనం యెహోవానెంతో ప్రేమిస్తాం
వేస్తాడు సాతాను ఎన్నో ఎత్తుల్ని
మంచా? చెడా? ఏ వైపునుందాం?
తండ్రి శక్తితో మంచే చేద్దాం.
-
3. మన మాటలు, చేసే పనులు
యెహోవా పేరుకు అందం తెస్తాయి.
ప్రతీ రోజు ఓ పోరాటమే
ఆత్మనిగ్రహం చూపిస్తుందాం.
(1 కొరిం. 9:25; గల. 5:23; 2 పేతు. 1:6 కూడా చూడండి.)

