మన క్రైస్తవ జీవితం
సృష్టి యెహోవా తెలివి మీద మనకున్న నమ్మకాన్ని బలపరుస్తుంది
మనకు ఏది మంచిదో యెహోవాకు తెలుసా? ఖచ్చితంగా! ఈ విషయాన్ని గుర్తిస్తూ, మనం యెహోవా నిర్దేశాన్ని పాటిస్తే తెలివిగా ప్రవర్తిస్తాం. (సామె 16:3, 9) కానీ, మన సొంత ఆలోచనలు యెహోవా నిర్దేశం మీద మనకున్న నమ్మకాన్ని సందేహించేలా చేయవచ్చు. సృష్టిలో ఉన్నవాటిని చూసి ధ్యానించడం ద్వారా యెహోవా తెలివి మీద మనకున్న నమ్మకాన్ని బలపర్చుకోవచ్చు.—సామె 30:24, 25; రోమా 1:20.
పరిణామం వల్లా? లేక సృష్టికర్త వల్లా? చీమలు ట్రాఫిక్ జామ్ కాకుండా ఎలా ప్రయాణిస్తాయి? వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:
-
చీమలు రోజు చేసే పని ఏంటి?
-
చీమలు ట్రాఫిక్ జామ్ కాకుండా ఎలా చూసుకుంటాయి?
-
ప్రయాణించే విషయంలో చీమలను చూసి మనుషులు ఏం నేర్చుకోవచ్చు?
పరిణామం వల్లా? లేక సృష్టికర్త వల్లా? బంబుల్బీ ఈగ తన వేగాన్ని ఎలా అదుపు చేసుకోగలదు? వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:
-
చిన్న విమానాల్లో ప్రయాణించేటప్పుడు మనుషులు ఎలాంటి ప్రమాదాలు ఎదుర్కొంటారు?
-
బలమైన గాలులకు పడిపోకుండా బంబుల్బీ ఈగ ఎలా ఎగురగలదు?
-
బంబుల్బీ ఈగకు ఉన్న తెలివిని చూసి భవిష్యత్తులో మనుషులు ఏం సాధించవచ్చు?
మీరు ఉంటున్న ప్రాంతంలో, యెహోవా తెలివికి సంబంధించి సృష్టిలో ఎలాంటి రుజువులు చూశారు?