పాట 122
విశ్వాసంలో సుస్థిరం అవ్వండి
-
1. సుస్థిరం కావాలి విశ్వాసంలో
హెచ్చరించారు ప్రార్థించాలంటూ.
అల్లకల్లోలాలే భూమంతటా
ఆశ కోల్పోయారంతా.
(పల్లవి)
అంతాన్ని దాటాలంటే
లోకాన్ని వీడాల్సిందే.
అంతేలేని జీవం
ఆస్వాదిస్తూ ఉందాం.
-
2. ముందుగా గుర్తిస్తే తంత్రాలన్నీ
శోధనెంతో ఉన్నా పోరాడతాం.
మంచినే ప్రేమిస్తూ పాటిస్తుంటే,
నిశ్చలంగా సేవిస్తాం.
(పల్లవి)
అంతాన్ని దాటాలంటే
లోకాన్ని వీడాల్సిందే.
అంతేలేని జీవం
ఆస్వాదిస్తూ ఉందాం.
-
3. నిష్ఠగా చేస్తుంటే ఆరాధనే
సార్థకం ఔతుంది ఈ జీవితం.
మంచివార్త కోసం చేసే శ్రమ
కాదు వృథా ఏనాడు.
(పల్లవి)
అంతాన్ని దాటాలంటే
లోకాన్ని వీడాల్సిందే.
అంతేలేని జీవం
ఆస్వాదిస్తూ ఉందాం.
(లూకా 21:9; 1 పేతు. 4:7 కూడా చూడండి.)